వలంటీర్‌పై టీడీపీ నాయకుల దాడి | TDP Leaders Assault on Grama Volunteer Prakasam | Sakshi
Sakshi News home page

వలంటీర్‌పై టీడీపీ నాయకుల దాడి

Published Mon, Mar 30 2020 1:22 PM | Last Updated on Mon, Mar 30 2020 1:22 PM

TDP Leaders Assault on Grama Volunteer Prakasam - Sakshi

వలంటీర్‌తో గొడవ పడుతున్న టీడీపీ నాయకులు

చౌటగోగులపల్లి(పీసీపల్లి): ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించిన వలంటీర్‌పై టీడీపీ నాయకులు దాడి చేశారు. వివరాల్లోకి వెళితే..మండల పరిధిలోని చాటగోగులపల్లిలో వైద్య సిబ్బంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వెళ్లి వచ్చిన టీడీపీ నాయకుల ఇంటికి వలంటీర్‌ నరసింహులు వెళ్లి పిలవగా సుగమంచి ఓబుల్‌ నరేంద్ర, వారి అనుచరులు 15 మంది కలిసి అతనిపై దాడి చేశారు. దీంతో వలంటీర్‌ టీడీపీ నాయకులపై ఆదివారం ఎస్సై మధుసూదనరావుకు ఫిర్యాదు చేశారు. వలంటీర్‌పై దాడిని వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ గోపవరపు బొర్రారెడ్డి, మాజీ కో ఆప్షన్‌ సభ్యుడు ఎస్‌కే నజీర్‌ బాషాను ఖండించారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలన్నారు.

పరిటాలవారిపాలెం(సంతమాగులూరు): వలంటీర్‌పై దాడి చేసి కులం పేరుతో దూషించిన సంఘటన పరిటాలవారిపాలెంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన సతీష్‌ రేషన్‌ సరుకులు పంపిణీ చేసేందుకు వెళుతుండగా అదే గ్రామానికి చెందిన యర్రం శెట్టి వీరాంజనేయులు వలంటీర్‌ని అడ్డుకొని మా అమ్మ పింఛన్‌ తీసేస్తావా అంటూ.. కులం పేరుతో దూషించి దాడి చేశాడు. దీంతో వలంటీర్‌ మిగిలిన వలంటీర్లతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వీరాంజనేయులపై ఫిర్యాదు చేశాడు. వలంటీర్‌ ఫిర్యాదు మేరకు వీరాంజనేయులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై నసీద్‌ బాషా తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement