ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగుల బదిలీలపై ఏపీ మంత్రివర్గం ఓ నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగుల బదిలీలపై ఏపీ మంత్రివర్గం ఓ నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు బదిలీల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. ఐదేళ్ల సర్వీసు దాటిని వారిని మాత్రమే బదిలీ చేయాలని స్పష్టం చేసింది.
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించకపోయినా, వాళ్ల వేతనాలను మాత్రం 50 శాతం పెంచాలని నిర్ణయించింది. కాగా రాజధాని భవనాల డిజైన్లపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గానికి నార్మన్ పోస్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.