
బాలినేని శ్రీనివాసరెడ్డి(ఫైల్)
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులుగా బాలినేని శ్రీనివాసరెడ్డి, హెచ్ ఏ రెహమాన్ నియమితులయ్యారు. విశాఖపట్నంకు చెందిన బి. జాన్ వెస్లీ కార్యదర్శిగా నియమించారు.
పర్చూరుకు చెందిన గొట్టిపాటి భరత్- ప్రకాశం జిల్లా యూత్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు ఈ నియమకాలు జరిగినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.