కొరిటెపాడు(గుంటూరు): గ్రామీణ ప్రజలకు ఎన్‌టీఆర్ సుజల స్రవంతి పథకం క్రింద రక్షిత తాగునీరు అందించేందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను ఈ నెల 27వ తేదీలోగా తమకు అందించాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. పథకం అమలుపై కలెక్టరేట్‌లోని డీఆర్‌సీ సమావేశ మందిరంలో అధికారులకు గురువారం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 2 నుంచి పథకం అమలు ప్రారంభమవుతుందని తెలిపారు. దీనిద్వారా 20 లీటర్ల శుద్ధ జలాన్ని కేవలం రెండు రూపాయలకే అందిస్తామని చెప్పారు.
సమస్యాత్మకమైన ఆవాస ప్రాంతాలను గుర్తించి ఆర్‌ఓ ప్లాంట్ల ఏర్పాటుకు సిఫారసు చేయాలని ఆర్‌డ బ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. మండల స్థారుులో ఎంపీడీవోలు, తహశీల్దార్లు, ప్రత్యేకాధికారులు బృందాలుగా ఏర్పడి గ్రామాల్లో విస్తృత స్థాయి సర్వే నిర్వహించి నీటి వనరులను గుర్తించి వాటి నమూనాలను సేకరించాలన్నారు. అవసరమైన చోట ఆర్‌ఓ ప్లాంట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ నీటి పారుదల శాఖ ఇప్పటికే 48 శాతం ఆవాస ప్రాంతాలను గుర్తించిందని తెలిపారు.
ప్రధానంగా నరసరావుపేట, తెనాలి డివిజన్లలో ఎస్సీ, ఎస్టీలు నివసిస్తున్న ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. ఆర్‌ఓ ప్లాంట్ల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆర్‌డీవోలు తమ పరిధిలోని పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, సోషల్ గ్రూపులతో సమావేశాలు నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.
ప్రతి బ్యాంక్ బ్రాంచి ఒక గ్రామంలో ఆర్‌ఓ ప్లాంట్ ఏర్పాటుకు సహకారం అందించేలా చూడాలని లీడ్ బ్యాంక్ మేనేజర్‌ను కోరారు. బోరు బావులున్న హాస్టళ్లలో ఆర్‌ఓ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంక్షేమ అధికారులను ఆదేశించారు. పంచాయతీల్లో పరిస్థితిపై జిల్లా పంచాయతీ అధికారి దృష్టి సారించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఏజేసీ కె.నాగేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ వేణు, పారిశ్రామిక వేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ సుజల స్రవంతిపై 27లోగా ప్రణాళిక
Published Fri, Aug 22 2014 1:52 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
Advertisement
Advertisement