ఏకకాలంలో విశాఖ, విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టులు
మెట్రో రైలు ప్రాజెక్టు ప్రభుత్వ సలహాదారు శ్రీధరన్
విశాఖపట్నం: విశాఖపట్నం, విజయవాడలలో మెట్రోరైలు ప్రాజెక్టులను ఏకకాలంలోనే చేపడతామని రాష్ట్ర ప్రభుత్వ మెట్రోరైలు ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్ తెలిపారు. ఈ రెండు నగరాల్లో మెట్రోరైలు నిర్వహణ ప్రభుత్వానికి భా రం కాకుండా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఇందుకోసం విశాఖపట్నం, విజయవాడలలో సర్వే చేసి డీటైల్డ్‌ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ను ఆరునెలల్లో ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. ప్రభుత్వ అనుమతి లభించిన తరువాత పనులు చేపట్టి మూడేళ్లలో పూర్తిచేయాలన్నది తమ ఉద్దేశమని ఆయన చెప్పారు.
మెట్రోరైలు ప్రాజెక్టు అంశాన్ని పరిశీలించేందుకు శ్రీధరన్ బృందం మంగళవారం విశాఖపట్నంలో పర్యటించింది. వుడా కార్యాలయంలో జీవీఎంసీ, వుడా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించింది. అన ంతరం శ్రీధరన్ విలేకరులతో మాట్లాడుతూ విశాఖ, విజయవాడలలో ఒకేసారి ప్రాజెక్టు చేపడితే పెట్టుబడి వ్యయం కొంతవరకు తగ్గుతుందన్నారు. తిరుపతి కోసం ప్రత్యేక ప్రణాళిక ఉందన్నారు. అందుకే విశాఖ, విజయవాడ ప్రాజెక్టుల తరువాత తిరుపతి ప్రతిపాదనలు రూపొంది స్తామన్నారు. విశాఖలో నాలుగు కారిడార్లతో, విజయవాడలో రెండు కారిడార్లతో మెట్రోప్రాజెక్టును చేపట్టాలని యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు.
విశాఖ ప్రాజెక్టును 30కి.మీ.మేర నిర్మించాలన్నది ప్రాథమిక అంచనా అని శ్రీధరన్ తెలి పారు. త్వరలోనే డీఎంఆర్‌సి నిపుణులు విశాఖలో పర్యటించి నివేదిక ఇస్తారని వివరించారు. ప్రాజెక్టుకు అవసరమైన పెట్టుబడి, మెట్రోరైలు ఏర్పాటు, నిర్వహణ మొదలైన అన్ని అంశాలతో సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేస్తామన్నారు. విశాఖలో భూగర్భ మెట్రో నిర్మించాల్సి న అవసరం లేదన్నారు. విశాఖపట్నంలో మె ట్రో రైలు డిపో ఏర్పాటుకు 20 హెక్టార్ల స్థలం అవసరమవుతుందని శ్రీధరన్ తెలిపారు. విద్యు త్ సరఫరా కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో వుండాలన్నారు.
వుడా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో డీఎంఆర్‌సి డెరైక్టర్ ఎస్‌డి శర్మ, చీఫ్ కన్సల్టెంట్ బిబి శంకర్, మేనేజర్ వి. ఆర్మ్‌స్ట్రాంగ్, విజయవాడ మెట్రో డిప్యూ టీ ప్రాజెక్టు డెరైక్టర్ పి. రంగారావు, జీవీఎంసీ కమిషనర్ ఎం. జానకి, వుడా వైస్ ైచె ర్మన్ ఎం. వి శేషగిరిబాబు, జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ బి. జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం శ్రీధరన్ బృందం విశాఖపట్నంలోని తగరపువలస, హనుమంతువాక, మద్దిలపాలెం, ఎన్‌ఏడీ, కూర్మనపాలెంలలో పర్యటించి మెట్రోరైలు ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను పరిశీలించింది. శ్రీధరన్ బృందం బుధవారం కూడా విశాఖపట్నంలో పర్యటించి అధికారులతో సమీక్షిస్తుంది.