మార్చి 1 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
Published Sun, Jan 26 2014 3:31 AM | Last Updated on Mon, Oct 8 2018 7:35 PM
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్ : జిల్లాలో మార్చి ఒకటి నుంచి తొమ్మిదవ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్టు కలెక్టర్ కాంతిలాల్‌దండే తెలిపారు. శనివారం ఆయన తన కార్యాల యంలో ఆర్మీ అధికారులు, జిల్లా అధికారులతో రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ప్రాథమిక సమావేశంలో మా ట్లాడారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలతో పాటు యానాం కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన అభ్యర్థులు ఈ ర్యాలీ లో పాల్గొనవచ్చునన్నారు. ర్యాలీ నిర్వహణకు తాత్కాలికంగా పోలీస్ శిక్షణా కేంద్రం గ్రౌండ్స్, మహారాజా కళాశాల మైదానాలను ఎంపిక చేయగా... మెడికల్ చెకప్‌కు ఆనంద గజపతి ఆడిటోరియూన్ని వినియోగించాలని సూచించారు.
ఆర్మీ అధికారి కల్నల్ పిపి సింగ్ మాట్లాడుతూ ఆర్మీలో సేవలందించడానికి నీతి, నిజాయితీ, శరీర దారుఢ్యం ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయటానికి ఈ ర్యాలీ నిర్వహిస్తు న్నట్టు తెలిపారు. ఎంపిక ప్రక్రియలో అభ్యర్థులు వివిధ దశలు దాటి రాత పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుందన్నారు. ఎంపిక ప్రక్రియ అత్యంత పార దర్శకంగా ఎలాంటి అనుమానాలకు తావులేకుండా చేపడతామని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్పీ తఫ్సీర్ ఇక్బాల్, అదనపు జాయింట్ కలెక్టర్ యూసీజీ నాగేశ్వరరావు, ఆర్‌డీఓ వెంకటరావు, ఆర్మీ సుబేదార్ పండిట్, సైనిక సంక్షేమ అధికారి రాజారావు, తదితరులు పాల్గొన్నారు.
ర్యాలీపై విస్తృత ప్రచారం చేయూలి : కలెక్టర్
మార్చి ఒకటి నుంచి జిల్లాలో జరిగే ఆర్మీ రిక్రూట్‌మెం ట్ ర్యాలీపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
జిల్లాలోని ఐకేపీ, గ్రామైఖ్య సంఘాల ప్రతినిధులు ప్రాంతాల వారీగా ప్రచారం చేయాలన్నారు. అలాగే ర్యాలీ నిర్వహణకు అవసరమయ్యే మౌలిక వసతులు, ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Advertisement