ఏసీబీ వలలో సీసీఎస్ సీఐ | Border into the trap of getting the Project | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో సీసీఎస్ సీఐ

Published Thu, Jun 5 2014 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 8:19 AM

Border into the trap of getting the Project

  •      బెయిల్ ఇంప్లూమెంట్‌కు డబ్బులు డిమాండ్
  •      ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు
  •      పథకం ప్రకారం సీఐ, హెడ్‌కానిస్టేబుల్‌ను పట్టుకున్న వైనం
  •  పోచమ్మమైదాన్, న్యూస్‌లైన్ : ఏసీబీ అధికారుల చేతి కి మరో అవినీతి చేప చిక్కింది. బెయిల్ ఇంప్లూమెం ట్(కొనసాగించేందుకు) కోసం డబ్బులు డిమాండ్ చేసినందుకు వరంగల్ అర్బన్ సీసీఎస్-2 సీఐ శివసాంబిరెడ్డితోపాటు హెడ్ కానిస్టేబుల్ ఐలయ్యను బుధవారం రాత్రి ఏసీబీ అధికారులు పథకం ప్రకా రం పట్టుకున్నారు.

    ఏసీబీ డీఎస్పీ సాయిబాబా కథ నం ప్రకారం.. డీఈఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ సస్పెండ్‌కు గురైన ఫక్రుద్దీన్ బధీ ర ఉపాధ్యాయుల అక్రమ నియామకం కేసులో నింది తుడు. 2012 డీఎస్సీలో నలుగురు బధీర ఉపాధ్యాయుల నియామకాల్లో ఫక్రుద్దీన్ హస్తం కూడా ఉంద ని వరంగల్ అర్బన్ సీసీఎస్ పోలీసులు ఇటీవల అతడికి అరె స్ట్ వారెంట్‌ను జారీచేశారు. దీంతో ముందస్తు బెయిల్ ఫక్రుద్దీన్ వరంగల్ కోర్టులో ఇటీవల దరఖా స్తు చేసుకోగా న్యాయమూర్తి నిరాకరించారు. దీంతో ఫక్రుద్దీన్ బెయిల్ కోసం హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు.

    ఈ మేరకు హైకోర్టు అతడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్‌ను ఇంప్లూమెంట్ చేయాలని ఫక్రుద్దీన్ ఇటీవల వరంగల్ అర్బన్ సీసీఎస్ సీఐ శివసాంబిరెడ్డిని కోరాడు. కాగా, బె యిల్ ఇంప్లూమెంట్ కోసం సీఐ.. ఫక్రుద్దీన్ నుంచి రూ. 50వేలు డిమాండ్ చేశారు. అయితే తన దగ్గర అంత డ బ్బు లేదని చెబుతూ.. తన సమీప బంధువు రిటైర్‌‌డ ఎస్సై మస్తాన్‌ను తీసుకెళ్లి సీఐ దగ్గర ప్రాధేయపడ్డాడు. దీంతో కనీసం తనకు రూ.27వేలు ఇవ్వాలని సీఐ డిమాండ్ చేయగా దానికి ఫక్రుద్దీన్ ఒప్పుకున్నాడు.

    ఇందులో భాగంగా మొత్తం నాలుగు కేసుల్లో సీఐ రెండింటికి బెయిల్ మంజూరు చేశాడు. అయితే మరో రెండింటికి డబ్బులిచ్చినాకానే ఇస్తానని సీఐ చెప్పాడు. కాగా, ఇదే విషయమై సీఐ.. ఫక్రుద్దీన్‌కు ప్రతి రోజు ఫోన్ చేసి డబ్బులు ఎప్పుడు తీసుకొస్తున్నావని వేధిస్తున్నాడు. దీంతో సీఐ వేధింపులను భరించలేని బాధితుడు ఫక్రుద్దీన్ తన సమీప బంధువు రిటైర్‌‌డ ఎస్సై మస్తాన్ సాయంతో ఇటీవల ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

    ఈ క్రమంలో బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు మట్టెవాడలోని అర్బన్ సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని డబ్బులు తీసుకొచ్చినట్లు రిటైర్‌‌డ ఎస్సై మస్తాన్.. సీఐ శివసాంబి రెడ్డికి సమాచారం అందించాడు. దీంతో సీఐ వెంటనే తన పక్కనే ఉన్న హెడ్ కానిస్టేబుల్ అయిలయ్యను పిలిచి ఫక్రుద్దీన్ దగ్గర నుంచి డబ్బులు తీసుకురా.. అని బయటకు పంపించాడు. కాగా, ఫక్రుద్దీన్, రిటైర్‌‌డ ఎస్సై మస్తాన్‌లు పోలీస్‌స్టేషన్ సమీపంలోని కారులో కూర్చుని కానిస్టేబుల్ అయిలయ్యకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

    అనంతరం అయిలయ్య దగ్గర ఉన్న రూ. 25వేల నగదును స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఏసీబీ అధికారులు రిటైర్‌‌డ ఎస్సై మస్తాన్ దగ్గర ఉన్న వాయిస్ రికార్డింగ్ ను పరిశీలించి సీఐ శివసాంబిరెడ్డిని, ఐలయ్య అరెస్ట్ చేశారు. దాడుల్లో ఏసీబీ సీఐలు రఘువేందర్‌రావు, సాంబయ్య, బాపురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
     
    ఇప్పటికి రెండు సార్లు సస్పెండ్..?

    ఇదిలా ఉండగా, ఏసీబీకి చిక్కిన సీసీఎస్ సీఐ శివసాంబిరెడ్డి ఇప్పటివరకు రెండుసార్లు విధుల నుంచి సస్పెండ్ అయినట్లు తెలిసింది. నర్సంపేట పోలీస్‌స్టేషన్‌లో నల్లబెల్లం కేసులో, అలాగే నర్మెటలో భూమి కేసులో సస్పెండ్ అయినట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement