కోడి పందాలు నిర్వహిస్తున్న 23 మంది అరెస్ట్ | AP police arrests 23 gamblers to curb cockfight betting | Sakshi
Sakshi News home page

కోడి పందాలు నిర్వహిస్తున్న 23 మంది అరెస్ట్

Published Mon, Jan 13 2014 6:20 PM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM

AP police arrests 23 gamblers to curb cockfight betting

మచిలీపట్నం: కోడిపందాలు నిర్వహిస్తున్న 23 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 4.30 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు అధికారి తెలిపారు. కోడి పందాలను నిర్వహించకుండా కృష్ణా జిల్లాలో ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి తనఖీలను చేపట్టామని పోలీసులు తెలిపారు.
 
తనిఖీల్లో భాగంగా కైకలూరు చెక్ పోస్ట్ వద్ద 23 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 4.30 లక్షల్ని, 19 కోళ్లను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ జె ప్రభాకర రావు తెలిపారు. జిల్లాలో కోడి పందాలను నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభాకర్ రావు హెచ్చరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement