
చంద్రబాబుతో చినరాజప్ప భేటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో డిప్యూటీ సీఎం చినరాజప్ప సమావేశమయ్యారు. మంగళవారం చినరాజప్ప హుటాహుటిన విమానంలో హైదరాబాద్ వచ్చి చంద్రబాబును కలిశారు.
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ తనకు సమన్లు జారీ చేసే అవకాశముందని వార్తలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ అయ్యారు. చంద్రబాబు ఉన్నతాధికారులతోనూ సమావేశమై తాజా పరిణామాల గురించి చర్చిస్తున్నారు.