సీఐడీ సీఐ దయాకర్‌రెడ్డి అరెస్టు | CID CI arrested in the harassing case | Sakshi
Sakshi News home page

సీఐడీ సీఐ దయాకర్‌రెడ్డి అరెస్టు

Published Tue, Apr 19 2016 4:49 AM | Last Updated on Sat, Aug 11 2018 8:21 PM

CID CI arrested in the harassing case

కరీంనగర్ క్రైం: మహిళను వేధింపులకు గురిచేసిన  కేసులో సీఐడీ సీఐ దయాకర్‌రెడ్డి అరెస్టయ్యూరు. సోమవారం పోలీసులు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి భర్త చనిపోవడంతో తన కుమారుడితో కలిసి స్థానిక శ్రీనగర్‌కాలనీలోని నివాసం ఉం టోంది. ఏఎస్సై మోహన్‌రెడ్డికి సమీప బంధువైన ఆమెను అక్రమ ఫైనాన్స్ వ్యవహారంలో సీఐడీ అధికారులు విచారణ కోసం పిలిపించారు.

సీఐడీలో విచారణ అధికారిగా ఉన్న సీఐ దయాకర్‌రెడ్డి మహిళ ఫోన్ నంబరు తీసుకుని తరచూ ఫోన్లు చేసి వేధించడం ప్రారంభించాడు. వాట్సప్‌లోనూ పలు మెసేజ్‌లు పెట్టాడు. ఇవి శ్రుతిమించడంతో భరించలేని మహిళ ఈ నెల 2న కరీంనగర్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  ఎమ్మెస్‌లు, వాట్సప్ మెసేజ్‌ల ఆధారంగా కరీంనగర్ టుటౌన్ పోలీసులు సీఐడీ సీఐ దయాకర్‌రెడ్డిపై నిర్భయ కేసు నమోదు చేశారు. అనంతరం మహిళ నుంచి ఫోన్ స్వాధీనం చేసుకుని నిర్ధారణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఈ మేరకు నివేదికలను ఉన్నతాధికారులకు పంపడంతో ఈ నెల 4న సీఐ దయాకర్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటువేశారు. అనంతరం పోలీసులకు అందుబాటులో లేకుండా పోయిన దయాకర్‌రెడ్డిని సోమవారం అరెస్టు చేసి  జిల్లా అదనపు జూడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ మాధవి ముందు హాజరుపరిచారు. ఆయన 14 రిమాండ్ విధించిన అనంతరం... ఇద్దరి  పూచీకత్తుపై బెరుుల్ మంజూరు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement