పరీక్షకు సిద్ధం
Published Sun, Feb 2 2014 3:05 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్:జిల్లా స్థాయిలో భారీ సంఖ్యలో నిరుద్యోగుల అదృష్టానికి జరుగుతున్న పరీక్షలకు రంగం సిద్ధమైంది. ఆదివారం జరగనున్న వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు కేటగిరీల్లో 253 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న 53,360 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. పరీక్షలకు సంబంధించిన సామగ్రిని, సిబ్బందిని శనివారం సాయంత్రానికే ఆయా కేంద్రాలకు తరలించారు. జిల్లా, డివిజన్ కేంద్రాలతో పాటు అన్ని మండల కేంద్రాల్లో మొత్తం 148 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడంతో రెవెన్యూ యంత్రాంగం ఆయా కేంద్రాల్లో సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమైంది. అన్ని కేంద్రాలకు సిబ్బందిని, సూపరింటెండెంట్లను, రూట్ అధికారులను నియమిం చారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు, తా గునీటి సౌకర్యం కల్పిం చడంతోపాటు విద్యుత్ అంతరాయం కలగకుండా ట్రాన్స్‌కో అధికారులు చర్యలు తీసుకున్నారు.
లాడ్జీలు, బస్సులు కళకళ
కాగా జిల్లా అంతటా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ఒక ప్రాంతం వారిని మరో ప్రాంతంలోని కేంద్రాలు కేటాయించడంతోపాటు, పక్క జిల్లాలవారు కూడా ఇక్కడ పరీక్షలు రాస్తుండటంతో, అటువంటి వారిలో చాలామంది శనివారం సాయంత్రానికే ఆయా ప్రాం తాలకు చేరుకున్నారు. దీంతో లాడ్జీలు, బస్సులు, హోటళ్లు రద్దీగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా శ్రీకాకుళం, పాల కొండ, రాజాం, నరసన్నపేట, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, పాతపట్నం తదితర ప్రాంతాలు అభ్యర్థుల రద్దీ కనిపిస్తోంది. ఎక్కువ సంఖ్యలో ఉన్న మహిళా అభ్యర్థులు ఇప్పటికే పరీక్ష కేంద్రానికి సమీప పట్టణాల్లో ఉన్న తమ బంధువు లు, స్నేహితుల ఇళ్లకు శనివారం సాయంత్రానికే చేరుకున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ అధికారులు కూడా విశాఖపట్నం నుంచి 40 బస్సులు తెప్పించి జిల్లాలో 70 అదనపు బస్సు సర్వీసులు వేశారు. ఆదివారం సాయం త్రం వరకు నడుస్తాయని చెప్పారు.
వీటిని గుర్తుంచుకోండి
గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలి.
హాల్ టిక్కెట్ తెచ్చుకోవాలి.
పరీక్షకు గంట ముందు కేంద్రానికి చేరుకోవాలి.
హాల్ టిక్కెట్‌పై ఫొటో లేకపోయినా, అస్పష్టంగా ఉన్నా, చిన్నగా ఉన్నా, ఫొటో దిగువన సంతకం లేకపోయినా.. సదరు అభ్యర్ధులు గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించిన మూడు పాస్‌పోర్టు ఫొటోలు తీసుకొచ్చి ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి.
హాల్ టిక్కెట్ నంబర్, కోడ్, పేరు, సబ్జెక్టు, పరీక్షా కేంద్రం వివరాలను నిర్దేశించిన బాక్సుల్లో బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్‌తోనే నింపాలి. జెల్‌పెన్ లేదా పెన్సిల్ ఉపయోగించరాదు.
ఓఎంఆర్ షీట్‌లపై దిద్దుబాట్లు ఉండకూడదు, వైట్ ఫ్లూయిడ్ పెట్టకూడదు.
ఆలస్యంగా వచ్చే అభ్యర్థులను అనుమతించరు. పరీక్ష సమయం ముగియకముందు బయటకు పంపించరు.
ఓఎంఆర్ షీట్‌పై విధిగా హాల్‌టిక్కెట్ నెంబరు వేయాలి, సంతకంతో పాటు బొటన వేలి ముద్ర కూడా వేయాలి.
విషయం వీఆర్‌ఓ వీఆర్‌ఏ
పరీక్ష సమయం 10 నుంచి 12 3 నుంచి 5
పోస్టుల సంఖ్య 77 176
అభ్యర్థుల సంఖ్య 50,730 2,630
Advertisement