మదనపల్లె రూరల్ : బండను చీల్చడాని కి అమర్చిన నాటు బాంబులు ప్రమాదవశాత్తు పేలడంతో ఇద్దరు బండ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సం ఘటన బుధవారం మదనపల్లె మండలంలోని చీకలబైలు గ్రామంలో జరిగిం ది. ఘటనకు సంబంధించి బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉ న్నాయి. బార్లపల్లెకు చెందిన శేఖర్ (42), అదే ఊరికి చెందిన మరో కార్మికుడు దగ్గలప్ప(30) బండలు కొట్టి పు నాది రాళ్లను తీసేవారు. ఈ క్రమంలో రోజు మాదిరిగానే బుధవారం ఉద యం ఊరికి సమీపంలోని గుట్ట దగ్గరకు బండలు తీయడానికి వెళ్లారు. ముం దుగా బండలను పేల్చడానికి రంధ్రాలు వేసి నాట్లు అమర్చుకున్నారు.
పేల్చడానికి ముందు బండపైన కార్మికులు ఎ వ్వరూ లేకుండా చూసి ఆ తర్వాత చు ట్టుపక్కల ఉన్న జనాలను దూరం వెళ్లమని హెచ్చరిస్తారు. ఈ క్రమంలో ప్ర మాదవశాత్తు బ్యాటరీని ఆన్ చేయడం తో ఒక్కసారిగా నాట్లు పేలి బండపైనే వున్న కార్మికులు శేఖర్, దగ్గప్పకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది బాధితులను వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆ స్పత్రికి తరలించారు. పరిస్థితి విష మంగా ఉండడంతో ప్రథమ చికిత్సఅనంతరం వైద్యుల సూచన మేరకు ఇద్దరిని తిరుపతికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నాటు బాంబులు పేలి కార్మికులకు గాయాలు
Published Thu, Jul 30 2015 4:40 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement
Advertisement