Female employee
-
వడ్డీ వ్యాపారి లైంగిక వేధింపులు
గుంటూరు: వడ్డీకి డబ్బులు తీసుకుంటే.. ఆ వడ్డీ వ్యాపారి, తనకు పరిచయస్తుడైన వ్యక్తితో కలసి లైంగిక వేధింపులకు దిగడంతో సోమవారం ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేసింది. గుంటూరు కలెక్టరేట్లోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో షేక్ అజీమున్నీసా సీనియర్ అసిస్టెంట్. 2009లో భర్త హుసేన్ మరణానంతరం ఆమెకు ఉద్యోగం వచ్చింది. ఇద్దరు పిల్లల చదువు నిమిత్తం స్వగ్రామం నరసరావుపేటకు చెందిన ఇన్నమూరి మాధవరావు ద్వారా వడ్డీ వ్యాపారి మట్టా ప్రసాదు వద్ద రూ.5 వడ్డీకి రూ.3 లక్షలు అప్పు తీసుకుంది. ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులిచ్చింది. ప్రతి నెలా రూ.15 వేలు వడ్డీ చెల్లిస్తోంది. అయినా వారిద్దరూ ఒత్తిడి చేసి ఏటీఎం కార్డు కూడా తీసుకున్నారు. రెండున్నరేళ్లలో రూ.8 లక్షలు డ్రా చేసుకున్నా.. అప్పుతీరలేదంటూ కోర్టులో కేసు వేశారు. కేసు తొలగించాలన్నా తమ కోరిక తీర్చాలని వేధిస్తున్నారు. దీనిపై రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అనంతరం డీపీవో ఆవరణలోని క్యాంటీన్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో పడివున్న ఆమెను జీజీహెచ్‌కు తరలించారు. వడ్డీ వ్యాపారి వేధింపుల విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ సీహెచ్ విజయారావు వెంటనే నిందితులను అదుపులోకి తీసుకొని బాధితురాలికి అండగా నిలవాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వడ్డీ వ్యాపారుల వివరాలను సేకరించాలని కిందిస్థాయి అధికారులకు సూచించారు. -
మహిళా ఉద్యోగినిపై దుర్భాషలాడిన ఏఎస్ఓ అధికారి
సాక్షి, తూర్పుగోదావరి : ఏఎస్ఓ అధికారి మహిళ ఉద్యోగిని పట్ల అనుచితంగా ప్రవర్తించమే గాక తీవ్రంగా దుర్భాషలాడిన ఘటన గురువారం జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రసన్న కుమారి పౌర సరఫరా శాఖలో మహిళా ఉద్యోగినిగా పనిచేస్తుంది. అదే కార్యాలయంలో పీతల సురేష్ ఏఎస్ఓగా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సురేష్ ప్రసన్నకుమారి పట్ల అనుచిత వాఖ్యలు చేయడమే గాక తీవ్రంగా దుర్భాషలాడాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రసన్న కుమారి బంధువులు డిఎస్వో చాంబర్లో సురేష్ పై దాడికి యత్నించగా అక్కడే ఉన్న డిఎస్వో ప్రసాదరావు వారికి సర్దిచెప్పి పంపిచేశారు. కాగా, ఈ ఘటనను ఖండించిన మహిళా సంఘాలు సురేష్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించాయి. -
బీఎస్ఎన్ఎల్ తీరుపై హైకోర్టు ఆక్షేపణ
- మరణించిన ఉద్యోగి ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వని అధికారులు - వడ్డీతో సహా చెల్లించాలని అధికారులకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: మృతి చెందిన ఓ మహిళా ఉద్యోగికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలను ఆమె కుటుంబ సభ్యులకు అందచేసే విషయంలో బీఎస్ఎన్ఎల్ అధికారులు వ్యవహరించిన తీరును ఉమ్మడి హైకోర్టు తప్పు పట్టింది. ఆర్థిక ప్రయోజనాలు అందుకోవాలంటే మృతురాలితో ఉన్న బంధుత్వానికి సంబంధించి కోర్టు నుంచి వారసత్వ ధృవీకరణ పత్రం తీసుకురావాల్సిందేనని ఆమె భర్త, కుమారుడిని బీఎస్ఎన్ఎల్ అధికారులు ఒత్తిడి చేయడంపై మండిపడింది. మృతురాలికి చెందిన ఆర్థిక ప్రయోజనాలన్నింటినీ వడ్డీతో సహా ఆమె భర్త, కుమారుడికి చెల్లించాలని అధికారులను ఆదేశించింది. బీఎస్ఎన్ఎల్ వద్ద మృతురాలి భర్త, కుమారుడు ఎవరనే వివరాలు స్పష్టంగా ఉన్నా, మళ్లీ వారసత్వ ధృవీకరణ పత్రం తీసుకురావాలనడంలో ఔచిత్యమేమిటో అర్థం కావడం లేదని పేర్కొంది. ఆర్థిక ప్రయోజనాల చెల్లింపు విషయంలో కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. క్యాట్ ఉత్తర్వులను సవాలు చేస్తూ బీఎస్ఎన్ఎల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ నక్కా బాలయోగితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. పి.లక్ష్మీసామ్రాజ్యం బీఎస్ఎన్ఎల్లో సూపర్ వైజర్‌గా పనిచేస్తూ మృతి చెందారు. ఆమెకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ఇవ్వకపోవడంతో ఆమె భర్త, కుమారుడు క్యాట్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన క్యాట్... ఆమె భర్త, కుమారుడికి ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వాలని బీఎస్ఎన్ఎల్ అధికారులను ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై బీఎస్ఎన్ఎల్ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన ధర్మాసనం.. బీఎస్ఎన్ఎల్ అధికారుల తీరును తప్పుపడుతూ తీర్పునిచ్చింది. -
మహిళా ఉద్యోగిపై దాడి
lపరిస్థితి ఆందోళనకరం పోలీసు స్టేషన్లో లొంగిపోయిన భర్త విధులు ముగించుకుని ఇంటికి బయల్దేరిన డీజిల్‌షెడ్ కార్యాలయ సూపరింటెండెంట్ సుకన్య (37)పై గుర్తు తెలియని వ్యక్తులు వేటకొడవళ్లు, కత్తులతో దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.... పట్టణంలోని డీఆర్ఎం కార్యాలయం పర్సనల్ బ్రాంచ్ విభాగంలో పని చేస్తున్న సుకన్య నాలుగు రోజుల కిందట డీజిల్‌షెడ్‌కు బదిలీ అయ్యారు. సోమవారం సాయంత్రం డ్యూటీ ముగించుకొని ఇంటికి బయలుదేరారు. ఆర్పీఎఫ్ చెక్‌పోస్టు వద్దకు రాగానే కాపు కాచిన నలుగురైదుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై మారణాయుధాలతో దాడి చేశారు. ముఖం, చేయి, కుడికాలు, కడుపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. కొన ఊపిరితో ఉన్న ఆమెను సహోద్యుగులు సమీపంలోని రైల్వే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు. రూరల్ సీఐ గురుప్రసాద్, వన్‌టౌన్ ఎస్ఐ నగేష్‌బాబులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే ఉద్యోగులతో ఆస్పత్రి కిటకిట విషయం తెలుసుకున్న ఏడీఆర్ఎం సుబ్బరాయుడు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు రైల్వే ఆస్పత్రికి తరలివచ్చారు. సీనియర్ డీఎంఈ (డీజిల్) గోపాల్, డీపీఓ మాలతి, మజ్దూర్ యూనియన్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎస్.విజయ్‌కుమార్, ఎంప్లాయీస్ సంఘ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి కే.ప్రభాకర్ తదితరులు సుకన్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆర్పీఎఫ్ కమాండెంట్ ఎలీషా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రాణహానిపై వారం కిందటే ఫిర్యాదు రైల్వే ఉద్యోగి సుకన్య 13 ఏళ్ల కిందట రఘు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. వీరి మధ్య సఖ్యత లేకపోవడంతో వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. ప్రస్తుతం రఘు ఇద్దరు పిల్లలతో వేరు కాపురముంటున్నాడు. రఘు తరచూ ఆమె పని చేసే కార్యాలయం వద్దకు వెళ్లి గొడవ పడుతుండేవాడని తెలిసింది. భర్త వల్ల తనకు ప్రాణహాని ఉందని సుకన్య వారం రోజుల కిందట వన్‌టౌన్ పోలీసుస్టేçÙన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కసారిగా మారణాయుధాలతో కొందరు సుకన్యపై దాడిచేశారు. కొన ఊపిరితో పోరాడుతున్న సుకన్య భర్త రఘు పేరు చెబుతుండటంతో సహా ఉద్యోగులు, స్థానికులు పోలీసులకు తెలిపారు. లొంగిపోయిన భర్త: సుకన్య భర్త రఘు రాత్రి పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. తన భార్యపై తానే హత్యాయత్నం చేయించినట్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. -
సీఐడీ సీఐ దయాకర్‌రెడ్డి అరెస్టు
