బడ్జెట్ సమావేశాలు అమరావతిలోనే..
ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు జరిపే విషయం రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించాల్సి ఉందని అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు తెలిపారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు జరిపే విషయం రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించాల్సి ఉందని అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు తెలిపారు. బడ్జెట్ సమావేశాలు మాత్రం అమరావతిలోనే జరుగుతాయని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 10 ,11 ,12 తేదీల్లో అమరావతిలో జరగబోయే జాతీయ మహిళా సాధికారత సదస్సును ఏపీ అసెంబ్లీ నిర్వహించనుందని ప్రకటించారు. మహిళలను ప్రోత్సహించడం, భాగస్వామ్యాన్ని పెంచడం లక్ష్యంగా ఈ సదస్సు జరగనుందన్నారు.
రాజకీయాలకు అతీతంగా ఈ సదస్సుకు వక్తలను ఆహ్వానిస్తున‍్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్రంలొని మహిళా ప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన మహిళా ప్రముఖులు సుమారు 12 వేల మంది ఈ సదస్సుకు హాజరవుతారని చెప్పారు. సదస్సు ముగింపు సందర్భంగా మహిళా సాధికారతపై అమరావతి డిక్లరేషన్ ఉంటుందని వివరించారు.