child girl
-
కన్నతల్లి కర్కశత్వం! చిన్నారి మృతి!
విశాఖపట్నం: అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన చిన్నారిపై కన్నతల్లి కర్కశత్వం చూపింది. గోరుముద్దలు తినిపించాల్సిందిపోయి కోపంతో గరిటతో తలపై కొట్టి కడతేర్చింది. ఈ ఘటన దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డీసీపీ కె.ఆనందరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. యలమంచిలి గ్రామానికి చెందిన బంగారు స్నేహ (19) అదే గ్రామానికి చెందిన సాయిని ప్రేమించి 2021 వివాహం చేసుకొంది. అనంతరం వారు విజయవాడలో కాపురం పెట్టారు. వీరికి ఓ పాప సంతానం. ఆ పాప పేరు గీతశ్రీ. కొంతకాలం తర్వాత ఆ దంపతుల మధ్య మనస్పర్థలతో గొడవలు జరగడంతో యలమంచిలి గ్రామానికి చెందిన రమణతో స్నేహ తన కష్టాలు చెప్పుకుంది. అనంతరం ఆ పరిచయం ప్రేమగా మారడంతో మొదటి భర్త సాయిని విడిచి తన 15నెలల కూతురు గీతాశ్రీని తీసుకుని రమణతో వచ్చేసింది. వీరు దువ్వాడ సమీప మంగళపాలెం జేఎన్యూఆర్ఎం బ్లాక్ నంబర్ – 74 ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17న మధ్యాహ్నం పాపకి స్నేహ అన్నం తినిపిస్తుండగా... పాప అల్లరి చేయడంతో కోపంతో గరిట తీసుకుని కుమార్తె తలపై స్నేహ బలంగా కొట్టింది. దీంతో పాపకి అధిక రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయి పడిపోయింది. తీరాచూస్తే చనిపోవడంతో రాత్రి అయ్యాక బ్లాక్ నంబర్ 74 వెనుక ఉన్న ముళ్లపొదల్లో స్నేహ పాతిపెట్టింది. అనంతరం భారీగా వర్షాలు కురవడంతో అక్కడి మట్టి కరిగిపోవడంతో పైకి తేలిన గీతశ్రీ మృతదేహాన్ని కుక్కలు బయటకు లాగడంతో ఈ హత్యోదంతం శనివారం ఉదయం 11 గంటల సమయంలో వెలుగులోకి వచ్చింది. చిన్నారి గీతశ్రీ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు దువ్వాడ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలు స్నేహని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏసీపి త్రీనాథ్, దువ్వాడ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసరావు కేసును పర్యవేక్షిస్తున్నారు. -
ఒక్కసారి కళ్లు తెరవమ్మా..
శివ్వంపేట(నర్సాపూర్): ఒక్కసారి లే తల్లీ.. కళ్లు తెరువమ్మా.. అల్లారుముద్దుగా పెంచుకుంటిని కదే.. అప్పుడే నూరేళ్లు నిండాయా తల్లీ.. తమ్ముడు పిలుస్తున్నడు చూడమ్మా.. డాడి పిలుస్తున్నడు ఒక్కసారి ఊ అనవే.. అంటూ పాప మృతదేహం వద్ద ఆ తల్లి రోదించిన తీరు అందరి కంటా కన్నీళ్లు పెట్టించింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలోని సికింద్లాపూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు తూప్రాన్ మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన మాధవికి ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల పాప జాహ్నవి (6), నాలుగేళ్లు కుమారుడు ఉన్నారు. కూలి పనులు చేస్తే కాని కుటుంబం గడవని పరిస్థితి వారిది. రోజులాగే సోమవారం పిల్లలిద్దరినీ ఇంటివద్దే నాయనమ్మ దగ్గర ఉంచి దంపతులిద్దరూ కూలి పనులకు వెళ్లారు. నాయనమ్మ ఇంట్లో ఉండగా జాహ్నవి ఓ బొమ్మతో ఆరుబయట ఆడుకుంటుండగా బొమ్మ ఇంటి ఎదుట ఉన్న డ్రమ్ములో పడిపోయింది. దీంతో కుర్చీ తీసుకొచ్చి బొమ్మను తీసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో జారి డ్రమ్ములో పడిపోయింది. మనుమరాలు కనిపించకపోయేసరికి నాయనమ్మ ఇంట్లో వెతకగా డ్రమ్ములో పడిన విషయం గుర్తించి చుట్టు పక్కల వారిని పిలిచింది. వారు డ్రమ్ములో నుంచి పాపను బయటకు తీయగా విగతజీవిగా కనిపించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇంటికి చేరుకొని బోరున విలపించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురు అకాలమరణం చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. -
ముఖ్యమంత్రిగా డిగ్రీ విద్యార్థిని
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా 20 ఏళ్లు కూడా నిండని ఓ యువతి బాధ్యతలు చేపట్టనుంది. అయితే ముఖ్యమంత్రిగా ఉండేది మాత్రం ఒక్కరోజే. ఒకే ఒక్కడు సినిమాలో మాదిరి ఆ యువతి విధులు నిర్వహించనుంది. ఎందుకంటే జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకోనుంది. ప్రతియేటా జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. అందులో భాగంగా రేపు జరగబోయే బాలికా దినోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం కుర్చీలో బాలిక కూర్చోనుంది. ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇంతకీ సీఎం కుర్చీలో కూర్చునేది ఎవరో కాదు హరిద్వార్ జిల్లా దౌలత్‌పూర్ గ్రామానికి చెందిన సృష్టి గోస్వామి. ఈమె బీఎస్సీ డిగ్రీ చదువుతోంది. ఉత్తరాఖండ్ బాలికల హక్కుల పరిరక్షణ కమిషన్ ఈ మేరకు సృష్టిని ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఆదివారం ఉత్తరాఖండ్ వేసవి రాజధాని అయిన గైర్‌సెన్‌లో సృష్టి ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌తో కలిసి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలపై సమీక్ష నిర్వహించనుంది. ఆయుష్మాన్‌భవ, స్మార్ట్ సిటీ, పర్యాటకతో పాటు ఇతర శాఖల కార్యక్రమాలు, పథకాలపై అధికారులతో సీఎం హోదాలో సృష్టి చర్చించనుంది. ఈ సమీక్షకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలని.. నివేదికలు రూపొందించి సమావేశానికి రావాలని ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రేపు ఉత్తరాఖండ్‌లో నవ పాలన సాగనుంది. అయితే సృష్టి గోస్వామి 2018లో ఉత్తరాఖండ్ బాలల అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించింది. 2009లో థాయిలాండ్‌లో జరిగిన బాలికల అంతర్జాతీయ లీడర్షిప్ కార్యక్రమానికి సృష్టి హాజరైంది. -
దారుణం: పసిమొగ్గపై పైశాచికం
కాకినాడలో ఘోరం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి ఓ దుర్మార్గుడి పైశాచికత్వానికి ముక్కుపచ్చలారని పసిమొగ్గ విలవిల్లాడింది. ఆర్తనాదాలు చేసింది. తెల్లవారు జామున ఒంటి నిండా తీవ్రగాయాలతో ఓ వీధిలో చెత్తకుప్పలో కనిపించిన ఆ చిన్నారిని చూసి కుటుంబసభ్యులు లబోదిబోమన్నారు. మరోవైపు లైంగికదాడికి గురై అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబసభ్యులు కాకినాడ జీజీహెచ్‌కు తీసుకురాగా.. వైద్యులు పోలీసు సిఫారసు ఉంటే తప్ప వైద్యం చేయలేమని చెప్పడంతో వారు పరుగుపరుగున పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. సాక్షి, కాకినాడ: కాకినాడ గోళీలపేట దండోరా నగర్‌కు చెందిన ఐదేళ్ల చిన్నారి అమ్మమ్మ తాతయ్యల మధ్య నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి అర్ధరాత్రి 1.30 దాటాక చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. తెల్లవారు జామున చిన్నారి తాతయ్య నల్లయ్య తన పక్కనే నిద్రించిన మనవరాలి కోసం చూడగా ఆమె కనిపించలేదు. భార్య కొత్తమ్మను నిద్రలేపి ఆరా తీశాడు. ఇంటి బయట నిద్రిస్తున్న చిన్నారి తండ్రి రాజును నిద్రలేపి అడిగాడు. బాలిక ఏమైందో తెలియక పోవడంతో కుటుంబ సభ్యులు, 50 మందికి పైగా స్థానికులు కలసి ఉదయం వరకు వెతికారు. సుమారు ఉదయం 4.30 సమయంలో బాలిక వివస్త్రగా, ఒంటి నిండా గాయాలు, పంటి గాట్లతో రంపంమిల్లు వీధిలోని చెత్తకుప్పలో అచేతన స్థితిలో లభ్యమైంది. చిన్నారి జాడ కోసం వెతుకుతున్న వారికి అత్యంత దయనీయస్థితిలో బాలిక కనిపించింది. తక్షణమే కుటుంబసభ్యులు పాప శరీరాన్ని శుభ్రపరిచి కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. బాలికను నిందితుడు వదిలి వెళ్లింది ఇక్కడే.. వైద్యం నిరాకరణ.. లైంగికదాడి జరగడంతో పోలీసుల సిఫారసు తప్పనిసరని చెబుతూ కాకినాడ జీజీహెచ్ వైద్యులు ఆ చిన్నారికి వైద్యం అందించేందుకు నిరాకరించడంతో తండ్రి పిల్లి రాజు, అమ్మమ్మ కన్నీటిపర్యంతమవుతూ ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీఐ టి.రామ్మోహన్‌రెడ్డి దృష్టికి వైద్యుల నిర్వాకాన్ని వెల్లడించారు. దీంతో సీఐ వారితో కలిసి హుటాహుటిన జీజీహెచ్‌కు వెళ్లి వైద్యుల తీరును నిలదీసి, చిన్నారులకు వైద్య సేవలందించేలా మాట్లాడారు. అత్యంత పాశవికంగా.. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ ఆగంతకుడు అత్యంత పాశవికంగా వ్యవహరించాడు. ఏడ్చినందుకు చెంపలపై బలంగా కొట్టాడు. చిన్నారి శరీరంలోని పలు భాగాల్లో తీవ్రమైన పంటిగాట్లను వైద్యులు గుర్తించారు. మట్టిలో పడేసి లైంగికదాడికి పాల్పడడంతో చిన్నారి వీపు భాగం పూర్తిగా కొట్టుకుపోయి రక్తసిక్తమైంది. జననాంగాలు, పెదవులపైన పంటిగాయాలున్నాయని వైద్యుల పరిశీలనలో తేలింది. అచేతన స్థితికి జారుకున్న తర్వాతే పాపను వదిలాడని, అప్పటి వరకు అత్యంత కర్కశంగా చిన్నారిపై విరుచుకుపడ్డాడని వైద్యులు తెలిపారు. ముమ్మర తనిఖీలు అత్యాచార ఘటనను జిల్లా పోలీస్‌శాఖ తీవ్రంగా పరిగణించింది. ప్రత్యేక బృందాలను నియమించి అగంతకుడి కోసం గాలింపు చేపట్టింది. పోలీస్ జాగిలాలు చిన్నారి ఇంటి పరిసరాల్లో పలుచోట్ల అనుమానిత స్థితిలో సంచరించాయి. ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ బాలిక నిద్రించిన ఇంటిని పరిశీలించారు. గడియపెట్టి నిద్రపోయారా? తెరిచి ఉంచారా? అన్న అంశాలపై ఆరా తీశారు. ఉక్కపోత కారణంగా తలుపులు తెరిచి ఉంచినట్టు బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. అనుమానిత వ్యక్తి, వ్యక్తుల సంచారంపై డీఎస్పీ భీమారావు ఆధ్వర్యంలోని సీఐలు గోవిందరావు, ఈశ్వరుడు చుట్టుపక్కల వారిని ఆరా తీశారు. క్లూస్ బృందం బాలిక అదృశ్యమైన చోటు, లభ్యమైన చోట్లలో ఆధారాలను సేకరించారు. పలువురి పరామర్శ చిన్నారిని కాకినాడ జీజీహెచ్‌లో ఎస్పీ అస్మీ, జేసీ పరామర్శించారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడారు. చిన్నారి తల్లి మరియ పని కోసం హైదరాబాద్‌లో ఉంటోందని, తండ్రి, తాతయ్య, అమ్మమ్మల సంరక్షణలో బాలిక ఉంటోందన్నారు. కేసు విచారణ కోసం ప్రత్యేక అధికారిగా దిశ డీఎస్పీ మురళీమోహన్ను నియమించామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వన్‌టౌన్æ సీఐ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. కీలక మలుపు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న బాలిక కీలక ఆధారాన్ని వెల్లడించింది. తనపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి వివరాలను తెలిపింది. తండ్రి వరసయ్యే ఓ వ్యక్తి తనపై దారుణానికి ఒడిగట్టాడని, చిత్రహింసలు పెట్టి, కొడుతూ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాలిక వెల్లడించిన వీడియో సాక్షి చేతికి అందింది. నిందితుడి కుమారుడు బాలికతో సఖ్యంగా ఉండడంతో ఆ బాలుడి తండ్రేనని పదేపదే చెప్పింది. సదరు వ్యక్తి బాలికకు తండ్రి వరుస అవుతాడని కుటుంబసభ్యులు నిర్ధారించుకొని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ దిశలోనే పోలీసులూ విచారణ జరుపుతున్నారు. అయితే బాలిక వాంగ్మూలాన్ని పోలీసులు అధికారికంగా వెల్లడించడం లేదు. -
అడుగుతున్నా చెప్పండి
ఏమిటింత కాలుష్యం! ఎందుకీ అలక్ష్యం?! మిమ్మల్నే మిస్టర్ మోడీ.. చెప్పండి. ఈ కరోనా టైమ్‌లో.. నీట్లేంటి, జేఈఈలేంటి?! అడుగుతున్నది లిసిప్రియా కంగుజమ్. ఎనిమిదేళ్ల బాలిక! ఎనిమిదేళ్లంటే బడికి వెళ్లే వయసు. కొందరికైతే ఇంకా బడిలో చేరని వయసు. లిసిప్రియా కంగుజమ్ ఐదో తరగతి చదువుతోంది. బుధవారం పని మీద ఢిల్లీ వెళ్లింది! ప్రధాని, రాష్ట్రపతుల కార్యాలయాలు తిరిగి పెద్ద మనుషుల్ని కలిసి వచ్చింది. అయితే ఆ అమ్మాయి మాత్రం.. ‘‘వాళ్లు పెద్ద మనుషులైతే నేను కలిసే అవసరం ఎందుకు వస్తుంది?’’ అంటోంది! ఈ మాటను తన ఆరవ యేట నుంచీ అంటోంది. గట్టి క్లయిమేట్ ‘లా’ ను తెమ్మంటోంది లిసిప్రియ. తెస్తే వాతావరణం కొంచెం క్లీన్, కొంచెం కూల్ అవుతుందని కదా అని ఆశ. పని కాలేదు. అందుకే పెద్ద మనుషులు కాదు అంటోంది. గత ఏడాది జూన్‌లో పార్లమెంటు భవనం ముందుకు వెళ్లి ప్లకార్డ్ ప్రదర్శించింది! చట్టాలు తెచ్చేందుకు టైమ్ పడుతుంది అని ఎవరైనా చెప్పకుండా ఉండి ఉంటారా? తెచ్చేవరకు గుర్తు చేస్తూనే ఉంటానని తను. గట్టి పట్టు మీదే ఉంది. ఇప్పుడేమంటుందీ.. కరోనా ఉన్నప్పుడు ప్రవేశ పరీక్షలు ఏంటీ అని. వాటిని పోస్ట్‌పోన్ చెయ్యమని అడగడానికే లిసిప్రియా ఢిల్లీ వెళ్లింది. అడగడమే. అభ్యర్థించదు. విజ్ఞప్తి చెయ్యదు. మోదీజీని ‘మిస్టర్ మోడీ’ అంటుంది! వేరెవర్నైనా అంతే. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిని అయినా ‘మిస్టర్ గ్యుటెరస్’ అనే అంటుంది. ఆ పెద్దాయన్ని గత ఏడాది డిసెంబర్లో స్పెయిన్‌లో కలిసింది లిసిప్రియా. ఆ సెప్టెంబర్ 13న మన దగ్గర ‘నీట్’ ప్రవేశ పరీక్ష ఉంది. అదొకటే కాదు, జరగవలసిన పరీక్షలు చాలానే ఉన్నాయి. జె.ఇ.ఇ. మెయిన్ ఉంది. జె.ఇ.ఇ. అడ్వాన్డ్ ఉంది. థర్డ్ ఇయర్ యూనివర్సిటీ పరీక్షలు ఉన్నాయి. సీబీఎస్ఇ కంపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎన్‌డిఎ ఉంది. డి.యు.ఇ.టి. ఉంది. వీటన్నిటినీ తక్షణం వాయిదా వెయ్యమని లిసిప్రియా డిమాండ్. ‘పరీక్షలు రాసేవారు లక్షల్లో ఉంటారు. కరోనా ఎటాక్ అయితే పరిస్థితి ఏంటి?’ అని లిసిప్రియ ఆందోళన. సుప్రీంకోర్టుకు, కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఈ మాట చెప్పీ చెప్పీ రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. ఇప్పుడు లిసిప్రియ తన చేతుల్లోకి తీసుకుంది సమస్యను. వివిధ సందర్భాలలో లిసిప్రియ ప్రసంగాలు, ప్రదర్శనలు, ప్రాతినిధ్యాలు లిసిప్రియ మణిపూర్ యాక్టివిస్ట్. బెంగళూరు ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతోంది. యాక్టివిస్ట్ అన్నది వయసుకు మించినమాటే కానీ.. ఇప్పటికే వాతావరణ పరిరక్షణ మీద కొన్ని అంతర్జాతీయ ప్రసంగాలు ఇచ్చింది! ఈ అమ్మాయిని ఇన్స్పైర్ చేసినవి కూడా సామాజిక కార్యకర్తల ప్రసంగాలే. డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలామ్ చిల్డ్రన్ అవార్డు, వరల్డ్ చిల్డ్రన్స్ పీస్ ప్రైజ్, ఇండియా పీజ్ ప్రైజ్, రైజింగ్ స్టార్ ఆఫ్ ఎర్త్ డే నెట్వర్క్, ఎస్.డి.జీస్ అంబాసిడర్ అవార్డు, నోబెల్ సిటిజన్ అవార్డు.. ఈ రెండుమూళ్లలోనే లిసిప్రియకు వచ్చేశాయి. ‘సుకీఫూ’ అనే ఒక కిట్‌ను కూడా తయారు చేసింది లిసిప్రియ. సుకీఫూ అంటే సర్వైవల్ కిట్ ఫర్ ద ఫ్యూచర్ శరీరంలోకి స్వచ్ఛమైన గాలిని పంపించే సాధనం అది. లిసిప్రియ తను చేసేది చేస్తోంది. అధికారంలో ఉన్నవాళ్లను కూడా ‘ఫ్రెష్ ఎయిర్’ కోసం ఏదైనా చేయమని అంటోంది. ఆచరించి చూపడం అంటే ఆదర్శంగా ఉండటమే కదా. ‘ఆదర్శం’ అనేది కూడా వయసుకు మించిన మాటే లిసిప్రియను అభినందించడానికి. కానీ తప్పదు. కాసేపు.. ఆదర్శమే ఆమెకన్నా చిన్న అనుకుంటే సరిపోతుంది. -
పాదాల మధ్య నిలిపి ప్రాణాలు కాపాడింది
కోల్‌కతా : ఇప్పటివరకూ గజరాజులు జనావాసంలోకి వచ్చి మనుషుల మీద దాడి చేయడం.. పంటలను నాశనం చేయడం వంటి వార్తలే చదివాము. కానీ తోటి ఏనుగుల దాడి నుంచి మనషులను కాపాడిన సంఘటన గురించి మాత్రం చాలా అరుదుగా విని ఉంటారు. ఇలాంటి సంఘటన ఒకటి పశ్చిమబెంగాల్లో చోటు చేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిని పాదాల మధ్యన దాచి తోటి ఏనుగులు బారి నుంచి కాపాడిందో గజరాజు. గరుమారా పార్క్ సమీపంలో జరిగిన ఈ సంఘటన. వివరాలు.. నీతు ఘోష్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి సమీప దేవాలనయానికి వెళ్లి వస్తున్నాడు. పార్క్ మధ్యలోంచి జాతీయ రహదారి ఉండటంతో అదే సమయంలో కొన్ని ఏనుగులు ఆ రోడ్డు మీదకు వచ్చాయి. ఈ అకస్మాత్తు సంఘటనను ఊహించని ఘోష్ సడెన్ బ్రేక్ వేశాడు. దాంతో ఘోష్‌తో పాటు స్కూటర్ మీద ఉన్న అతని భార్య, నాలుగేళ్ల చిన్నారి అహనా కూడా కింద పడిపోయారు. దురదృష్టవశాత్తు అహనా వెళ్లి రోడ్డు దాటుతున్న ఏనుగుల సమీపంలో పడిపోయింది. కింద పడటంతో అప్పటికే ఘోష్‌కు గాయాలు అయ్యాయి. లేచి వెళ్లి కూతుర్ని కాపాడలనుకున్నాడు.. కానీ శరీరం అందుకు సహకరించలేదు. మరి కొద్ది సేపట్లో అహనా ఏనుగులు పాదాల కింద పడి చనిపోతుందనగా ఓ ఆశ్చర్యకమైన సంఘటన చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న ఓ ఏనుగు.. కిందపడ్డా అహనా దగ్గరకు వచ్చి.. తన పాదాల మధ్యన ఆ చిన్నారిని నిలిపి ఉంచింది. ఇంతలో అక్కడికి వచ్చిన ట్రక్ డ్రైవర్ ప్రమాదాన్ని గుర్తించి పెద్దగా హరన్ మోగిస్తూ ఏనుగులను భయపెట్టి అడవిలోకి వెళ్లేలా చేశాడు. దాంతో అంతసేపు ఏనుగు పాదాల మధ్య నిల్చున్న చిన్నారి అహనా తల్లి చెంతకు చేరుకుంది. అనంతరం కింద పడిన ఘోష్, అతని భార్యను ట్రక్కులో చేర్చి సమీప ఆస్పత్రికి తీసుకెళ్లాడు ట్రక్కు డ్రైవర్. -
బాలికపై అఘాయిత్యం...
నాగోలు: చిన్నారిపై బాలుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన ఎల్బీనగర్ ఠాణా పరిధిలో జరిగింది. సీఐ కాశిరెడ్డి కథనం ప్రకారం.... నార్త్ ఇండియా నుంచి వచ్చిన ఓ కుటుంబం బైరామల్‌గూడలో నివాసముంటూ దుస్తులు అమ్ముకుంటూ జీవిస్తోంది. వీరికి కుమారుడు (13) సంతానం. వీరి ఇంటి పక్కనే ఉండే బాలిక (7) రెండో తరగతి చదువుతోంది. సోమవారం స్కూల్‌కు సెలవు కావడంతో ఇంటి వద్దే ఉన్న ఆ చిన్నారికి సదరు బాలుడు చాక్లెట్లు ఇస్తానని తన ఇంట్లోకి పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి ఏడవడంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో బాలుడిని అదుపులోకి తీసుకొని, చిన్నారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
ఇంటికి చేరిన చిన్నారి శ్వేత
హైదరాబాద్: దారి తప్పి వచ్చి బిక్కమొఖంతో చూస్తున్న రెండున్నరేళ్ల చిన్నారిని ఓ వ్యక్తి పోలీసులకు అప్పగించాడు. రెండు గంటల్లోనే ఆ చిన్నారిని తల్లిడండ్రుల చెంతకు చేర్చిన సంఘటన నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాలు...మల్లిఖార్జున్, రేఖ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి అడిక్‌మెట్ లలితానగర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ సమీపంలో నివాసముంటున్నారు. రెండున్నరేళ్ల వీరి కుమార్తె స్వేత శనివారం మధ్యాహ్నం ఆడుకుంటూ పక్క వీధిలోకి వెళ్లింది. తర్వాత దారి తెలియక ఇంటికి చేరుకోలేక పోయింది. కృతి కుమార్ అనే వ్యక్తి చిన్నారిని దగ్గరకు తీసుకుని వివరాల కోసం ఆరాతీశాడు. ఆ చిన్నారికి సరిగా మాటలు రాకపోవడంతో ఏమీ చెప్పలేక పోయింది. దీంతో చిన్నారిని కృతి కుమార్ నల్లకుంట పోలీసులకు అప్పగించాడు. చిన్నారి ఆచూకీ కోసం గాలిస్తున్న తల్లిదండ్రులు పోలీసులకు ఎదురుపడ్డారు. దీంతో శ్వేత తప్పి పోయిన విషాయాన్ని పోలీసులకు తెలిపారు. నల్లకుంట పోలీసుల రక్షణలో ఉన్న చిన్నారి వారి కుమార్తెగా గుర్తించారు. అనంతరం చిన్నారిని ఇంటికి చేర్చారు. -
బాలికలపై లైంగిక దాడికి యత్నాలు
జి.మేడపాడు(సామర్లకోట), న్యూస్‌లైన్ : ఓ మృగాడు బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. కుమార్తెను వెతుక్కుం టూ తల్లిదండ్రులు రావడంతో అతడు పరారయ్యాడు. పెద్దాపురం సీఐ కేవీ సత్యనారాయణ, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సామర్లకోట మం డలం జి.మేడపాడు శెట్టిబలిజపేటకు చెందిన 14 ఏళ్ల బాలిక మానసిక రుగ్మతతో బాధపడుతోంది. ఆమెను తల్లిదండ్రులు గారాబంగా పెంచుతున్నారు. రో డ్డు పక్కన టీస్టాల్ నిర్వహిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల మోకూ రి లచ్చయ్య ఆ బాలికపై కన్నేశాడు. బు ధవారం రాత్రి 10 గంటల సమయంలో బాలిక ఒంటరిగా ఉండడంతో ఆమెను సమీపంలోని పశువుల శా ల కు ఎత్తుకువెళ్లాడు. ఇంత లో తల్లిదండ్రు లు ఇంటికి చే రుకున్నారు. కుమార్తె కని పించకపోవడంతో పరిసరా ల్లో గాలించా రు. పశువులశాలలో బాలికపై లైంగిక దాడికి యత్నిస్తున్న లచ్చయ్య వారికి తారసపడ్డాడు. వారు గట్టిగా కేకలు వే యడంతో స్థానికులు అక్కడకు చేరుకుని, లచ్చయ్యకు దేహశుద్ధి చేశారు. వా రినుంచి తప్పించుకుని లచ్చయ్య పరారయ్యాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అత్యాచార నిరోధక చట్టం-2012 ప్రకారం కేసు నమోదు చేసినట్టు సీఐ సత్యనారాయణ తెలిపారు. యువకుడు లైంగిక దాడికి యత్నం రఘునాధపురం (రాజానగరం), న్యూస్‌లైన్ : ఎనిమిదేళ్ల బాలికపై 22 ఏళ్ల యువకుడు లైంగిక దాడికి యత్నం చేసిన సం ఘటన మండలంలోని దివాన్‌చెరువు పంచాయతీ శివారు రఘునాథపురంలో గురువారం చోటుచేసుకుంది. సకాలం లో బాలిక సోదరుడు, మరికొందరు రా వడంతో ఆ యువకుడు పరారయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మట్టా శివ చెడు వ్యసనాలకు బానిసై, అల్లరిచిల్లరగా తిరుగుతున్నాడు. అతడి ఇంటి సమీపంలో ఉంటున్న మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికను ఇంట్లో వస్తువులు తీసుకురావాలని పిలిచాడు. ఆ బాలికతో పాటు ఆమె తమ్ముడు, మరో ఇద్దరు పొరుగింటి పిల్లలు కూడా వెళ్లారు. వారిని మేడ పైకి వెళ్లి ఆడుకోమని చెప్పిన శివ, ఆ బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. భయంతో ఆ బాలిక కేకలు వేయడంతో మేడ పై ఆడుకుంటున్న ఆమె తమ్ముడు, మిగిలిన పిల్లలు పరుగున రావడంతో శివ పరారయ్యాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు పై కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వి.రామకోటేశ్వరరావు తెలిపారు.