
సాక్షి, తూర్పుగోదావరి : ఏఎస్‌ఓ అధికారి మహిళ ఉద్యోగిని పట్ల అనుచితంగా ప్రవర్తించమే గాక తీవ్రంగా దుర్భాషలాడిన ఘటన గురువారం జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రసన్న కుమారి పౌర సరఫరా శాఖలో మహిళా ఉద్యోగినిగా పనిచేస్తుంది. అదే కార్యాలయంలో పీతల సురేష్ ఏఎస్‌ఓగా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సురేష్ ప్రసన్నకుమారి పట్ల అనుచిత వాఖ్యలు చేయడమే గాక తీవ్రంగా దుర్భాషలాడాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రసన్న కుమారి బంధువులు డిఎస్‌వో చాంబర్‌లో సురేష్ పై దాడికి యత్నించగా అక్కడే ఉన్న డిఎస్‌వో ప్రసాదరావు వారికి సర్దిచెప్పి పంపిచేశారు. కాగా, ఈ ఘటనను ఖండించిన మహిళా సంఘాలు సురేష్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించాయి.