బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : ఎంతోకాలం నుంచి ఊరిస్తున్న త్రీజీ సేవలు మరో నెల రోజుల్లో వినియోగదారుల దరి చేరనున్నారుు. 2014 జనవరి నెలాఖరులోగా త్రీజీ సేవలను బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు అందుబాటులోకి తేవడానికి అధికార యంత్రాంగం చర్యలు వేగవంతం చేసింది. ఇందుకోసం తూర్పు ప్రాంతంలోని మంచిర్యాల, సీసీసీ, రామకృష్ణాపూర్, మందమర్రి, చెన్నూర్, బెల్లంపల్లి, మాదారంటౌన్‌షిప్, గోలేటిటౌన్‌షిప్, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, జన్నారం, లక్సెట్టిపేట ప్రాంతాల్లో త్రీజీ సేవలకు సంబంధించిన పరికరాలను టవర్లపై అమర్చే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. యాంటేనా, వైరింగ్ ఇతర పరికరాలను కొద్ది రోజుల నుంచి సాంకేతిక సిబ్బంది టవర్లపై బిగిస్తున్నారు. వచ్చే నెలలో త్రీజీ సేవలను ప్రారంభించనున్నట్లు సమాచారం. కొత్తేడాదిలో వినియోగదారులకు సరికొత్త సేవలు అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు ఆయూ పనులు వేగవంతం చేశారు.
నెలవేరబోతున్న కల
ఇతర జిల్లాల్లో త్రీజీ సేవలు ఈపాటికే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. కానీ తూర్పుజిల్లా ప్రజలకు ఇంత వరకు బీఎస్‌ఎన్‌ఎల్ ఆ భాగ్యం కల్పించలేదు. ఆలస్యంగానైనా త్రీజీ సేవలు చేరువ కానుండడంతో సెల్ వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్రీజీ సేవలతో బీఎస్‌ఎన్‌ఎల్ టూ బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు సెల్‌ఫోన్ వీడియో కాలింగ్ ద్వారా ముఖాముఖీగా సంభాషించడానికి వీలు కలుగుతుంది. వీడియో నాణ్యత సైతం పెరుగుతుంది. హైస్పీడ్ ఇంటర్‌నెట్ అందుబాటులోకి వస్తుంది. ఎలాంటి అంతరాయం లేకుండా నెట్, వీడియో కాలింగ్ చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఏదైతేనేం కొత్తేడాదిలో త్రీజీ సేవలు అందుబాటులోకి రానుండటంతో అందరిలోనూ హర్షం వ్యక్తమవుతోంది.
తూర్పులో త్రీజీ సేవలు
Published Wed, Dec 25 2013 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM
Advertisement
Advertisement