కలెక్టర్ బదిలీపై కేంద్రమంత్రి అశోక్ అసంతృప్తి | Ashok Gajapathi Raju dissatisfied with district collector traster | Sakshi
Sakshi News home page

కలెక్టర్ బదిలీపై కేంద్రమంత్రి అశోక్ అసంతృప్తి

Published Wed, Jul 9 2014 2:10 PM | Last Updated on Thu, Mar 21 2019 8:29 PM

కలెక్టర్ బదిలీపై కేంద్రమంత్రి అశోక్ అసంతృప్తి - Sakshi

కలెక్టర్ బదిలీపై కేంద్రమంత్రి అశోక్ అసంతృప్తి

హైదరాబాద్ : విజయనగరం జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే బదిలీపై కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు, ఆంధ్రప్రదేశ్ మంత్రి మృణాళిని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంతిలాల్ దండేనే విజయనగరం జిల్లా కలెక్టర్గా కొనసాగించాలని వారు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావును కోరారు. కాగా కాంతిలాల్ దండే గుంటూరు కలెక్టర్గా బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో కలెక్టర్ గా ముదావత్ ఎం.నాయక్ నియమితులయ్యారు.

దండే తనదైన శైలిలో జిల్లా అధికార యంత్రాంగాన్ని నడిపించారు. పలు కీలక సమయాల్లో సమర్థంగా నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు. జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన అనతికాలంలోనే వచ్చిన పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, సాధారణ ఎన్నికలను చాకచక్యంగా నిర్వహించగలిగారు. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో చెలరేగిన నిరసనల సమయంలో అప్రమత్తంగా వ్యవహరించారు. ముఖ్యంగా కర్ఫ్యూ సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement