
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా తొమ్మిది మండలాలు ఏర్పాటుచేసేందుకు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దీని ఆమోదానికి గవర్నర్‌కు పంపించనున్నారు. అలాగే, 2014 పోలీస్ యాక్ట్ సవరణకు ఆమోదం తెలిపింది. శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో పలువురు కేబినెట్ మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిజ్రాలకు పదిహేను వందల రూపాయల పెన్షన్ ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఇళ్ళ స్థలాలు, రేషన్ కార్డులు ఇవ్వాలని, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment