బాలికలపై లైంగిక దాడికి యత్నాలు
Published Fri, Nov 8 2013 2:35 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM
జి.మేడపాడు(సామర్లకోట), న్యూస్‌లైన్ : ఓ మృగాడు బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. కుమార్తెను వెతుక్కుం టూ తల్లిదండ్రులు రావడంతో అతడు పరారయ్యాడు. పెద్దాపురం సీఐ కేవీ సత్యనారాయణ, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సామర్లకోట మం డలం జి.మేడపాడు శెట్టిబలిజపేటకు చెందిన 14 ఏళ్ల బాలిక మానసిక రుగ్మతతో బాధపడుతోంది. ఆమెను తల్లిదండ్రులు గారాబంగా పెంచుతున్నారు. రో డ్డు పక్కన టీస్టాల్ నిర్వహిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల మోకూ రి లచ్చయ్య ఆ బాలికపై కన్నేశాడు. బు ధవారం రాత్రి 10 గంటల సమయంలో బాలిక ఒంటరిగా ఉండడంతో ఆమెను సమీపంలోని పశువుల శా ల కు ఎత్తుకువెళ్లాడు. ఇంత లో తల్లిదండ్రు లు ఇంటికి చే రుకున్నారు. కుమార్తె కని పించకపోవడంతో పరిసరా ల్లో గాలించా రు. పశువులశాలలో బాలికపై లైంగిక దాడికి యత్నిస్తున్న లచ్చయ్య వారికి తారసపడ్డాడు. వారు గట్టిగా కేకలు వే యడంతో స్థానికులు అక్కడకు చేరుకుని, లచ్చయ్యకు దేహశుద్ధి చేశారు. వా రినుంచి తప్పించుకుని లచ్చయ్య పరారయ్యాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అత్యాచార నిరోధక చట్టం-2012 ప్రకారం కేసు నమోదు చేసినట్టు సీఐ సత్యనారాయణ తెలిపారు.
యువకుడు లైంగిక దాడికి యత్నం
రఘునాధపురం (రాజానగరం), న్యూస్‌లైన్ : ఎనిమిదేళ్ల బాలికపై 22 ఏళ్ల యువకుడు లైంగిక దాడికి యత్నం చేసిన సం ఘటన మండలంలోని దివాన్‌చెరువు పంచాయతీ శివారు రఘునాథపురంలో గురువారం చోటుచేసుకుంది. సకాలం లో బాలిక సోదరుడు, మరికొందరు రా వడంతో ఆ యువకుడు పరారయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మట్టా శివ చెడు వ్యసనాలకు బానిసై, అల్లరిచిల్లరగా తిరుగుతున్నాడు. అతడి ఇంటి సమీపంలో ఉంటున్న మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికను ఇంట్లో వస్తువులు తీసుకురావాలని పిలిచాడు. ఆ బాలికతో పాటు ఆమె తమ్ముడు, మరో ఇద్దరు పొరుగింటి పిల్లలు కూడా వెళ్లారు. వారిని మేడ పైకి వెళ్లి ఆడుకోమని చెప్పిన శివ, ఆ బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. భయంతో ఆ బాలిక కేకలు వేయడంతో మేడ పై ఆడుకుంటున్న ఆమె తమ్ముడు, మిగిలిన పిల్లలు పరుగున రావడంతో శివ పరారయ్యాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు పై కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వి.రామకోటేశ్వరరావు తెలిపారు.
Advertisement
Advertisement