నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
Published Thu, Jan 30 2014 1:56 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: వీఆ ర్వో, వీఆర్‌ఏ పరీక్షలకు ఒక్క క్షణం ఆల స్యంగా వచ్చినా అనుమతించేదిలేదని అదనపు జాయింట్ కలెక్టర్ ఆర్.ఎస్.రాజ్‌కుమార్ చెప్పారు. బుధవారం ఆయ న కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని. దూరప్రాంతాల్లోని పరీక్షా కేంద్రాలకు బస్సు సదుపాయం కల్పిస్తున్నామన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. వికలాంగులకు స్క్రైబ్‌లను ఏర్పాటు చేసే అధికారం ఆ పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్లుకి ఉందని, పదోతరగతి చదివిన వారిని ఏర్పాటు చేయాలని చెప్పారు. అంధులకు గంటకు పది నిమిషాల వంతున అదనపు సమయం ఉంటుందన్నారు. ఫిబ్రవరి 2న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ వీఆర్వో, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ వీఆర్‌ఏ పోస్టులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 148 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. 77 వీఆర్వో పోస్టులకు 50,730 మంది, 176 వీఆర్‌ఏ పోస్టులకు 2630 మంది దరఖాస్తు చేశారు. వీఆర్‌ఏ పరీక్షలు 4 కేంద్రాల్లో జరుగుతాయమని తెలపారు.
అభ్యర్థులకు ఇవీ సూచనలు
పరీక్షా కేంద్రానికి హల్ టిక్కెట్టు మాత్రమే తీసుకురావాలి.
గంట ముందుగా రావాలి.
హల్ టిక్కెట్‌పైన ఫొటో లేకపోయినా, అస్పస్టంగా ఉన్నా, చిన్న ఫొటో ఉన్న, సంతకం లేకపోయినా, సదరు అభ్యర్థులు ఎవరైనా గజిటెడ్ అధికారతో అటెస్ట్ చేయించిన మూడు ఫొటోలు తీసుకొని వచ్చి ఇన్విజిలేటరుకి ఇవ్వాలి.
ప్రశ్నపత్నం, జవాబు పత్రం నింపేముందు వాటిపై ముంద్రించిన నిబంధనలు పూర్తిగా చదివి హల్ టిక్కెట్ నంబర్, కోడ్, పేరు, సబ్జెక్టు, పరీక్షా కేంద్రం బాల్ పెన్‌తో నిరేసించిన బాక్సుల్లో నింపాలి.
సెల్‌ఫోన్లను అనుమతించరు.
బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ మాత్రమే వాడాలి. జెల్ పెన్ లేదా పెన్సిల్ వినియోగించరాదు.
వోఎంఆర్ షీట్‌లను జాగ్రత్తగా నింపాలి. వాటిపై దిద్దుబాట్లు ఉండరాదు లేదా వైట్‌ఫ్లూయిడ్ పెట్టరాదు.
పరీక్ష ముగియకుండా బయటకు పంపించరు.
వోఎంఆర్ షీట్లపై విధిగా హాల్‌టిక్కెట్ నంబర్లు వేయాలని, సంతకంతో పాటు బొటన వేలిముద్ర వేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఇన్విజిలేటర్లు ఓఎంఆర్ షీటుపై సంతకం చేసే ముందు ప్రతి అంశాన్ని పూర్తిగా పరిశీలించాలని అన్నారు.
Advertisement