కరీంనగర్ క్రైం: మహిళను వేధింపులకు గురిచేసిన కేసులో సీఐడీ సీఐ దయాకర్‌రెడ్డి అరెస్టయ్యూరు. సోమవారం పోలీసులు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. కరీంనగర్ కలెక్టరేట్లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి భర్త చనిపోవడంతో తన కుమారుడితో కలిసి స్థానిక శ్రీనగర్‌కాలనీలోని నివాసం ఉం టోంది. ఏఎస్సై మోహన్‌రెడ్డికి సమీప బంధువైన ఆమెను అక్రమ ఫైనాన్స్ వ్యవహారంలో సీఐడీ అధికారులు విచారణ కోసం పిలిపించారు. సీఐడీలో విచారణ అధికారిగా ఉన్న సీఐ దయాకర్‌రెడ్డి మహిళ ఫోన్ నంబరు తీసుకుని తరచూ ఫోన్లు చేసి వేధించడం ప్రారంభించాడు. వాట్సప్‌లోనూ పలు మెసేజ్‌లు పెట్టాడు. ఇవి శ్రుతిమించడంతో భరించలేని మహిళ ఈ నెల 2న కరీంనగర్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎమ్మెస్‌లు, వాట్సప్ మెసేజ్‌ల ఆధారంగా కరీంనగర్ టుటౌన్ పోలీసులు సీఐడీ సీఐ దయాకర్‌రెడ్డిపై నిర్భయ కేసు నమోదు చేశారు. అనంతరం మహిళ నుంచి ఫోన్ స్వాధీనం చేసుకుని నిర్ధారణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఈ మేరకు నివేదికలను ఉన్నతాధికారులకు పంపడంతో ఈ నెల 4న సీఐ దయాకర్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటువేశారు. అనంతరం పోలీసులకు అందుబాటులో లేకుండా పోయిన దయాకర్‌రెడ్డిని సోమవారం అరెస్టు చేసి జిల్లా అదనపు జూడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ మాధవి ముందు హాజరుపరిచారు. ఆయన 14 రిమాండ్ విధించిన అనంతరం... ఇద్దరి పూచీకత్తుపై బెరుుల్ మంజూరు చేశారు. -
‘టెరీ’ చీఫ్‌గా ఆర్కే పచౌరీ తొలగింపు
బెంగళూరు: మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టెరీ(ద ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్) డెరైక్టర్ జనరల్ రాజేంద్ర కుమార్ పచౌరీ ఆ పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. బెంగళూరులో గురువారం టెరీ పాలక మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టెరీ నూతన చీఫ్‌గా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) డెరైక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ మాథుర్‌ను నియమిస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. మాథుర్ త్వరలోనే బాధ్యతలు చేపడతారని టెరీ ఒక ప్రకటనలో తెలిపింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై టెరీ అంతర్గత ఫిర్యాదుల కమిటీ నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం దీనిపై కోర్టు స్టే అమలులో ఉందని పేర్కొంది. పర్యావరణ పరిశోధన సంస్థ అయిన టెరీ వ్యవస్థాపకుడిగా ప్రపంచ పర్యావరణవేత్తగా అంతర్జాతీయ ఖ్యాతినొందిన 74 ఏళ్ల పచౌరీ ఒక సీనియర్ ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అపఖ్యాతిపాలయిన సంగతి తెలిసిందే. -
సన్ టీవీ నిర్వాహకుడి అరెస్ట్
టీనగర్: మహిళా ఉద్యోగి ఫిర్యాదుతో సన్ టీవీ నిర్వాహకుడిని క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై అన్నానగర్ ఈస్ట్ బుజుల్లా గార్డెన్ అపార్టుమెంటుకు చెందిన ప్రవీణ్ (51). ఈయన సన్‌టీవీలో నెట్వర్క్ అధికారి. ముంబైకి చెందిన దీపి శివన్ (38) సూర్య టీవీలో ప్రోగ్రామ్ అధికారి. తరువాత ప్రవీణ్ విధుల నుంచి రిలీవ్ అయి ముంబై వెళ్లారు. దీప్తిశివన్ నాలుగు నెలల క్రితం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఒక ఫిర్యాదు చేశారు. అందులో తనకు రావాల్సిన వేతన బకాయిలు 36లక్షలు ఇవ్వకుండా మోసగిస్తున్నారని, తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు సంబంధిత పోలీస్‌స్టేషన్ లో చేసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కొద్ది రోజుల క్రితం దీపిశివన్ చెన్నై సెంట్రల్ క్రైంబ్రాంచ్‌లో మళ్లీ ఒక ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు వెంటనే విచారణ జరపాలని పోలీసు కమిషనర్ జార్జ్ ఉత్తర్వులు ఇచ్చారు. సెంట్రల్ క్రైంబ్రాంచ్ అడిషినల్ కమిషనర్ ఆధ్వర్యంలో డెప్యూటీ కమిషనర్ జయకుమార్ ఆధ్వర్యంలో అడిషినల్ కమిషనర్ శ్యామల దీని గురించి విచారణ జరిపారు. విచారణ తరువాత గురువారం రాత్రి అన్నానగర్ ఇంటిలో ఉన్న ప్రవీణ్‌ను సెంట్రల్ క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈయన్ను కోర్టులో హాజరు పరచి జైలుకు తరలించారు.