
సాక్షి, అమరావతి : లాక్‌డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ నెలలో పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని ముందుగానే ఈ నెల 29న అందిచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ఆదేశాలు జారీ చేశారు. బియ్యంతో పాటు కేజీ కంది పప్పును ఉచితంగా అందించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. జౌట్ సోర్సింగ్ సిబ్బందికి లాక్‌డౌన్ పిరియడ్‌కు వేతనాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. నిత్యావసర వస్తువుల పంపిణీకి ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కూరగాయలు, గృహ అవసరాలు, పాలు, గుడ్లు, మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులు, ఆక్వా, పశుగ్రాసం సరఫరా రవాణాకు అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు.
(చదవండి : టెన్త్ పరీక్షలకు అడ్డంకులు లేకుండా చర్యలు)
నలుగురు ఐఏఎస్‌ల బృందం ఏర్పాటు
కరోనావైరస్ నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఆధ్వర్యంలో నలుగురు ఏఏఎస్‌ల బృందం ఏర్పాటు చేసింది. జవహర్‌రెడ్డి నేతృత్వంలో ఈ బృందం పనిచేయనుంది. అలాగే ఐఏఎస్ అధికారులు ప్రద్యుమ్న, గిరిజా శంకర్, కార్తికేయ మిశ్రా, కన్నబాబులను వైద్య ఆరోగ్య శాఖకు అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment