samalkota
-
సామర్లకోటలో ఘనంగా భీమేశ్వరస్వామి రథోత్సవం
-
ఆయువు తీసిన ఆయిల్ ట్యాంకర్
సామర్లకోట (పెద్దాపురం) / కాకినాడ రూరల్: రంజాన్ మాసం, వేసవి సెలవుల్లో కొన్నిరోజులు ఆత్మీయుని ఇంట గడుపుదామని బయల్దేరిన వారికి ఆ ప్రయాణంలోనే ఆయువు తీరిపోయింది. ఎక్కిన ఆటోయే ఆఖరి మజిలీ అయింది. ఎదురుగా వచ్చిన ఆయిల్ ట్యాంకరే మృత్యుదూత అయింది. ఆటో డ్రైవర్‌ను పొట్టన పెట్టుకుంది. అమ్మమ్మను, ఇద్దరు మనుమలనూ ఒకేసారి కబళించింది. అదే కుటుంబంలోని మరో ముగ్గురిని తీవ్రంగా గాయపరిచింది. కాకినాడ–సామర్లకోట ఏడీబీ రోడ్డులో హోప్ ఆసుపత్రి సమీపంలో శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఆటోలోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఒకరు ఆటో డ్రైవర్ కాగా మిగిలిన ముగ్గురు మృతులు, గాయపడ్డ మరో ముగ్గురు ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ఒకే కుటుంబం వారు. గాయపడ్డ వారు కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా చీరాల గంజిపాలెంకు చెందిన షేక్ అమీనాబీబీ (60) రంజాన్ మాసం, వేసవి సెలవుల నేపథ్యంలో.. కాకినాడ రూరల్ మండలం వలసపాకలలో ఐఓసీ పెట్రోల్ ట్యాంకుల వద్ద సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తూ వలసపాకలలో నివాసం ఉంటున్న కుమారుడు షేక్ పీర్(మాజీ సైనికుడు) ను చూసేందుకు తన ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు మనుమరాళ్లు, ఒక మనుమడితో కలసి కాకినాడ బయలుదేరింది. చీరాల నుంచి సామర్లకోటకు జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన ఆ కుటుంబం వలసపాకల వెళ్ళేందుకు సామర్లకోటలో ర్యాలి సుబ్బారావు (45) ఆటోను కట్టించుకున్నారు. ఏడీబీ రోడ్డులో ఫ్లై ఓవర్ బ్రిడ్జి దిగిన తరువాత ఎదురుగా కాకినాడ నుంచి సామర్లకోట వస్తున్న ఆయిల్ ట్యాంకరు తొలుత కాకినాడ నుంచి సామర్లకోట మోటారు సైకిలుపై వస్తున్న యు.సత్తిబాబును ఢీకొంది. ఆ క్రమంలో అదుపు తప్పి ఆటోను ఢీకొంది. అమీనాబీబీ, 9 ఏళ్ల మనుమడు షమ్ము, 7 ఏళ్ల మనుమరాలు, ఆటో డ్రైవర్ సుబ్బారావు అక్కడికక్కడే మృతి చెందారు. అమీనాబీబీ కుమార్తెలు షేక్ మహబూబ్ ఉన్నీసా, షేక్ రహమత్ బీ, మనుమరాలు యాస్మిన్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతున్నారు. యాస్మిన్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపించిన ఆత్మీయులు ప్రమాదవార్త తెలిసి ఆసుపత్రికి వచ్చిన షేక్ పీర్ తీవ్రంగా గాయపడ్డ తోబుట్టువులను, మేనకోడలిని చూసి బోరున విలపించాడు. సామర్లకోటకు చెందిన ఆటో డ్రైవర్ సుబ్బారావుకు భార్య పద్మ, 12 సంవత్సరాల కుమార్తె దేవి ఉన్నారు. కుటుంబసభ్యులు జీజీహెచ్‌కు తరలివచ్చి, అతడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. సామర్లకోటకు చెందిన ఆటో డ్రైవర్లు సుబ్బారావు మృతదేహాన్ని చూసి చలించిపోయారు. కాగా షేక్ పీర్ తట్టుకోలేడని అతడి తల్లి, మేనల్లుడు, మేనకోడళ్ల మృతదేహాలను చూడనివ్వలేదు. కాగా మోటారు సైకిలిస్టుకు స్వల్ప గాయం కావడంతో ఇంటికి వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. ప్రమాదస్థలాన్ని సందర్శించిన హోం మంత్రి రాజప్ప హోం మంత్రి చినరాజప్ప, ఎస్పీ విశాల్ గున్ని కాకినాడ డీఎస్పీ రవివర్మ, సీఐ కృష్ణచైతన్య, సామర్లకోట, తిమ్మాపురం, ఇంద్రపాలెం ఎస్సైలు ప్రమాదస్థలాన్ని సందర్శించారు. తిమ్మాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకుని, డ్రైవర్ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదసమయంలో శ్రీనివాస్ తాగి ఉన్నట్లు గుర్తించారు. కాగా హోం మంత్రి చినరాజప్ప, ఎస్పీ విశాల్ గున్ని ఆస్పత్రిలో బాధితుల్ని పరామర్శించారు. మెరుగైన వైద్యసేవల కోసం అపోలో ఆసుపత్రికి తరలించాలని హోంమంత్రి ఆదేశించారు. వీరికి ఆసుపత్రిలో అయ్యే అన్ని రకాల ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మృతుల కుటుంబాలకు చంద్రన్న బీమా పథకం వర్తింప చేస్తామని, ప్రభుత్వపరంగా రావల్సిన అన్ని సౌకర్యాలు అందజేస్తామని వివరించారు. -
లాడ్జిలో కటుంబం ఆత్మహత్యాయత్నం
ఇద్దరు చిన్నారులు మృతి పరారీలో తల్లిదండ్రులు సామర్లకోట లాడ్జిలో ఘటన దంపతులపై 302 కేసు నమోదు సామర్లకోట : పట్టణంలోని లాడ్జిలో ఓ కుటుంబం ఆత్మహత్యా యత్నం చేసింది. ఈ ఘనటలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా వారి తల్లిదండ్రులు పరారయ్యారు. పోలీసుల కథనం ప్రకారం... విజయనగరం జిల్లా పార్వతీపురానికి (బెలగామ్) చెందిన కోడూరి సత్యనారాయణ, గౌరమ్మ దంపతులతో పాటు వారి పిల్లలు శిరీష(9), అనూష (7) గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రైల్వేస్టేషన్ సెంటర్లో ఉన్న ఎన్ఆర్సీ లాడ్జి, రూమ్ నంబర్ 106లో దిగారు. అదే రోజు రాత్రి 7 గంటల సమయంలో భార్యభర్తలు ఇద్దరు బయటకు వెళ్తున్నట్టు చెప్పి శుక్రవారం మధ్యాహ్నం వరకు తిరిగి రాలేదు. ఈ నేపథ్యంలో సత్యనారాయణ తన తోడల్లుడు కొప్పంగి సతీష్‌కు ఫోన్ చేసి, తాము ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేయగా పిల్లలు చనిపోయారని, తాము కూడా బయటకు వెళ్లి చనిపోతున్నామని చెప్పినట్టు సీఐ వీరయ్యగౌడ్ తెలిపారు. సతీష్ సమాచారం మేరకు పోలీసులు లాడ్జి వద్దకు వచ్చి విచారణ ప్రారంభించారు. «కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపి నలుగురు తాగగా... చిన్నారులు కావడంతో వారు పిల్లలు చనిపోయారని, ఈ విషయాన్ని గమనించిన సత్యనారాయణ, గౌరమ్మ పరారయ్యారని సీఐ చెప్పారు. వీరిపై 302 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వారి నుంచి వచ్చిన సెల్‌ఫోన్ టవర్ ఆధారంగా వారిని గుర్తిస్తామని చెప్పారు. సత్యనారాయణ తోడళ్లుడు సతీష్ విశాఖపట్నం నుంచి శుక్రవారం సామర్లకోట చేరుకున్నారు. 12 రోజుల క్రితం తీర్థయాత్రలకు వెళుతున్నామని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన వారి నుంచి ఎటువంటి ఫోన్ లేదని సతీష్ విలేకరులకు చెప్పారు. శుక్రవారం ఉదయం ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం తెలిపి, ఇక్కడికి వచ్చానన్నారు. తన తోడళ్లుడు పెద్దవాల్తేరులో సెలూన్ షాపు నిర్వహిస్తున్నాడని చెప్పారు. ఇటీవలే రూ.లక్షతో మరమ్మతులు చేయించాడని, నెలకు రూ.2,500 అద్దె కూడా సక్రమంగా చెల్లిస్తున్నాడని, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవని సతీష్ తెలిపారు. విషయం తెలుసుకుని వచ్చిన పిల్లల తాత కొత్త సన్యాసిరావు (గౌరమ్మ తండ్రి) మనవరాళ్ల మృతదేహాలను చూసి బోరున విలపించారు. ఎంతో చలాకీగా ఉండే పిల్లలను పుణ్యక్షేత్రాలకు తీసుకువెళుతున్నానని చెప్పి తన అల్లుడే చంపేశాడని రోదించారు. లాడ్జి గుమస్తా నక్కా భాస్కరరావు మాట్లాడుతూ సత్యనారాయణ ఒక రోజుకు అడ్వాన్సుగా రూ.500 చెల్లించారని, రూమ్ అద్దె రూ.350 పోగా మిగిలిన సొమ్ము 24 గంటలు దాటినా ఇవ్వకపోవడంతో మధ్యాహ్నం రూమ్‌ను పరిశీలించామన్నారు. రూము తలుపు తెరువక పోవడంతో ఏమి జరిగి ఉంటుందోనని వెనుక కిటికీ నుంచి చూడగా ఇద్దరు పిల్లలు మంచంపై ఉన్నారని, దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేసేలోపే పోలీసులు లాడ్జి వచ్చారని విలేకర్లకు చెప్పారు. మృతుల చిన్నాన్న సతీష్ ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీఐ వెంట ఎస్సై ఎల్.శ్రీనివాసు, ఏఎస్సై జీవీవీ సత్యనారాయణ, సిబ్బంది ఉన్నారు. ఫోన్ ఆధారంగా సత్యనారాయణ దంపతులు సికింద్రాబాద్‌లో ఉన్నట్టు పోలీసులు శుక్రవారం రాత్రి గుర్తించారు. -
బాలికపై లైంగిక దాడి
పెద్దాపురం డీఎస్పీ విచారణ సామర్లకోట (పెద్దాపురం) : పట్టణంలోని ఒక బాలికపై ఒక యువకుడు లైంగిక దాడి చేశాడు. పోలీసులు, స్థానికుల కథ నం ప్రకారం ఈ బాలిక శని వారం సాయంత్రం ఇంటి ఎదురుగా ఉన్న కిరాణా షాపునకు బిస్కెట్లు కొనుగోలుకు వెళ్లింది. ఆ సమయంలో అక్కడకి వచ్చిన గంటా సుబ్బారావు ఆమె ఇంటి బాత్రూమ్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడి చేశాడని స్థానికులు, బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెనుగులాటలో చెంపపై యువకుడు కొట్టడంతో ఆమె సృహ తప్పి పడిపోయిందన్నారు. సుమారు గంట తరువాత మెలకువ వచ్చిన తరువాత ఆమె బాత్రూమ్ తలుపు కొట్టడంతో.. ఆ ప్రాంతంలోని నీలం నవ్య, పురుషోత్తం వజ్రం వచ్చి ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. తల్లిదండ్రులు ఆదివారం ఉదయం స్థానికుల సహకారంతో పోలీసులను ఆశ్రయించారు. అదనపు ఎస్సై ఎస్.లక్షి్మకి ఈమేరకు బాలిక ఫిర్యాదు చేసింది. దీంతో పెద్దాపురం డీఎస్సీ ఎస్.రాజశేఖరరావు, సీఐ వీరయ్యగౌడ్, ఎస్సై ఆకుల మురళీకృష్ణ, వీఆర్వోలు సంఘటనా స్థలానికి చేరుకుని సమాచారం సేకరించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని ఉరి శిక్ష వేయాలని మానవ హక్కుల సంఘ జిల్లా అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ డిమాండ్ చేశారు. ఈ కేసు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ బాలికకు న్యాయం చేయాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ బాలాత్రిపుర సుందరి, అంగ¯ŒSవాడీ కార్యకర్తలు ఎంవీ శ్రీలక్ష్మీ, శ్యామల కోరారు. -
లాడ్జిలో యువకుడి ఆత్మహత్య
సామర్లకోట (పెద్దాపురం నియోజకవర్గం) : హైదరాబాద్‌లో తాపీ పనికి వెళ్లిన పెద్దాపురానికి చెందిన ఒక యువకుడు సామర్లకోట లాడ్జీలో శవమై కనపించాడు. పోలీసుల కథనం ప్రకారం పెద్దాపురం పాత ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పద్మనాభ కాలనీకి చెందిన నకిన గోవిందు (19) సామర్లకోట రైల్వేస్టేçÙ¯ŒS ఎదురుగా ఉన్న విజయ లాడ్జిలో ఫ్యానుకు టవల్‌తో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మూడు నెలల క్రితం స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లో తాపీపనికి వెళ్లాడన్నారు. అయితే ఈ నెల 14న లాడ్జీలో విశ్రాంతి తీసుకోవడానికి రూమ్ తీసుకున్నాడు. స్థానిక చిరునామా కోసం పెద్దాపురంలోని స్నేహితుడు యాదగరి సాయి గుర్తింపు కార్డుతో రూమ్ తీసుకున్నాడు. అదే రోజు సాయి వెళ్లిపోయినట్టు లాడ్జి గుమాస్తా పెదిరెడ్ల సత్యనారాయణ పోలీసులకు తెలిపారు. శని, ఆదివారాలు వరకూ వారిద్దరూ బయటకు వెళ్లారని లాడ్జి నిర్వాహకులు చెప్పారు. ఆదివారం సాయంత్రం నుంచి గోవిందు బయటకు రాలేదు. సోమవారం ఉదయం బాయి తలుపు కొట్టినా తీయకపోవడంతో పోలీసులకు లాడ్జి నిర్వాహకులు సమాచారం అందజేశారు. లాడ్జీలో ఉన్న సమాచారం మేరకు సాయికి, గోవిందు తల్లిదండ్రులకు లాడ్జి గుమస్తా సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న మహిళా ఎస్సై లక్షీ్మకాంతం రూము తలుపులను పగలుకొట్టగా గోవింద్ ఫ్యాను టవల్ బిగించి ఉరి పోసుకున్నట్టు గమనించారు. రూములో డైనింగ్ టైబుల్‌పై మద్యం గ్లాసు, తినుబండారాలు ఉన్నాయి. రూములో టీవీ ఆ¯ŒSలో ఉంది. పండుగకు రావాలని కోరితే శవమై కనిపించాడని గోవిందు తల్లి దుర్గ బోరున రోదించింది. కుమారునకు ఎటువంటి అప్పులు లేవని, ఎవరూ శత్రువులు కూడా లేరని, ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో తెలియడం లేదని రోదిస్తూ తెలియజేసింది. తల్లి దుర్గ ఫిర్యాదు మేరకు ఎస్సై లక్షీ్మకాంతం కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉత్సాహ‘బరి’తం
కోటలో ప్రారంభమైన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు మూడురోజుల పాటు నిర్వహణ ప్రారంభించిన అఖిల భారత కబడ్డీ అసోసియేషన్ అ««దl్యక్షుడు కేఈ ప్రభాకర్ సామర్లకోట : కూత మొదలైంది. ఉత్సాహ‘బరి’త వాతావరణంలో కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. పట్టణంలో స్థానిక పల్లంబీడ్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను గురువారం అఖిల భారత కబడ్డీ అసోసియేషన్ అ««దl్యక్షుడు కేఈ ప్రభాకర్ ప్రారంభించారు. సాయంత్రం నాలుగు గంటలకు క్రీడలు ప్రారంభం కావాల్సి ఉండగా వర్షం కారణంగా రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యాయి. ఫ్లడ్‌లైట్ల వెలుగులో మూడు రోజుల పాటు నిర్వహించే ఈ పోటీల్లో 13 జిల్లాలకు చెందిన మహిళ, పురుష జట్లు పాల్గొంటాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు, పోటీల నిర్వాహక కార్యదర్శి బోగిళ్ల ముర ళీకుమార్ అధ్యక్షత వహించగా ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభాకర్ మాట్లాడుతూ సామర్లకోట పట్టణ యువకులు పట్టుదలతో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించడం వల్ల సామర్లకోటకు ప్రాధాన్యమిచ్చామన్నారు. జాతీయ స్థాయి పురుషుల కబడ్డీ పోటీలు రాజస్థాన్‌లోను, మహిళల కబడ్డీ పోటీలు పాట్నాలోను జరుగుతాయని చెప్పారు. ఆ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టు సామర్లకోటలోనే ఎంపిక చేస్తామని తెలిపారు. ఏషియన్ గేమ్స్‌లో కబడ్డీలో బంగారు పతకం సాధించామని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం సామాన్యమైన విషయం కాదని, కమిటీ సభ్యులను అభినందించారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ క్రీడాకారులకు మాత్రమే గెలుపు, ఓటమిలను సులభంగా తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మన్యం పద్మావతి మాట్లాడుతూ ఆటలను స్నేహపూర్వకంగా ఆడాలన్నారు. రాష్ట్ర కార్మిక సంఘ నాయకుడు దవులూరి సుబ్బారావు మాట్లాడుతూ యువత ఎక్కువగా ఉన్న మన దేశంలో క్రీడలపై మరింత శ్రద్ధచూపాలన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ శ్రీధర్ ఆనంద్, కార్యదర్శి వి.వీరలంకయ్య, కోశాధికారి ఎం. రంగారావు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజులు, కార్యదర్శి పద్మనాభం, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్య దర్శి ఎం.శ్రీనివాస్‌కుమార్, కోశాధికారి ఏవీడీ ప్రసాద్, జాతీయ కబడ్డీ కోచ్ పోతలు సాయి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకటఅప్పారావు చౌదరి, పసల సత్యానందరావు, పంచా రామ క్షేత్ర ట్రస్టు బోర్డు చైర్మన్ కంటే బాబు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమార స్వామి, డిప్యూటీ సీఎం తనయుడు నిమ్మకాయల రంగనాగ్, రాష్ట్ర టీడీపీ ప్రచార కార్యదర్శి మన్యం చంద్రరావు, జిల్లా వాణిజ్య విభాగపు కార్యదర్శి గుమెళ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక మఠం సెంటర్ నుంచి పల్లం బీడ్‌లోని కోర్టు వరకు క్రీడాకారులు ర్యాలీగా తరలి వచ్చారు. ముఖ్య అతిథులు క్రీడా జెండాలను బెలూన్లు ఎగుర వేసి క్రీడలకు స్వాగతం పలికారు. అదే విధంగా కోర్టును వారు ప్రారంభించారు. పురుషుల విభాగంలో తూర్పు– కడప జట్ల మధ్య, మహిళల విభాగం నుంచి కర్నూలు– గుంటూరు జట్లతో పోటీలు ప్రారంభమ అయ్యాయి. రాష్టంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పీఈటీలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. -
ప్రియుడిపై హత్య, హత్యాయత్నం కేసులు
సామర్లకోట : సామర్లకోటలో శుక్రవారం రాత్రి తల్లీబిడ్డలను చెరువులోకి తోసేసిన ఘటనలో నిందితుడిపై హత్య, హత్యాయత్నం కేసులు నమోదు చేసినట్టు సీఐ కె.నాగేశ్వరరావు శనివారం తెలిపారు. స్థానిక ఓవర్ బ్రిడ్జి సెంటర్ నుంచి దిగువ భాగంలో ఉన్న సుగర్‌ఫ్యాక్టరీ చెరువులోకి శుక్రవారం ఓ వివాహితను, ఆమె ఏడాది బిడ్డను ఆమె ప్రియుడు తోసివేసిన విషయం తెలిసిందే. ఘటనలో బాలుడు మృతి చెందగా, బాధితరాలు సత్యవేణి (మణి) ప్రాణాలతో బయట పడ్డారు. సత్యవేణి ఫిర్యాదు మేరకు 302, 307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని సీఐ చెప్పారు. ఆయన కథనం ప్రకారం కాట్రావులపల్లికి చెందిన సత్యవేణికి వేలంగికి చెందిన మడికి బాలరాజుతో మూడేళ్ల క్రితం వివాహమైంది. అయితే ఏడాది క్రితం బాలరాజు సత్యవేణిని వదలి వేయడంతో బత్సల శేషుతో ఆమెకు పరిచయమైంది. దీంతో గత మూడు నెలలుగా ఆమె అతనితో కలిసి జగ్గంపేటలో నివాసం ఉంటుంది. శేషుకు కూడా పెళ్లైంది. సత్యవేణి తనను రెండో భార్యగా ఇంటికి తీసుకువెళ్లాలని శేషును ఒత్తిడి చేస్తుండడంతో శేషు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. ఆమెను ఆమె బిడ్డను ఆటోలో సామర్లకోట తీసుకొచ్చాడు. స్టేషన్ సెంటర్ నుంచి సత్యవేణిని ఆమె బిడ్డను బ్రిడ్జి మీదకు తీసుకెళ్లి అకస్మాత్తుగా వారిని చెరువులోకి తోసేశాడు. బాలుడు మృతిచెందగా, సత్యవేణి ప్రాణాలతో బయటపడ్డారు. భర్త నుంచి విడి పొయే సమయంలో సత్యవేణి మూడు నెలల గర్భిణి. శనివారం ఘటన స్థలాన్ని సీఐ నాగేశ్వరరావు, ఎస్సైలు ఎం.డి.ఎం.ఆర్.ఆలీఖాన్, నాగార్జున ఇతర సిబ్బంది పరిశీలించారు. నిందితుడు శేషును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
పోలీసు స్టిక్కర్.. జీపులో లిక్కర్
సామర్లకోట, న్యూస్‌లైన్ : పోలీసు స్టిక్కర్ ఉన్న జీపులో మ ద్యం షాపులకు సరకు సరఫరా చేయడం పలువురిని విస్మయపరి చింది. ప్రత్యేక వా హనంలో మద్యం రవాణా చేయాల్సి ఉండగా, పోలీసు స్టిక్కర్ ఉన్న జీపు ను వాడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఎస్సై ఎండీఎంఆర్ ఆలీఖాన్‌ను వివరణ కోరగా, మద్యం షాపుల యజమానులకు చెందిన జీపును ఇటీవల కోడిపందాల దాడుల కో సం వినియోగించినట్టు చెప్పారు. ఆ సమయంలో పోలీసు స్టిక్కర్‌ను అంటించినట్టు తెలిపారు. ఈ విషయం గుప్పుమనడంతో జీపు స్టిక్కరును పోలీ సులు తొలగిం చారు. ఈ విష యం సర్వత్రా చర్చనీయాంశ మైంది. -
బాలికలపై లైంగిక దాడికి యత్నాలు
జి.మేడపాడు(సామర్లకోట), న్యూస్‌లైన్ : ఓ మృగాడు బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. కుమార్తెను వెతుక్కుం టూ తల్లిదండ్రులు రావడంతో అతడు పరారయ్యాడు. పెద్దాపురం సీఐ కేవీ సత్యనారాయణ, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సామర్లకోట మం డలం జి.మేడపాడు శెట్టిబలిజపేటకు చెందిన 14 ఏళ్ల బాలిక మానసిక రుగ్మతతో బాధపడుతోంది. ఆమెను తల్లిదండ్రులు గారాబంగా పెంచుతున్నారు. రో డ్డు పక్కన టీస్టాల్ నిర్వహిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల మోకూ రి లచ్చయ్య ఆ బాలికపై కన్నేశాడు. బు ధవారం రాత్రి 10 గంటల సమయంలో బాలిక ఒంటరిగా ఉండడంతో ఆమెను సమీపంలోని పశువుల శా ల కు ఎత్తుకువెళ్లాడు. ఇంత లో తల్లిదండ్రు లు ఇంటికి చే రుకున్నారు. కుమార్తె కని పించకపోవడంతో పరిసరా ల్లో గాలించా రు. పశువులశాలలో బాలికపై లైంగిక దాడికి యత్నిస్తున్న లచ్చయ్య వారికి తారసపడ్డాడు. వారు గట్టిగా కేకలు వే యడంతో స్థానికులు అక్కడకు చేరుకుని, లచ్చయ్యకు దేహశుద్ధి చేశారు. వా రినుంచి తప్పించుకుని లచ్చయ్య పరారయ్యాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అత్యాచార నిరోధక చట్టం-2012 ప్రకారం కేసు నమోదు చేసినట్టు సీఐ సత్యనారాయణ తెలిపారు. యువకుడు లైంగిక దాడికి యత్నం రఘునాధపురం (రాజానగరం), న్యూస్‌లైన్ : ఎనిమిదేళ్ల బాలికపై 22 ఏళ్ల యువకుడు లైంగిక దాడికి యత్నం చేసిన సం ఘటన మండలంలోని దివాన్‌చెరువు పంచాయతీ శివారు రఘునాథపురంలో గురువారం చోటుచేసుకుంది. సకాలం లో బాలిక సోదరుడు, మరికొందరు రా వడంతో ఆ యువకుడు పరారయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మట్టా శివ చెడు వ్యసనాలకు బానిసై, అల్లరిచిల్లరగా తిరుగుతున్నాడు. అతడి ఇంటి సమీపంలో ఉంటున్న మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికను ఇంట్లో వస్తువులు తీసుకురావాలని పిలిచాడు. ఆ బాలికతో పాటు ఆమె తమ్ముడు, మరో ఇద్దరు పొరుగింటి పిల్లలు కూడా వెళ్లారు. వారిని మేడ పైకి వెళ్లి ఆడుకోమని చెప్పిన శివ, ఆ బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. భయంతో ఆ బాలిక కేకలు వేయడంతో మేడ పై ఆడుకుంటున్న ఆమె తమ్ముడు, మిగిలిన పిల్లలు పరుగున రావడంతో శివ పరారయ్యాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు పై కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వి.రామకోటేశ్వరరావు తెలిపారు. -
మద్యం మత్తులో భార్యను హతమార్చిన భర్త
మాధవపట్నం (సామర్లకోట), న్యూస్‌లైన్ : అనుమానం పెనుభూతమైంది. భార్యను హతమార్చి, కుమారుడిపై కత్తితో దాడి చేసేందుకు ప్రేరేపించింది. జిల్లాలో సోమవారం సంచలనం కలిగించిన ఈ సంఘటన మాధవపట్నంలో జరిగింది. ఇంద్రపాలెం పోలీసులు, స్థానికుల వివరాలు ఇలా ఉన్నాయి. మాధవపట్నంలోని సూరమ్మ చెరువు వద్ద వైఎస్సార్ కాలనీలో అనుకూరి కృష్ణ, బుజ్జమ్మ(40) దంపతులు నివసిస్తున్నారు. అతడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా, బుజ్జమ్మ గ్రామంలో వడ్డీ వ్యాపారం చేస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ముగ్గురికీ వివాహలు అయిపోవడంతో వేర్వేరుగా ఉంటున్నారు. పెద్ద కుమారుడు హైదరాబాద్‌లో నివసిస్తుండగా, చిన్న కుమారుడు శ్రీను తండ్రి ఇంటి ఎదురుగా ఉంటున్నాడు. ఆదివారం రాత్రి ఇంటికొచ్చిన కృష్ణ మద్యం మత్తులో భార్యతో గొడవ పడ్డాడు. అక్రమ సంబంధం అంటగట్టి.. ఇంట్లో ఉన్న కత్తితో బుజ్జమ్మపై ఆరుసార్లు వేట్లు వేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను మాయం చేయాలన్న ఉద్దేశంతో దుప్పట్లలో మూట కట్టి.. ఇంట్లో ఓ మూలన ఉంచాడు. ఈ విషయం తెలిస్తే కుమారుడు తనపై దాడి చేస్తాడని అతడికి అనుమానం వచ్చింది. ఈ క్రమంలో అతడు కుమారుడు శ్రీను వద్దకు వెళ్లి ‘అమ్మకు అనారోగ్యంగా ఉంది, ఆస్పత్రికి తీసుకెళ్లాలి’ అని చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చిన వెంటనే అక్కడున్న కత్తితో కృష్ణ అతడిపై దాడి చేశాడు. రెండు చేతులు తెగి వేలాడడంతో అతడు వేసిన కేకలు ఈ ప్రాంతంలో దద్దరిల్లాయి. స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అక్కడ బుజ్జమ్మ మరణించగా, శ్రీను కోమాలో ఉన్నాడు. నిందితుడు కృష్ణ పరారీ ఉన్నాడు. అక్రమ సంబంధం అనుమానంతో నిందితుడు ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే తరుచూ భార్య వద్ద ఉన్న నగదు కోసం కృష్ణ గొడవ పడుతుండే వాడని స్థానికులు తెలిపారు. సర్పంచ్ పిల్లి కృష్ణప్రసాద్ ఫిర్యాదు మేరకు ఇంద్రపాలెం ఎస్సై మురళీకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడని ఎస్సై చెప్పారు.