చీమకుర్తి పట్టణం మెయిన్ రోడ్డు (ఫైల్)
సాక్షి, చీమకుర్తి (ప్రకాశం): పట్టణంతో పాటు రూరల్ ప్రాంతాలలోని గ్రామాలకు నియమించే వాలంటీర్ల సంఖ్యను అధికారులు మంగళవారం ప్రకటించారు. కమిషనర్ చంద్రశేఖరరెడ్డి ప్రకటించిన వివరాల ప్రకారం మొత్తం 83 మంది వాలంటీర్లు కావాల్సి వస్తుందని తెలిపారు. 2011 జనాభా ప్రకారమే కాకుండా 2019 నాటికి పెరిగిన ఇళ్ల ప్రకారం మొత్తం పట్టణంలో 8,270 ఇళ్లు ఉన్నట్లు తెలిపారు. దాని ప్రకారం పట్టణంలో 100 కుటుంబాలకు ఒక వాలంటీర్ చొప్పున మొత్తం 83 మంది వాలంటీర్లను నియమించనున్నట్లు కమిషనర్ తెలిపారు. 17 వార్డుల్లో వార్డుకు 4 గురు చొప్పున, మిగిలిన మూడు వార్డుల్లో వార్డుకు 5గురు వాలంటీర్లు చొప్పున కేటాయించినట్లు తెలిపారు.
గ్రామ పంచాయతీ | గృహాలు | వాలంటీర్లు |
బండ్లమూడి | 544 | 11 |
బూదవాడ | 825 | 16 |
బూసురపల్లి | 216 | 4 |
చండ్రపాడు | 780 | 16 |
విచినరాపాడు | 262 | 5 |
దేవరపాలెం | 813 | 16 |
ఏలూరివారిపాలెం | 328 | 7 |
గాడిపర్తివారిపాలెం | 412 | 8 |
గోనుగుంట | 449 | 9 |
ఇలపావులూరు | 475 | 10 |
కూనంనేనివారిపాలెం | 504 | 10 |
మంచికలపాడు | 542 | 11 |
మువ్వవారిపాలెం | 395 | 8 |
నేకునంబాద్ | 209 | 4 |
నిప్పట్లపాడు | 643 | 13 |
నాయుడుపాలెం | 856 | 17 |
పల్లామల్లి | 778 | 16 |
పిడతలపూడి | 209 | 4 |
పులికొండ | 582 | 12 |
రామచంద్రాపురం | 503 | 10 |
ఆర్.ఎల్.పురం | 870 | 17 |
తొర్రగుడిపాడు | 329 | 7 |
ఎర్రగుడిపాడు | 193 | 4 |
మొత్తం | 11717 | 235 |
రూరల్ గ్రామాలకు 235 మంది వాలంటీర్లు..
మండలంలోని రూరల్ గ్రామాలలోని 23 పంచాయితీలలో మొత్తం 235 మంది వాలంటీర్లు కావాల్సి ఉందని ఎంపీడీఓ టీవీ.కృష్ణకుమారి మీడియాకు తెలిపారు. ఎంపీడీఓ తెలిపిన వివరాల ప్రకారం రూరల్ గ్రామాలలో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ చొప్పున నియమిస్తున్నట్లు తెలిపారు. 23 పంచాయితీలలో మొత్తం 11,717 కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. దాని ప్రకారం గ్రామాల వారీగాచూసినట్లయితే వాలంటీర్ల సంఖ్య ఈ విధంగా ఉంది.
రూరల్ గ్రామాల్లో అత్యధికంగా వాలంటీర్ పోస్టులు నాయుడుపాలెం, ఆర్.ఎల్.పురం గ్రామాల్లో 17 మంది చొప్పున ఉన్నారు. ఆ తర్వాత రెండో స్థానంలో బూదవాడ, చండ్రపాడు, దేవరపాలెం, పల్లామల్లి గ్రామాల్లో 16 మంది వాలంటీర్లు చొప్పున ఉన్నారు. అందరికంటే తక్కువ వాలంటీర్లు ఉన్న గ్రామాలు బూసురపల్లి, నేకునంబాద్, పిడతలపూడి, ఎర్రగుడిపాడు గ్రామాలలో కేవలం 4 గురు చొప్పున మాత్రమే ఉన్నారు. చీమకుర్తి పట్టణంలో డిగ్రీ, గ్రామాల్లో ఇంటర్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరు తమ దరఖాస్తులను జూలై నెల 5వ తేదీ లోపు సమర్పించుకోవచ్చని ఆయా విభాగాలకు చెందిన అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment