బీజేపీ వేసే ఓటుతోనే తెలంగాణ సాధ్యం: కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ పూర్తి మద్దతు ఉంటుంది అని కిషన్‌రెడ్డి తెలిపారు. గురువారం పార్లమెంట్ లో జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకునే బీజేపీ అగ్రనేతలు అద్వానీ, సుష్మా, రాజ్‌నాథ్‌లు మాట్లాడారని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇవ్వమని ఎప్పుడూ చెప్పలేదు అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే సీమాంధ్రకు న్యాయం చేయాలి బీజేపీ డిమాండ్ చేస్తున్న విషయాన్ని మీడియా దృష్టికి తీసుకువచ్చారు.
బీజేపీ వేసే ఓటుతోనే తెలంగాణ సాధ్యం అని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గందరగోళం మధ్య సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టారు అని, సీమాంధ్ర ఎంపీలను ముందే కట్టడి చేస్తే పార్లమెంట్‌లో అలాంటి ఘటనలు జరగవు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
పార్లమెంట్ లో అదుపుతప్పుతున్న టీడీపీ ఎంపీలపై చర్యలు తీసుకోవాలి అని చంద్రబాబుకు కిషన్‌రెడ్డి సూచించారు.