
'తెలంగాణతో ఏపీకి పోలిక లేదు'
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సుదీర్ఘంగా చర్చించామని ఏపీ కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కార్మిక సంఘాల నాయకులతో మంత్రివర్గ ఉపసంఘం బుధవారం భేటీ అవుతుందని చెప్పారు. 43 శాతం ఫిట్ మెంట్ తో సంబంధం లేదని, కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానులకూలంగా ఉందన్నారు.
ఫిట్ మెంట్ విషయంలో తెలంగాణ రాష్ట్రంతో ఏపీకి పోలిక లేదన్నారు. రాజధాని కోసం భూసమీకరణ ఇష్టం లేదని కోర్టుకు వెళ్లిన వారి భూములను సేకరణ ద్వారా తీసుకుంటామని అచ్చెన్నాయుడు తెలిపారు.