రాష్ట్ర విభజన దారుణం | Arbitrary partition of the state government as it was the TDP Polit Bureau member | Sakshi
Sakshi News home page

రాష్ట్ర విభజన దారుణం

Published Tue, Dec 24 2013 3:15 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

Arbitrary partition of the state government as it was the TDP Polit Bureau member

 విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్‌గజపతి రాజు విమర్శించారు. సోమవారం సమైక్యాం ధ్రకు మద్దతుగా కలెక్టరేట్ వద్ద ఆ పార్టీ నాయకులు ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ విభజనకు పాల్పడ డం సరికాదన్నారు. దేశంలో ఏర్పడిన భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆ దాయం ఎక్కువని, అందువల్లే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విడదీయాలని చూస్తోం దని విమర్శించారు.
 
 విభజన వల్ల రెండు ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని తెలిపారు. ఆ పార్టీ పట్ణణ అధ్యక్షుడు ప్రసాదుల రామకృష్ణ మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ప్రజలంతా ఉద్యమాలు చేస్తుంటే... కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటి దగ్గర కు ర్చోని పనికిమాలిన కబుర్లు చెబు తున్నారని విమర్శించారు. మంత్రులు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేశారన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరు గార్చ డానికే పట్టణంలో సెక్షన్ 30 అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐ.వి.పి.రాజు,  జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు కర్రోతు వెంకటనరసింగరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్.ఎన్.ఎం. రాజు, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement