విశాఖలో గవర్నర్‌కు ఘన స్వాగతం | AP Governor Biswabhusan Harichandan receives grand welcome at visakha airport | Sakshi
Sakshi News home page

విశాఖలో గవర్నర్‌ హరిచందన్‌కు ఘన స్వాగతం

Published Wed, Jul 31 2019 10:32 AM | Last Updated on Wed, Jul 31 2019 11:34 AM

AP Governor Biswabhusan Harichandan receives grand welcome at visakha airport - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. గవర్నర్‌ హోదాలో ఆయన తొలిసారి విశాఖలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ వచ్చిన గవర్నర్‌కు జిల్లా కలెక‍్టర్‌ వినయ్‌ చంద్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ మీనా, నేవీ అధికారులు స‍్వాగతం పలికారు. గవర్నర్‌ మొదట తూర్పు నావికాదళం ఆపరేషన్‌ బేస్‌ను సందర్శించి, సర్క్యూట్‌ హౌస్‌కు వెళతారు. సాయంత్రం కైలాసగిరికి వెళ్లి తెలుగు మ్యూజియం, అనంతరం డాక్టర్‌ వైఎస్సార్‌ సిటీ సెంట్రల్‌ పార్క్‌ను సందర్శిస్తారు. గురువారం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించి బ్లడ్‌ డొనేషన్‌ క్యాంపును ప్రారంభిస్తారు. అదే రోజు మధ్యాహ్నం పోర్ట్‌ ట్రస్ట్‌ని సందర్శించి అక్కడ నుంచి రాత్రికి విజయవాడ బయలుదేరనున్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement