వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు తాహశీల్దార్ యాదగిరి నివాసంపై ఏసీబీ అధికారులు గురువారం ఉదయం దాడులు నిర్వహించారు. ఆత్మకూరు మండల పరిధిలోని ఓ రేషన్ డీలర్ నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటున్న యాదగిరిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
రేషన్ డీలర్షిప్ రెన్యూవల్ చేసేందుకు ఎంఆర్ఓ యాదగిరి అధిక మొత్తంలో రేషన్ డీలర్ను డిమాండ్ చేశారు. దాంతో రేషన్ డీలర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దాంతో వలపన్నీ ఎంఆర్ఓ యాదగిరిని గురువారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.