బడ్జెట్ సమావేశాల నిర్వహణకు వసతుల పరిశీలన
Published Tue, Jan 19 2016 11:17 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM
తాడేపల్లి: ఏపీ బడ్జెట్ సమావేశాలను ఈ సారి గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో నిర్వహించనున్ననేపధ్యంలో శాసనసభ్యుల విడిది కోసం మంగళవారం ఉదయం స్పీకర్ కోడెల శివప్రసాద్ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కేఎల్ యూనివర్సిటీ హాస్టల్‌ను, గ్రంథాలయాన్ని పరిశీలించారు. న్యాయ పరమైన చిక్కులు లేకుంటే హాయ్ ల్యాండ్ ను కూడా పరిశీలిస్తామని స్పీకర్ చెప్పారు. అమరావతి ప్రాంతంలో అసెంబ్లీ సమావేశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Advertisement
Advertisement