ఆ బ్యాచ్కు అడ్డూ అదుపూ లేదు.. | blade batch attack the one person in vijayawada | Sakshi
Sakshi News home page

ఆ బ్యాచ్కు అడ్డూ అదుపూ లేదు..

Published Sat, Jul 29 2017 3:53 PM | Last Updated on Wed, Apr 3 2019 3:50 PM

ఆ బ్యాచ్కు అడ్డూ అదుపూ లేదు.. - Sakshi

ఆ బ్యాచ్కు అడ్డూ అదుపూ లేదు..

విజయవాడ: నగరంలో రోజు రోజుకు  బ్లేడ్‌బ్యాచ్‌ అగడాలకు  అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. రాత్రి సమయంలో వచ్చే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ బ్యాచ్ దాడులు చేసి డబ్బులు డిమాండ్ చేస్తుంది. డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఓ వ్యక్తి పై దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపర్చారు. ఈ సంఘటన నగరంలో ప్రసాదంపాడులో శనివారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసిస్తున్న శివకుమార్ శుక్రవారం రాత్రి బైక్ పై వస్తున్న సమయంలో కొందరు యువకులు అతన్ని అడ్డగించి డబ్బులు డిమాండ్ చేశారు.

శివకుమార్ ఇవ్వడానికి నిరకరించడంతో వారంతా కలిసి బ్లేడ్లు, కత్తులతో దాడి చేశారు.  ఈ దాడిలో అతనికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత కొంతకాలంగా నగరంలో కొంత మంది యువకులు గంజాయి సేవించి అల్లర్లు సృష్టిస్తున్నారని శివకుమార్ పోలీసులకు తెలిపారు. తనపై దాడి చేసిన ఘటనలో బ్లేడ్ బ్యాచ్ కు చెందిన 10 మందికి పైగా ఉన్నారని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.






 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement