సాక్షి, ఏలూరు : కొత్త సంవత్సరం ఎన్నికలను వెంటబెట్టుకు రాబోతోంది. వచ్చే మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహిం చేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభిం చింది. ఇందులో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో సోమవారం హైదరాబాద్‌లో సమావేశం నిర్వహిం చింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో అటు నేతల్లోను, ఇటు అధికారుల్లోను టెన్షన్ మొదలైంది. ప్రజల్లోకి వెళ్లేందుకు రాజకీయ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మరోవైపు పెండింగ్ బిల్లులను రాబట్టుకోవడానికి నివేదికలు పంపిస్తున్నారు. ఇప్పటివరకూ వరుస విపత్తులతో ఏర్పడిన నష్టాలకు సంబంధించి రావాల్సిన బిల్లులను ప్రభుత్వం అడిగిన పద్ధతిలో జిల్లా అధికారులు పంపించారు. ఎన్నికల కోడ్ మూణ్ణెళ్ల ముచ్చట
అమలులోకి వస్తే నిధుల విడుదలకు ఆటంకం ఏర్పడుతుందని, ప్రభుత్వమే మారిపోతే పెండింగ్ బిల్లులు ఎప్పటికి విడుదలవుతాయో చెప్పలేమనే భయంతో హుటాహుటిన నివేదికలు పంపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
వారుుదాల మీద వారుుదాలు
జిల్లాలో 256 సహకార సంఘాల పాలకవర్గాల పదవీకాలం 2010 అక్టోబర్ 21, 25 తేదీలతో ముగియగా, ఆరుసార్లు వీటి కాలపరిమితిని పొడిగించారు. ఎట్టకేలకు ఈ ఏడాది జనవరిలో ఎన్నికలు జరిపారు. 2011లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవీకాలం ముగియడంతో జిల్లాలో 884 పంచాయతీలు అనాథలుగా మిగిలితే వాటికి ఈ ఏడాది జూలైలో ఎన్నికలు నిర్వహించారు. వీటికంటే ముందే జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థ, ఎనిమిది పురపాలక సంఘాల పాలకవర్గాలు పదవీ కాలాన్ని ముగించుకున్నాయి. 2010 సెప్టెంబర్‌తోనే వీటి గడువు ముగిసింది. అప్పటినుంచి ప్రత్యేకాధికారులను నియమించి, ప్రతి ఆరునెలలకు వారిని పొడిగిస్తూ పాలన సాగిస్తున్నారు. 2011లోనే 46 జెడ్పీటీసీ, 884 ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం ముగిసింది. ఏళ్ల తరబడి వీటికి ఎన్నికలు జరపకుండా తాత్సారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పట్లో పురపాల ఎన్నికలు జరపలేమని హైకోర్టుకు చెబుతోంది. అయినప్పటికీ కొత్త సంవత్సరంలో ఎన్నికలు జరపక తప్పదు. దీంతో ఎన్నికల సంఘం బీసీ ఓటర్ల జాబితాలను ఇప్పటికే సేకరించింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా వచ్చే ఏడాది మార్చిలోపు ఎన్నికలు జరపాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతోంది.
హడలిపోతున్న కాంగ్రెస్, టీడీపీ
రానున్న మూడు ఎన్నికల్లో వచ్చే ఫలితాలు సార్వత్రిక ఎన్నికలలో రాజకీయ పార్టీల భవితవ్యాన్ని నిర్దేశించనున్నాయి. పంచాయతీ, సహకార ఎన్నికల్లో అడ్డదారులు తొక్కినా, అరాచకాలకు పాల్పడినా ఆశించిన ఫలితాలు సాధించలేకపోరుున అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ రాష్ట్రంలో చేజిక్కుంచుకోవాలంటే ఈ ఎన్నికల్లో సత్తా చాటాల్సిఉంది. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీలను విభజన ద్రోహులుగా చూస్తున్న జనం ఆ పార్టీలకు తమ ఓటుతో బుద్ధిచెప్పే సమయం కోసం ఎదురుచూస్తున్నారు. దీనిని గమనించిన ఆ పార్టీల నేతలు ఎన్నికలంటేనే హడలిపోతున్నారు. మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు కూడా కొందరు సాహసం చేయలేకపోతున్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్ర కోసం అవిశ్రాంత పోరాటం చేస్తూనే ప్రజా సమస్యలపైనా ఉద్యమాలు చేస్తూ ప్రజలకు చేరువవుతోంది. ఆ పార్టీ నాయకులు నిత్యం ప్రజలమధ్య ఉంటూ వారికి భరోసా ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల మధ్యకు వెళ్లలేక కాంగ్రెస్, టీడీపీ శ్రేణులు హడలెత్తిపోతున్నారుు.
మార్చి నాటికి మునిసిపల్, జిల్లా పరిషత్,మండల పరిషత్ ఎన్నికలు
Published Tue, Dec 24 2013 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM
Advertisement