ఉరవకొండ, ఉరకొండ రూరల్: ఉరవకొండ సిండికేట్ బ్యాంకు లో ఆత్మహత్య చేసుకున్న యువరైతు కుటుంబానికి సంఘీభావంగా ప్రతి పక్ష పార్టీలు శుక్రవారం ఉరవకొండ బంద్‌కు పిలుపు ఇచ్చాయి.
ఉరవకొండ, ఉరకొండ రూరల్: ఉరవకొండ సిండికేట్ బ్యాంకు లో ఆత్మహత్య చేసుకున్న యువరైతు కుటుంబానికి సంఘీభావంగా ప్రతి పక్ష పార్టీలు శుక్రవారం ఉరవకొండ బంద్‌కు పిలుపు ఇచ్చాయి. ప్రభుత్వం, బ్యాంకర్ల చర్యలతో రైతులు ప డుతున్న అగచాట్లకు ఈ సంఘటన నిదర్శనమని వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి.
రాత్రి వరకు కూడా అధికారులు సరైన తీరులో స్పందించక పోవడంతో శుక్రవారం బంద్‌కు పిలుపు ఇచ్చారు. ఎంబీఎ చదివి ఉద్యోగం రాక చివరకు వ్యవసాయుమే జీవనాధారంగా బతకాలని ఆశించిన ఒక యుువ రైతు బ్యాంకు అధికారుల వేధింపులతో విసిగిపోయి చివరుకు ఆత్మహత్య చేసుకోవడం పలువురిని కలిచివేసింది.
రాయుంపల్లి గ్రావూనికి చెందిన యుువ రైతు కోదండరామిరెడ్డి(29) స్దానిక సిండికేట్ బ్యాంకు అధికారుల ఒత్తిళ్ళుకు పురుగుల వుందు తాగి బ్యాంకులోనే ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉరవకొండలో సంచలనం రేగిత్తించింది. (సంఘటన వివరాలు మెయిన్‌లో) ఈసంఘటనపై వైఎస్‌ఆర్‌సీపీతో పాటు సీపీఐ, సీపీఎం, రైతులు గురువారం బ్యాంకు వద్ద పెద్ద సంఖ్యలో రాస్తారోకో నిర్వహించారు.
రైతులు వుృతుదేహాన్ని బ్యాంకు ఎదుట వుంచి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కవితా హోటల్ సమీపంలో వుృతుదేహాన్ని ఉంచి మేనేజర్‌ను అరెస్టు చేయూలంటూ ఆందోళన చేపట్టారు. స్దానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, యుువనేత వై.భీమిరెడ్డి రైతుకుటుంబానికి ధైర్యం చెబుతూ ఆందోళనలో పాలుపంచుకున్నారు.
అరుుతే రాత్రి 9గంటల వరుకు జిల్లా నుంచి ఒక్క అధికారి కుడా సంఘటన స్దలానికి చేరుకోకపోవడం రైతులకు ఆగ్రహం తెప్పించింది. స్దానిక తహసీల్దార్ బ్రహ్మయ్యు రైతు కుటుంబం సవూచారాన్ని సేకరించి ఉన్నతాధికారులకు పంపారు.
జిల్లా కలెక్టర్ సంఘటన స్దలానికి రావాలని శవాన్ని అక్కడే ఉంచి ఆందోళనకు దిగారు. ఉరవకొండ పోలీసులు కుటుంబ సభ్యలకు నచ్చచెప్పడానికి ప్రయుత్నించినా మేనేజర్‌ను అరెస్టు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తావుని పెద్ద సంఖ్యలో రైతులు శిబిరం వేసి మృత దేహాన్ని అక్కడే ఉంచి ఆందోళన చేపట్టారు.
అనంతరం ఎస్‌పీ ఆదేశాల మేరకు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ దుర్గాప్రసాద్ సంఘటన స్దలానికి వచ్చి ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, వుృతుని కుటుంబ సభ్యులతో చర్చించారు. శుక్రవారం బంద్‌కు అన్ని వర్గాల వారు కలిసి రావాలని, సహకరించాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు పిలుపు ఇచ్చారు.
బ్యాంకు అధికారుల
తీరు దారుణం
బ్యాంకుల్లో రైతులను అధికారులు బిక్షగాళ్ళగా చుస్తున్నారు, కనీసం సవూధానం చెప్పకుండా నెలల తరబడి రుణాల కోసం బ్యాంకుల చుట్టు తిప్పుతున్నారు. ప్రభుత్వ విధానలే దీనంతటికి కారణంగా కన్పిస్తోంది.
- జ్ఞానవుూర్తి, రైతుసంఘం నాయుకుడు
రైతులను
మోసం చేసిన రుణవూఫీ:
రుణవూఫీ చేస్తావుని ప్రభుత్వం చెప్పడంతో రైతులు రుణాలు చెల్లించలేదు. ఇ ప్పడేమో బ్యాంకు అధికారులు ఒత్తిడి కారణంగా రైతులు అప్పులు చేసి రుణాలు చెల్లిస్తున్నారు. చెల్లించని రైతులను భూవుులను వేలం వేస్తావుని బెదిరిస్తున్నారు.
- లింగన్న, రేణువూకుపల్లి, రైతు
రైతుల వునోభావాలు
దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు:
రైతులను దొంగల్లా చుస్తు వారిని బ్యాం కు, రెవిన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వూ ట్లాడుతున్నారని, కార్యాలయూలకు వెళ్ళే రైతుల వునోభావాలు దెబ్బతినేలా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఈదుస్థితికి కారణం ప్రభుత్వ విధానలే.
- అశోక్,
వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి,
కిసాన్‌సెల్