
తిరుమల : తిరుమల లడ్డూ, టీటీడీపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసిన వారిపై విజిలెన్స్ అధికారులు గురువారం తిరుమలలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. ‘తిరుపతి లడ్డా లేదా జీసెస్ లడ్డా?’ అనే శీర్షికతో డిసెంబర్ 29న వాట్సాప్‌లో ఒక సమాచారం విస్తృతంగా ప్రచారమైంది. దీన్ని టీటీడీ ఖండించింది. టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా వాట్సాప్‌లో ఈ సమాచారాన్ని పంపిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఇలాంటి అవాస్తవ సమాచారం ఇకపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కాకుండా నిలువరించేందుకు క్రైం నంబర్ 2/2020 యూ/ఎస్ 500, 505(2) ఐపీసీ సెక్షన్ల కింద టీటీడీ విజిలెన్స్ అధికారులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment