శ్రీకాకుళం : జిల్లాలో డీఎస్సీ-14లో ఎస్‌జీటీ, పండిట్ పోస్టులకు ఎంపికైన వారి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. బుధవారం సాయంత్రం ఈ వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచుతున్నట్లు డీఈఓకు సమాచారం అందించారు. నోటిఫైడ్ పోస్టుల్లో 100కు పైగా పోస్టులు అర్హులు లేక బ్యాక్‌లాగ్‌గా ఉండిపోయాయి. బీసీ-ఇ కేటగిరీకి చెందిన పోస్టులే 60 వరకు బ్యాక్‌లాగ్‌గా ఉన్నాయి. 284 తెలుగు మీడియం ఎస్‌జీటీ పోస్టులు భర్తీ కావాల్సి ఉండగా 222 ఒరియా మీడియం పోస్టులు 45కు గాను 32 పోస్టులు భర్తీ అయ్యాయి.
తెలుగు పండిట్ పోస్టులు 56కు గాను 45, హిందీ పండిట్ పోస్టులు 25గాను 19, ఒరియా పండిట్ పోస్టులు 11కు గాను 2 భర్తీ అయ్యాయి. దీంతో అన్ని కేటగిరీలకు సంబంధించి 101 పోస్టులు బ్యాగ్‌లాగ్‌గా ఉన్నట్టయింది. ఎంపికైన వారి జాబితాను ఆన్‌లైన్‌లో పొందుపరచడంతోపాటు అభ్యర్థులకు నేరుగా ఎస్‌ఎంఎస్‌లు పంపించారు. వారు ధ్రువపత్రాల పరిశీలన కోసం ఎప్పుడు ఎక్కడికి హాజరుకావాలన్నది కూడా ఆ ఎస్‌ఎంఎస్‌లలో పేర్కొన్నారు. ఎంపికైన వారి జాబితాను గతంలో బహిరంగంగా ప్రకటించేవారు. ఈసారి ఆన్‌లైన్‌లోనే జాబితాను ప్రకటించడం పట్ల ఆక్షేపణలు వినిపిస్తున్నాయి.
వంద పోస్టులకు అర్హులు లేరు
Published Thu, Feb 11 2016 12:24 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement