Sreedharan
-
‘మెట్రో మేన్’ ఆఫ్ ఇండియా
1964 డిసెంబరులో సంభవించిన ఒక తుఫాను కారణంగా రామేశ్వరానికి, తమిళనాడు ప్రధాన భూభాగానికి అనుసంధానంగా ఉండే పంబన్ వంతెన కొట్టుకుపోయింది. ఈ వంతెన మరమ్మతులు చేయటానికి రైల్వే శాఖ ఆరు నెలల లక్ష్యాన్ని నిర్దేశించినప్పుడు శ్రీధరన్ పని చేస్తున్న సివిల్ ఇంజనీరింగ్ సంస్థ యజమాని ఈ ప్రాజెక్టు నుంచి పలు కారణాల రీత్యా పక్కకు తప్పుకున్నారు. దాంతో ఆ ప్రాజెక్టు మరమ్మతుల బాధ్యత శ్రీధరన్ స్వీకరించారు. 46 రోజుల్లో వంతెనను పునరుద్ధరించి రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి పురస్కారం అందుకున్నారు. అయితే ఇదొక్కటే ఈ ‘మెట్రో మేన్’ ఘనత కాదు. భారతదేశంలో మొట్టమొదటి మెట్రో రైల్ అయిన కలకత్తా మెట్రో ప్రణాళిక, రూపకల్పనలకు 1970 లో డిప్యూటీ చీఫ్ ఇంజనీర్‌గా శ్రీధరన్ బాధ్యత వహించారు. ఆ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేసి భారతదేశంలో కొత్త ప్రయాణ శకానికి శ్రీకారం చుట్టారు. అనంతరం 1979లో కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో చేర్టారు. 1987లో ఆయన వెస్టన్ర్ రైల్వే జనరల్ మేనేజర్‌గా పదోన్నతి పొందారు. 1990లో అన్ని విధులకు పదవీ విరమణ చేసిన తరువాత కూడా ఆయన సేవలు దేశానికి ఇంకా అవసరమని భావించిన ప్రభుత్వం కొంకణ్ రైల్వే విభాగానికి సిఎండిగా నియమించింది. ఒక ప్రాజెక్టును ఆయన చేతికి అందించింది. 82 కిలోమీటర్ల పొడవున 93 సొరంగాలు, మృదువైన నేల ద్వారా ఒక సొరంగ మార్గం, మొత్తం 760 కిలోమీటర్ల దూరం, 150 కి పైగా వంతెనల నిర్మాణంతో కూడుకుని ఉన్న ఆ ప్రాజక్టును కూడా శ్రీధరన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఆ తర్వాత ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు ఆయనను ఆనాటి ఢిల్లీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. ఈ ప్రాజెక్టును 1997 మధ్య నాటికి అన్ని షెడ్యూల్ విభాగాలలో గడువు తేదీ కన్నా ముందే పూర్తిచేసి ప్రశంశలు అందుకున్నారు శ్రీధరన్. ఆ ప్రాజెక్టు తర్వాతనే మీడియా ఆయన్ని ‘మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా’ అనడం మొదలు పెట్టింది. ఢిల్లీ మెట్రో ప్రాజెక్టులో 16 సంవత్సరాల సేవ తరువాత 2011 డిసెంబరులో ఆయన పదవీ విరమణ చేశారు. శ్రీధరన్ 1932 జూన్ 12న కేరళలోని, పాలక్కాడ్ సమీప గ్రామంలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో సివిల్ ఇంజనీరింగ్ చదివారు. బాంబే పోర్ట్ ట్రస్ట్‌లో ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్‌గా ఉన్నారు. 1953 లో యుపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్షను పూర్తి చేసి, ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్ (ఐఆర్ఎస్ఇ) లో చేరారు. 1954 డిసెంబర్లో దక్షిణ రైల్వేలో ప్రొబేషనరీ అసిస్టెంట్ ఇంజనీర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2008లో భారత ప్రభుత్వం శ్రీధరన్‌ని పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుతం ఆయన తన 90 ఏళ్ల వయసులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. (చదవండి: అజ్ఞాత ఆజ్ఞలు) -
రాజకీయాలకు మెట్రోమ్యాన్ గుడ్‌బై
సాక్షి, మలప్పురం: కేరళ అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి, ఓటమిపాలైన మెట్రోమ్యాన్ ఈ. శ్రీధరన్ క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ‘సహజంగా నేనెప్పుడూ రాజకీయ నాయకుడిని కాను. ఉండాలనుకోలేదు. నాకిప్పుడు 90ఏళ్లు. అందుకే క్రియాశీల రాజకీయాల్లో కొనసాగాలనుకోవడం లేదు. ప్రస్తుతం మూడు ట్రస్టుల ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాను ’అని శ్రీధరన్ గురువారం పొన్నానిలో మీడియాతో అన్నారు. ఈ పరిణామంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ స్పందించారు. క్రియాశీల రాజకీయాల్లో లేకున్నా శ్రీధరన్ సేవలను పార్టీ ఇతర అంశాలకు సంబంధించి ఉపయోగించుకుంటుందని చెప్పారు. శ్రీధరన్ ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. బీజేపీ తరఫున కేరళ సీఎం అభ్యర్థిగా పాలక్కడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శ్రీధరన్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. చదవండి: కొన్ని రోజులు కలిసుంటే సహజీవనం కాదు! -
జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా శరత్
జాతీయ జూనియర్ క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా తమిళనాడు రంజీ క్రికెట్ జట్టు మాజీ కెపె్టన్ శ్రీధరన్ శరత్ బాధ్యతలు చేపట్టారు. తమిళనాడు జట్టు తరఫున 100 రంజీ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా శరత్ ఘనత వహించాడు. ఈ కమిటీలో కిషన్ మోహన్, రణదేవ్ బోస్, పథీక్ పటేల్, హరీ్వందర్ సింగ్ సోధీ ఇతర సభ్యులు. ఈ కమిటీ వచ్చే ఏడాది వెస్టిండీస్ వేదికగా జరిగే అండర్–19 ప్రపంచ కప్ కోసం త్వరలోనే భారత జట్టును ఎంపిక చేయనుంది. -
బీజేపీ వ్యూహం: ఎన్నికల బరిలో కేంద్ర మంత్రి.. ఎంపీలు..
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర మంత్రిని, ఎంపీలను కూడా అసెంబ్లీ బరిలోకి దింపింది. కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో సహా నలుగురు ఎంపీలను పశ్చిమబెంగాల్లో, ఇద్దరు ఎంపీలను, మెట్రోమ్యాన్ శ్రీధరన్‌ను కేరళలో, ప్రముఖ సినీ నటి, పార్టీ జాతీయ ఆఫీస్‌బేరర్ ఖుష్బూను తమిళనాడులో పోటీలో నిలిపింది. పార్టీ ప్రదాన కార్యదర్శి అరుణ్‌సింగ్, బాబుల్ సుప్రియో, మరో కేంద్ర మంత్రి దేబశ్రీ చౌధురి ఆదివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థుల పేర్లను విడుదల చేశారు. పశ్చిమబెంగాల్‌కు సంబంధించి 63 మందితో, తమిళనాడు, అస్సాంల్లో 17 మంది చొప్పున, కేరళలో 112 మందితో కూడిన జాబితాను విడుదల చేశారు. కేరళలోని మొత్తం 140 స్థానాల్లో 115 సీట్లలో బీజేపీ పోటీ చేస్తోంది. మిగతా స్థానాల్లో మిత్ర పక్షాలు పోటీ చేస్తాయని అరుణ్ సింగ్ వెల్లడించారు. పశ్చిమబెంగాల్లో టాలీగుంగే నుంచి బాబుల్‌సుప్రియో, దిన్హట నుంచి ఎంపీ నిశిత్ ప్రామాణిక్, చుంచురా స్థానం నుంచి ఎంపీ లాకెట్ చటర్జీలను, తారకేశ్వర్ స్థానం నుంచి రాజ్యసభ ఎంపీ స్వపన్ దాస్ గుప్తాను బరిలో దింపారు. మాజీ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అశోక్ లాహిరికి అలీపుర్దౌర్ స్థానం కేటాయించారు. లాహిరి 2017 నుంచి 2020 వరకు ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా ఉన్నారు. టికెట్ నిరాకరించడంతో తృణమూల్ నుంచి బీజేపీలో చేరిన సీనియర్ నాయకుడు రవీంద్రనాథ్ భట్టాచార్యకు సింగూరు నుంచి అవకాశం కల్పించారు. సినీతారల్లో తనుశ్రీ చక్రవర్తి(శ్యాంపూర్), పాయల్ సర్కార్(బెహల పుర్బ), యశ్‌దాస్ గుప్తా(చండితల)లకు టికెట్లు ఇచ్చారు. అశోక్ లాహిరి, స్వపన్‌దాస్ గుప్తాలకు అవకాశం కల్పించడం ద్వారా 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమకు దూరంగా ఉన్న రాష్ట్రంలోని మేధావి వర్గాన్ని ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నించింది. కేరళలో ఇటీవలే బీజేపీలో చేరిన మెట్రోమ్యాన్ ఈ శ్రీధరన్‌ను పాలక్కాడ్ నుంచి, కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ కేజే ఆల్ఫోన్స్‌ను కంజీరప్పల్లి నుంచి, రాజ్యసభ ఎంపీ, నటుడు సురేశ్ గోపీని త్రిస్సూర్ నుంచి, మరో నటుడు కృష్ణ కుమార్‌ను తూర్పు తిరువనంతపురం నుంచి బీజేపీ పోటీలో నిలిపింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి వ్యతిరేకంగా ఉద్యమించిన కే సురేంద్రన్ కొన్ని, మంజేశ్వర్ స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. సీనియర్ నేత పద్మనాభన్‌కు ముఖ్యమంత్రి విజయన్ పోటీలో ఉన్న ధర్మడం స్థానాన్ని బీజేపీ కేటాయించింది. అస్సాంలో బాఘ్బర్ సీటు నుంచి హసీనారా ఖాతూన్, హాజో స్థానం నుంచి సుమన్ హరిప్రియ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. మార్చ్ 27 నుంచి 8 దశల్లో పశ్చిమబెంగాల్లో, మూడు దశల్లో అస్సాంలో, ఒకే దశలో ఏప్రిల్ 6న కేరళ, తమిళనాడుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. చదవండి: అక్కడ మాత్రమే బీజేపీ గెలుస్తుంది: శరద్ పవర్ -
బీజేపీ సీఎం అభ్యర్థిగా ‘మెట్రోమ్యాన్’!
తిరువనంతపురం: దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తోన్న బీజేపీ అందుకు తగ్గట్లుగా పావులు కదుపుతోంది. మరి కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. వీటిలో దక్షిణాది రాష్ట్రాలు కేరళ, తమిళనాడు కూడా ఉన్నాయి. తమిళ ప్రజలు బీజేపీ పట్ల అంత విశ్వాసం చూపరు. ఈ క్రమంలో కాషాయ పార్టీ కేరళలో పాగా వేసేందుకు సీరియస్‌గా ట్రై చేస్తోంది. దానిలో భాగంగా మెట్రో మ్యాన్ ఈ. శ్రీధరన్‌ని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ మేరకు గురువారం కేరళ బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ కే సురేంద్రన్ ప్రకటన విడుదల చేశారు. కేరళ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెట్రోమ్యాన్ శ్రీధరన్ పేరును ప్రకటించారు. మిగతా వారి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. శ్రీధరన్ గత వారం బీజేపీలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తే తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధం అని తెలిపారు. తాజాగా బీజేపీ ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. శ్రీధరన్‌కున్న క్లీన్ ఇమేజ్ తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. ఈ సందర్భంగా శ్రీధరన్ మాట్లాడుతూ.. ‘‘ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే దాని గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎక్కడ నుంచి పోటీ చేసినా నేను గెలుస్తాననే నమ్మకం ఉంది. ఈ సారి బీజేపీ అధికారంలోకి వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అయితే, నేను ఇప్పుడు నివసిస్తున్న మలప్పురంలోని పొన్నానికి సమీపంగా ఉండే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను”అని తెలిపారు. కొచ్చి మెట్రో ప్రాజెక్టుకు గురువుగా ఉన్న శ్రీధరన్ తాను ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగే సంప్రదాయాన్ని పాటించనని తెలిపారు. ‘‘నేను ఇళ్లకు, దుకాణాలకు, ఊర్లకు వెళ్లను. కానీ నా సందేశం ఓటర్లందరికి చేరుతుంది’’ అన్నారు. వృద్ధులను పక్కకు పెడుతున్న బీజేపీ తాజాగా 88 ఏళ్ల శ్రీధరన్‌ను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. చదవండి: మెట్రోమ్యాన్ లక్ష్యం నెరవేరేనా? లవ్ జిహాద్‌పై శ్రీధరన్ సంచలన వ్యాఖ్యలు! -
మెట్రోమ్యాన్ లక్ష్యం నెరవేరేనా?
దేశం మొత్తంలో విజయం సాధించాలనే మోదీ ఆకాంక్షకు వ్యతిరేకంగా నిలిచిన చిట్టచివరి దుర్గమదుర్గాల్లో కేరళ ఒకటి. ఏం చేసైనా సరే కేరళను గెల్చుకోవాలి. మోదీకి ఆ పని చేసిపెట్టే జనరల్‌గా శ్రీధరన్ ఇప్పుడు ముందుకొచ్చారు. మరి తన ఆకాంక్షను నెరవేర్చుకునే మార్గంలో ఆయనకు వయస్సు ఎందుకు అడ్డు రావాలి? శ్రీధరన్‌కి వయోపరిమితి అడ్డు రాదు. బీజేపీ వయోపరిమితి ఆంక్షలను చాలా సందర్భాల్లో సడలించేసింది. వామపక్షాలు మాత్రమే ఇప్పటికీ ఈ వయోపరిమితి నియమాన్ని కఠినంగా అమలు చేస్తున్నాయి. ఇంత ముఖ్యమైన నిర్ణయాన్ని పార్టీలకు మనం వదిలేసినంత కాలం మన దేశంలోని రాజకీయ పార్టీలు ఇలాంటి నియమాలను రూపొందిస్తూనే ఉంటాయి. మళ్లీ వాటిని తమకు తాముగా ఉల్లంఘిస్తుంటాయి. దేశంలో అనేక సంక్లిష్టమైన బ్రిడ్జిలను, ప్రత్యేకించి అత్యంత ప్రాచుర్యం పొందిన ఢిల్లీ మెట్రో సిస్టమ్‌ని అభివృద్ధి చేసిన మాజీ రైల్వే అధికారి, మెట్రోమ్యాన్ శ్రీధరన్ ఇప్పుడు బీజేపీలో చేరారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. కానీ తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడానికి వయస్సు ఆయనకు అడ్డంకేమీ కాలేదు. ఆయన వేసిన అడుగు సాహసోపేతమైనది కాబట్టే కొనియాడదగినది. కేరళలో బీజేపీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉండటం, రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ఆ పార్టీ చాలా దూరంలో ఉంటున్న నేపథ్యంలో శ్రీధరన్ నిర్ణయం అసాధారణమైందనే చెప్పాలి. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన అశ్వమేధ యజ్ఞం ప్రకారం బీజేపీకి కేరళలో అధికారం చేజిక్కించుకోవడం చాలా కీలకమైన విషయం. దేశం మొత్తంలో విజయం సాధించాలనే మోదీ ఆకాం క్షకు వ్యతిరేకంగా నిలిచిన చిట్టచివరి దుర్గమదుర్గాల్లో కేరళ ఒకటి. కాబట్టి ఏం చేసైనా సరే కేరళను గెల్చుకోవాలి. మోదీకి ఆ పని చేసిపెట్టే జనరల్‌గా శ్రీధరన్ ఇప్పుడు ముందుకొచ్చారు. గవర్నర్ వంటి రాజ్యాంగ పదవులు చేపట్టడంపై తనకు ఆసక్తి లేదని, కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినట్లయితే కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి వెనుకాడబోనని శ్రీధరన్ స్పష్టం చేశారు. ఇంతవరకు అంతా బాగుంది. ఎందుకంటే తన ఆకాంక్షను నెరవేర్చుకునే మార్గంలో ఆయనకు వయస్సు ఎందుకు అడ్డు రావాలి? కానీ ఇక్కడ ఒక అవరోధం ఉంది. నరేంద్రమోదీ ప్రధానమంత్రి కావడానికి ముందు, ఒక పుకారు వ్యాప్తిలోకి వచ్చింది. అదేమిటంటే ఎన్నికల్లో గెలుపు సాధించి కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు 75 ఏళ్లు దాటిన బీజేపీ సభ్యులకు మంత్రివర్గంలో చేరే అర్హత ఉండబోదని అప్పట్లో వార్తలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయితే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసేవారికి అప్పట్లో వయోపరిమితిని పెట్టలేదు. కాబట్టే తమకు నూతనంగా ఏర్పడే ప్రభుత్వంలో మంత్రిపదవులు లభించబోవనే స్పష్టమైన అవగాహనతోటే లాల్‌కృష్ణ అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీలను నాటి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించారు. ఆ తర్వాత అడ్వాణీ, జోషీలు తమ నియోజకవర్గాలలో గెలిచి అయిదేళ్లపాటు పార్లమెంటులో నిస్సారమైన జీవితం గడిపారు. తర్వాత 2019లో రిటైర్ అయ్యారు. వారిని తర్వాక బీజేపీ మార్గదర్శక్ మండల్ సభ్యులను చేసిపడేశారు. అయితే ఈ మండల్ ఇంతవరకు ఒక్కసారికూడా భేటీకాలేదనుకోండి. రాజకీయాల్లో వీరి అద్భుతమైన ప్రయాణం చివరకు వారి సుప్రసిద్ధ శిష్యుడి (నరేంద్రమోదీ) చేతిలోనే ముగిసిపోయింది. అంటే అక్బర్/బైరాం ఖాన్ కథ మరోసారి ఇక్కడ పునరావృతమైంది. అయితే బైరాం ఖాన్ లాగా అడ్వాణీ, జోషీలు ఢిల్లీనుంచి బహిష్కరణకు గురి కాలేదు. పూర్తి సదుపాయాలతో, సంపూర్ణ భద్రతతో వీరు ప్రభుత్వ వసతి గృహంలో ఢిల్లీలో నివసించడానికి వీరిని అనుమతించారు. ఆ తర్వాత వారి గురించి నేను వినలేదు. ఇటీవలకాలంలో వారిని నేను కలిసిందీ లేదు. కానీ వారు ఆరోగ్యంతో పనిచేసుకుంటున్నట్లు ఆశిస్తాను. ఇప్పుడు శ్రీధరన్ వద్దకు వద్దాం. ఏదేమైనప్పటికీ ఆయన ఒక అసాధారణమైన వృత్తినిపుణులు. ఆయన రాజకీయ జీవితంలోకి చాలా ఆలస్యంగా అడుగుపెట్టారు. బీజేపీలో 75 ఏళ్ల వయోపరిమితి గురించి అయనకు తెలిసి ఉండకపోవచ్చు. బహుశా తెలిసి ఉండొచ్చు కూడా. అయితే ఈ నియమానికి కూడా ఇప్పటికే కొన్ని మినహాయిం పులు ఏర్పడ్డాయి. కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్పను ఎంపిక చేసినప్పుడు ఆ నిబంధనను బీజేపీ పాటించలేదు. ఆయన 75 ఏళ్లకు మించిన వయస్సులో కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ ఆయన నియామకం మాత్రం తప్పనిసరైంది. ఎందుకంటే కర్ణాటకలో ఆయన స్థానాన్ని భర్తీ చేసేవారు బేజీపీలో ఎవరూ లేరు. కొంతమంది అయితే ఈ నియమం కేంద్ర స్థాయిలోనే కానీ రాష్ట్రాల్లో వర్తించదని బలహీనమైన వాదనను తీసుకొస్తున్నారు. కొన్నేళ్ల క్రితం అంటే నరేంద్రమోదీ ఇంకా బీజేపీకి యజమాని కాకముందు, వామపక్షాలకు మల్లే రాజ్యసభకు ఎంపికయ్యే బీజేపీ సభ్యులను రెండుసార్లకు మాత్రమే పరిమితం చేయాలని భారతీయ జనతాపార్టీ నిర్ణయించింది. అరుణ్ షౌరీ, శత్రుఘ్న సిన్హా వంటి బీజేపీ ప్రముఖులను మూడోసారి చట్టసభలోకి అడుగు పెట్టకుండా చేయడానికి ఉపయోగపడింది. కానీ పరిస్థితులు మారిపోయాక, పాలకుల వంతు వచ్చినప్పుడు, ఈ నియమం మళ్లీ మారింది. అప్పటికే చట్టసభల్లో ఉన్నవారికి మూడోసారి, నాలుగోసారి కూడా అవకాశం కల్పిం చారు. దివంగత సీనియర్ నేత అరుణ్ జైట్లీ కూడా లేటు వయసులో ఈ జాబితాలో భాగమయ్యారన్నది వాస్తవం. కాబట్టి నియమాలు, వాటి పాటింపు గురించి చాలానే మాట్లాడుకున్నాం. కాబట్టి శ్రీధరన్‌కి ఇప్పటికీ అవకాశం ఉంది. వయోపరిమితి ఆయనకు అడ్డు రాదు. దీంతో పోలిస్తే వామపక్షాలు ఇప్పటికీ ఈ నియమాన్ని కఠినంగా అమలు చేస్తున్నాయి. రాజ్యసభలో అసాధారణమైన పనితీరు ప్రదర్శించిన ప్రముఖ వామపక్ష నేతలు కూడా రెండు సార్లు చట్టసభకు ఎన్నికయ్యాక పల్లెత్తు మాటనకుండా రాజ్యసభ నుంచి తప్పుకుని తమతమ పార్టీల నిర్ణయాన్ని గౌరవించారు. సీతారాం ఏచూరి కూడా ఇప్పుడు అదే వరసలో ఉంటున్నారు. వామపక్షాలు ఈ నియమాన్ని తమకు తాముగా రూపొందించుకోవడమే కాకుండా దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నందుకు వారంటే నాకు ఎంతో గౌరవం ఉండేది. అంతేకానీ మీ ముఖం నాకు చూపించండి, మీకు వయోపరిమితి నిబంధనను చూపిస్తాను అనే రకంగా ఉండే బీజేపీ నినాదాన్ని వామపక్షాల ఆచరణతో పోల్చి చూద్దాం మరి. అయితే బీజేపీ ఏదైనా సంస్థాగత ప్రక్రియలో భాగంగా ఈ 75 సంవత్సరాల వయోపరిమితిని తీసుకురాలేదు. ఒకే ఒక వ్యక్తి ఆదేశంలో ఇది ఇలా ముందుకొచ్చింది. ఆ సమయంలో నూతన పాలకుల అధికార బలాన్ని అడ్డుకోలేని పలువురు సీనియర్ నేతలకు రంగంనుంచి తప్పించుకోవడానికి ఈ వయోపరిమితి చాలా సులభమైన మార్గంగా ఉపయోగపడేది. ఈ నియమంతో వ్యవహరించడం చాలా సులభం. ఇప్పుడు ఈ నియమం లక్ష్యం నెరవేరిది. ఎందుకంటే మనుషుల కోసమే నియమాలు తయారవుతాయి కానీ నియమాల కోసం మనుషులు తయారు కారు కదా.. అమెరికాలో దేశాధ్యక్షుడు మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి అర్హుడు కాదు. అందుచేతనే చాలామంది అమెరికా అధ్యక్షులు చాలా తక్కువ వయస్సులోనే అధ్యక్ష పదవిని చేపట్టేవారు. వారితో పోలిస్తే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ 78 సంవత్సరాల వయస్సులో గద్దెనెక్కడం ప్రత్యేక విషయమే అనుకోండి. భారత్‌లో, అలాంటి పదవీ కాల పరిమితులు లేదు. పదవి, ఆఫీసులో పనిచేసే కాలం విషయంలో మనకు ఎలాంటి అడ్డంకులూ ఉండవు. కానీ మనకు కూడా అలాంటి పరిమితులు విధిస్తేనే బావుం టుందా? నేనయితే కచ్చితంగా చెప్పలేను. ప్రజాస్వామ్యంలో మనం ఇలాంటి విషయాలను ప్రజలకు వదిలేయకూడదా? అయితే ఇంత ముఖ్యమైన నిర్ణయాన్ని పార్టీలకు మనం వదిలేసినంత కాలం ఆ పార్టీలు ఇలాంటి నియమాలను రూపొందిస్తూనే ఉంటాయి. మళ్లీ వాటిని ఉల్లంఘిస్తుంటాయి. ఇకపోతే శ్రీధరన్ విషయానికి వస్తే, వయసుతో సహా ఆయన్ని వెనక్కు లాగే అవకాశాలు లేవు. కాబట్టి కేరళ ప్రజలు కోరుకుంటే ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు. ఇది జరగాలంటే వారు రాబోయే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తేవాల్సి ఉంటుంది మరి. వ్యాసకర్త బీజేపీ మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా (ఎన్డీటీవీ సౌజన్యంతో...) -
లవ్ జిహాద్‌పై శ్రీధరన్ సంచలన వ్యాఖ్యలు!
తిరువనంతపురం: లవ్ జిహాద్ కారణంగా ఎంతో మంది అమాయక యువతులు బలైపోతున్నారని ‘మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా’ శ్రీధరన్ అన్నారు. కేరళలో ఇలాంటి అఘాయిత్యాలు ఎక్కువైపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోందని, ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. కాగా మెట్రో మ్యాన్‌గా ప్రసిద్ధి పొందిన శ్రీధరన్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ‘‘విజయ యాత్ర’’ కార్యక్రమంలో భాగంగా ఈనెల 21న ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఓ జాతీయ మీడియాతో పలు అంశాల గురించి మాట్లాడారు. ‘‘కేరళలో లవ్ జిహాద్ పరిణామాలు చూస్తూనే ఉన్నాను. హిందువులను ఎలా బలవంతపు పెళ్లిళ్లతో బంధిస్తున్నారు? ఆ తర్వాత వాళ్లు ఎలాంటి బాధలు పడుతున్నారు? అన్న అంశాలు గమనిస్తున్నా. కేవలం హిందువులు మాత్రమే కాదు.. ముస్లింలు, క్రిస్టియన్లు కూడా ఈ ఊబిలో చిక్కుకుంటున్నారు. ఇలాంటి వాటికి నేను పూర్తి వ్యతిరేకం’’ అని శ్రీధరన్ పేర్కొన్నారు. అదే విధంగా రాష్ట్రంలో పాలన గురించి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పినరయి విజయన్ను నియంతగా అభివర్ణించారు. ‘‘ఈ సీఎం పాలనకు 10కి మూడు మార్కులు కూడా రావు. ఆయన అసలు ప్రజలతో మమేకం కారు. సీపీఎం పట్ల ప్రజల్లో సదభిప్రాయం లేదు. మంత్రులకు కూడా ధైర్యంగా మాట్లాడే స్వేచ్చ లేదు. అభిప్రాయాలు పంచుకునే స్వాతంత్ర్యం లేదు. నియంత పాలనకు ఇదే నిదర్శనం’’ అని విమర్శించారు. కాగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తానని, పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానంటూ శ్రీధరన్ తన మనుసులోని మాట బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజకీయ రంగప్రవేశానికి ముందే ప్రభుత్వంపై విమర్శల దాడి మొదలుపెట్టారు. చదవండి: సీఎం పదవి చేపట్టడానికి నేను రెడీ: శ్రీధరన్ చదవండి: బీజేపీకి షాక్: హస్తం గూటికి ఎంపీ తనయుడు -
సీఎం పదవి చేపట్టడానికి నేను రెడీ: శ్రీధరన్
న్యూఢిల్లీ: ‘మెట్రో మ్యాన్’ శ్రీధరన్ రాజకీయాల్లో ప్రవేశిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చేవారం ఆయన బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో శ్రీధరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తే.. తనను రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించమని కోరితే.. అందుకు తాను సిద్ధం అన్నారు. రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు అప్పుల ఊబి నుంచి కేరళను బయటపడేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం శ్రీధరన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పార్టీ కోరుకుంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున కేరళలో బరిలో నిల్చుంటాను. పార్టీ విజయం సాధిస్తే.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి నేను సిద్ధం. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే నా ధ్యేయం. ఒకవేళ కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తే.. మూడు, నాలుగు ప్రధాన రంగాల మీద దృష్టి పెడతాం. వాటిలో ముఖ్యమైనది మౌలిక వసతుల అభివృద్ధి. మరొకటి రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొస్తాం’’ అన్నారు. ‘‘అలానే కేరళలో ఫైనాన్స్ కమిషన్ని ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. నేడు ప్రతి మళయాళీ మీద సగటున 1.2 లక్షల రూపాయల అప్పు ఉంది. ప్రభుత్వం ఇంకా అప్పులు చేస్తూనే ఉంది. దీనికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. అందుకే బీజేపీ అధికారంలోకి వస్తే.. నన్ను ముఖ్యమంత్రి పదవి చేపట్టమని ఆహ్వానిస్తే.. ఆ బాధ్యత తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను’’ అన్నారు శ్రీధరన్. ‘‘నేను బీజేపీలో చేరాలనుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది రాష్ట్రంలో గత కొన్ని ఏళ్లుగా యూడీఎఫ్, ఎల్డీఎఫ్ పార్టీలు మాత్రమే అధికారంలోకి వస్తున్నాయి. ఈ రెండు పార్టీలకు రాష్ట్ర సమస్యలపై ఏ మాత్రం అవగాహన లేదు. రాష్ట అభివృద్ధి కుంటుపడింది. 20 ఏళ్లుగా రాష్ట్రంలోకి ఒక్క పరిశ్రమ రాలేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని నేను బీజేపీలో చేరాను. వచ్చే ఎన్నికల్లో మేం గెలిస్తే.. కేంద్రం, రాష్ట్రాల మధ్య మంచి సంబంధం ఉంటుంది.. అభివృద్ధి పుంజుకుంటుంది’’ అన్నారు శ్రీధరన్. చదవండి: బీజేపీలోకి మెట్రోమ్యాన్ ఆఫ్ ఇండియా -
బీజేపీలోకి మెట్రోమ్యాన్ ఆఫ్ ఇండియా
సాక్షి, న్యూఢిల్లీ : కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో కేంద్రంలోని అధికార బీజేపీ వడివడిగా అడుగులు వేస్తోంది. కమ్యూనిస్ట్ పాలనను అంతంచేసి.. దైవభూమిలో కాషాయ జెండాపాతాలని భావిస్తోంది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములకు చెరమగీతం పాడి కేరళలో పాగావేయాలని ఊవ్విళ్లూరుతోంది. దీనికి అనుగుణంగానే ప్రణాళికలు వేస్తోంది. దీనిలో భాగంగానే ప్రముఖ వ్యక్తులను, ఆర్థికంగా బలంగా ఉన్న పారిశ్రామికవేత్తలను పార్టీలోకి అహ్వానిస్తోంది. ఈ క్రమంలో మెట్రోమ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన శ్రీధరన్‌ను బీజేపీకి చేర్చుకునేందుకు కమళనాథులు సిద్ధమయ్యారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న విజయ యాత్రలో భాగంగా శ్రీధరన్ పార్టీలో చేరతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేందరన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీలో చేరేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. ఫ్రిబవరి 21న నుంచి కేరళలో విజయ యాత్ర ప్రాంభవుతున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయాలన్న కేంద్ర పెద్దల ఆదేశాల మేరకు ఆయన్ని ఆహ్వానించామని తెలిపారు. సురేందరన్ ప్రకటనపై స్పందించిన 89 ఏళ్ల మెట్రోమ్యాన్ శ్రీధరన్.. తాను బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా పాలన చేస్తున్న యూడీఎఫ్, ఎల్డీఎఫ్ కూటమికి విధానాలకు వ్యతిరేకంగా తాను బీజేపీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. రెండు పార్టీలూ సొంత లాభాల కోసమే అధికారంలోకి వస్తున్నాయని, ప్రజలను ఉద్దరించే ఏ ఒక్క కార్యక్రమం కూడా చేపట్టడంలేదని ఆరోపించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే కేరళ అభివృద్ధిపథంలో దూసుపోతుందనే నమ్మకం తనకుందన్నారు. కాగా 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలలో మరో ఐదునెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. 2016లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒకే చోట విజయం సాధించింది. ఈ సారి జరిగే ఎన్నికల్లో పార్టీ గణనీయమైన స్థానాల్లో విజయం సాధించి తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉంది. ఇక 2011 డిసెంబర్ 21న ఢిల్లీ మెట్రో చీఫ్‌గా శ్రీధరన్ పదవీ విరమణ చేశారు. కొంకణ్ రైల్వే, ఢిల్లీ మెట్రోల నిర్మాణంలో ఆయన పాత్ర కీలకమైంది. భారతదేశంలో ప్రజా రవాణా ముఖాన్ని మార్చిన ఘనత శ్రీధరన్‌కే దక్కుతుంది. దేశంలో తొలి మెట్రో ప్రాజెక్ట్ అయిన కోల్‌కతా మెట్రో రైల్ రూపశిల్పి ఆయనే కావడంతో మెట్రోమ్యాన్‌గా గుర్తింపబడ్డారు. అంతేకాకుండా భారీప్రాజెక్టులు నత్తనడక నడిచే ఈ రోజుల్లో ఆయన తన క్రమశిక్షణతో మెట్రో ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసి ఢిల్లీ నుంచి హర్యానా, యూపీ వరకూ దాదాపు అన్ని మార్గాల్లో మెట్రోను విస్తరించారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో మెట్రో ప్రాజెక్టులకు ఆయన సలహాదారుడిగా వ్యవహరిస్తున్నారు. కీలక సర్వే: దీదీ హ్యాట్రికా.. కమల వికాసమా? -
‘అది అవమానం కాదు.. ప్రధాని ముఖ్యం కదా..’
కొచ్చి: ప్రధాని నరేంద్రమోదీతో వేదికను పంచుకోనివ్వనందుకు తానేం బాధపడలేదని, పైగా అది అవమానంగా భావించడం లేదని ఇండియన్ మెట్రో మ్యాన్‌గా పేరొందిన ప్రముఖ రిటైర్డ్ ఇంజినీర్ కేరళకు చెందిన ఈ శ్రీధరన్ అన్నారు. శనివారం కేరళలో కొచ్చి మెట్రోను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రధాని వేదికపైకి శ్రీధరన్‌ను ఆహ్వానించలేదు. దీంతో ఆయనకు అవమానం జరిగిందని మీడియాలో విస్తృత చర్చ జరుగుతుండటంతో కొంతమంది మీడియా ప్రతినిధులు ఆయనను ఈ విషయంపై గురువారం ప్రశ్నించారు. ‘ఆ విషయాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో వివాదం చేయొద్దు. ప్రధాని భద్రతకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి.. అది తప్పనిసరి కూడా. భద్రతా సంస్థలు ప్రధాని రక్షణకోసం ఏ నిర్ణయం తీసుకున్నా వాటిని తప్పనిసరిగా అనుసరించాలి. ఈ విషయంపై నాకు ఎలాంటి ఫిర్యాదులు లేవు’ అని ఆయన వివాదానికి తెరదింపారు. ఢిల్లీ మెట్రోకు కూడా శ్రీధరన్ కీలక సలహాదారుగా వ్యవహరించడంతోపాటు కొచ్చి మెట్రో విషయంలో కూడా తన జోక్యం ఉంది. ఇదిలా ఉండగా కొచ్చి మెట్రో అధికారులు కూడా దీనిపై వివరణ ఇస్తూ శ్రీధరన్ కూడా ప్రధాని వేదికపై ఉండేలా తాము జాబితా పంపించామని, కానీ, తుది జాబితా మాత్రం ప్రధాని మంత్రి కార్యాలయం సిద్ధం చేసి పంపించినందున తాము ఏం చేయలేపోయామని అన్నారు. -
మెట్రోకు పచ్చజెండా!
డీపీఆర్‌కు ప్రభుత్వ ఆమోదం గాజువాకను కలుపుతూ నిర్మాణం 2018నాటికి పూర్తిచేస్తామని ప్రకటన విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టు దిశగా ముందడుగు పడింది. డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును ప్రభుత్వం శనివారం ఆమోదించింది. శ్రీధరన్ డీపీఆర్‌ను సీఎం చంద్రబాబుకు శనివారం విజయవాడలో సమర్పించారు. దాన్ని యధాతథంగా ఆమోదిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ముందుగా అనుకున్న విధంగానే గాజువాకను కలుపుతూ మెట్రోరైలు నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదించింది. రూ.12,727కోట్ల బడ్జెట్లో 49శాతం నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తాయని సీఎం చెబున్నారు. విశాఖపట్నం : మూడు కారిడార్లుగా మెట్రోరైలు ప్రాజెక్టును ప్రభుత్వం చేపడుతుంది. మొదటి కారిడార్ గాజు వాక నుంచి కొమ్మాది వరకు నిర్మిస్తారు. 30.39కి.మీ.పొడవుం డే ఈ కారిడార్‌లో మొత్తం 22 స్టేషన్లు ఉంటాయి. రెం డో కారిడార్ గురుద్వారా జంక్షన్ నుంచి పాతపోస్టాఫీసు వరకు నిర్మిస్తారు. 5.25కి.మీ. పొడవుండే ఈ కారిడార్‌లో 7 స్టేషన్లు ఉంటాయి. మూడో కారిడార్‌ను తాటిచెట్లపాలెం నుం చి చినవాల్తేర్ ఈస్టుపాయింట్కాలనీ వరకు నిర్మిస్తారు. 6.91కి.మీ. పొడవుండే ఈ కారిడార్‌లో 9 స్టేషన్లు ఉంటాయి. రూ.12,727కోట్లు బడ్జెట్ మొత్తం మెట్రోరైలు ప్రాజెక్టును రూ.12,727కోట్లు బడ్జెట్‌తో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థికంగా భారంకావడంతోపాటు ఫీజబులిటీ తక్కువుగా ఉన్నందున ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రైవేటు సంస్థలు ఆసక్తిచూపించవు. అందుకే దీన్ని ‘స్పెషల్ పర్పస్ వెహికిల్’ ప్రాజెక్టుగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కన్సల్టెన్సీగా వ్యవహరిస్తున్న ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్‌కే ఈ ప్రాజెక్టును అప్పగించారు. మొత్తం నిధుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 49శాతం నిధులు సమకూరుస్తాయి. మిగిలిన 51 శాతం నిధులను రుణరూపంలో సేకరిస్తారు. కేంద్ర ప్రభుత్వం రూ.2,163కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.4,231కోట్లు కేటాయిస్తాయి. మిగిలిన 6,371కోట్లను అంతర్జాతీయ సంస్థల నుంచి రుణంగా సేకరిస్తారు. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టి 2018, డిసెంబర్‌నాటికి పనులు పూర్తిచేయాలని నిర్ణయించారు. 2018, డిసెంబర్‌నాటికి మెట్రోరైలును పట్టాలు ఎక్కిస్తామని సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు శనివారం విజయవాడలో ప్రకటించారు. అందుకు అవసరమైన భూసేకరణ, ఇతర ప్రక్రియలపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామన్నారు. -
మెట్రో రైలు లేనట్టే!
ఫీజబిలిటీ ఇచ్చేందుకు కేంద్రం నిరాకరణ లాభసాటిగా ఉండదనే అనుమానం గుంటూరు, విజయవాడ నగరాలను కలిపితేనే లాభం విజయవాడ : విజయవాడ నగరానికి మెట్రో రైలు ప్రాజెక్టు ఇప్పట్లో లేనట్టే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఈ విషయం స్పష్టమవుతోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన నివేదికలను పరిశీలించిన తరువాత మెట్రో రైలు ప్రాజెక్టుకు ఫీజబిలిటీ ఇచ్చేందుకు కేంద్రం అనుమానాలు వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేసింది. విజయవాడ నగరంలో ప్రస్తుతం 13 లక్షల వరకు జనాభా ఉంది. నిత్యం వచ్చిపోయే వారి సంఖ్య 50 వేల వరకు ఉంటుందని వ్యాపార వర్గాల అంచనా. మొత్తం మీద మెట్రో రైలు ప్రాజెక్టు వల్ల నష్టాలు తప్ప లాభాలు ఉండే అవకాశం లేదని కేంద్రం తేల్చింది. గుంటూరు-విజయవాడ కలిపితేనే... విజయవాడ, గుంటూరు నగరాలను కలిపితేనే జనాభా పరంగా చూసినా, కిలోమీటర్ల పరంగా చూసినా లాభసాటిగా ఉండే అవకాశం ఉంది. మెట్రో రైలు ప్రాజెక్టు ఫీజబిలిటీని పరిశీలించేందుకు వచ్చిన శ్రీధరన్ గుంటూరు నగరాన్ని మినహాయించి విజయవాడ నగరంలోనే 30 కిలోమీటర్ల వరకు రైలు నడిచే విధంగా ప్రతిపాదనలు తయారు చేశారు. విజయవాడకే పరిమితం చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అప్పటిలో ఆయన చెప్పారు. బందరు వైపు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ వరకు, హైదరాబాద్ వైపు ఇబ్రహీంపట్నం వరకు నగరాన్ని చుట్టే విధంగా మెట్రో రైలు నిర్మాణం చేసేందుకు నిర్ణయించారు. రాజకీయ కోణం... మెట్రో రైలు ప్రాజెక్టును కేంద్రం తిరస్కరించడానికి రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బందరు రోడ్డు మధ్యలో నుంచి మెట్రో రైలు ట్రాక్ వేయాల్సి ఉంటుంది. 13 కిలోమీటర్ల పొడవున బందరు రోడ్డులో మెట్రో నిర్మాణం జరుగుతుంది. దీనివల్ల రోడ్డును మరికొంత వెడల్పు చేయాల్సి ఉంది. అలా చేస్తే పలు దుకాణాలు తొలగించాల్సి ఉంటుంది. దీంతో కొందరు బడా వ్యాపారులు కేంద్ర మంత్రి సుజనా చౌదరి వద్దకు వెళ్లి పరిస్థితి వివరించారు. దీంతో ఆయన మోకాలడ్డటం వల్లే కేంద్రం ఈ రకమైన అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. డీపీఆర్ సిద్ధం చేసి ఢిల్లీకి పంపినందున తాను ఇక్కడ ఏమీ చెప్పలేనని, ఢిల్లీ వారి ద్వారానే ఆ మాట చెప్పిస్తే సరిపోతుందని చంద్రబాబునాయుడు సుజనా చౌదరికి సలహా ఇవ్వడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పూర్తిస్థాయిలో అయిపోయిందని, త్వరలోనే పనులు చేపడతారని భావిస్తున్న తరుణంలో ప్రాజెక్టు తిరస్కరణకు గురికావడం స్థానికులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే తప్పకుండా మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణం జరగాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. -
శరవేగంగా మెట్రో సర్వే
90 శాతం పూర్తయిన హౌస్‌హోల్డ్ సర్వే టోపోగ్రఫీ సర్వే కూడా దాదాపు పూర్తి 16 నుంచి ట్రాఫిక్ సర్వే ప్రారంభం విశాఖపట్నం సిటీ : విశాఖ మహా నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు సర్వే శరవేగంగా జరుగుతోంది. దాదాపు గత నెల రోజులుగా వివిధ సాంకేతిక బృందాలు నగరంలో విస్తృతంగా పర్యటించి సర్వే చేపడుతున్నాయి. ఫిబ్రవరి ఆఖరి నాటికి సర్వేలు పూర్తి చేస్తామని ఏపీ ప్రభుత్వ మెట్రో రైలు ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్ చెప్పినట్టుగానే విశాఖలో వేగంగా సర్వే జరుగుతుంది. తొమ్మిది వేలకుగాను బుధవారం నాటికి 8400 ఇళ్లల్లో ఇంటింటి సర్వే పూర్తయింది. 39 కిలోమీటర్ల టోపోగ్రఫీ సర్వేకి దాదాపు 30 కిలోమీటర్ల మేర సర్వే పూర్తయినట్టు తెలిసింది. సర్వేలు త్వరితగతిన పూర్తి అయ్యేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు. -మహా విశాఖలో మూడు కారిడార్లలో మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టేందుకు సర్వే చేపడుతున్నారు. 39 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ ప్రాజెక్టు కోసం టోపోగ్రఫీ, ట్రాఫిక్, హౌస్‌హోల్డ్ సర్వేలను ముందుగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు సర్వేలను ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేసి ఆ తర్వాత డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ను రూపొందించాలన్నది శ్రీధరన్ ఉద్దేశం. డీపీఆర్ పూర్తయిన వెంటనే వివిధ సాంకేతిక, ఆర్థిక, అంశాలతో విశ్లేషించి మరో నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తారు. ప్రభుత్వంతో తదుపరి చర్చలు సమావేశాలు నిర్వహించి ప్రాజెక్టు ఆమోదం పొందిన తర్వాత కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. -39 కిలోమీటర్ల మెట్రో కారిడార్ ఏర్పాటుకు అవసరమైన ట్రాఫిక్ సర్వేను ఈనెల 16 నుంచి ప్రారంభిస్తారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను విశాఖ కేంద్రంగా పని చేస్తున్న ఢిల్లీ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతినిధి రవి పర్యవేక్షిస్తున్నారు. నగరంలోని ముఖ్య కూడళ్లలో నిర్వహించే ఈ సర్వే ఆధారంగానే మెట్రో రైలు ఆగే స్టేజీల ఏర్పాటు జరుగుతుంది. ఎన్ఏడీ జంక్షన్ నుంచి మధురవాడ వరకూ 24 కిలోమీటర్లలో మెట్రో రైలు హాల్టులను గుర్తిస్తారు. ప్రయాణికుల రాకపోకలు, ఏయే వర్గాలు ఎంతెంత మొత్తం ప్రయాణాల కోసం వెచ్చిస్తున్నారో, ఏయే వేళల్లో ఎన్ని వాహనాలు నడుస్తున్నాయో, బస్సులు ఖాళీగా తిరిగే వేళలు, ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉన్న వేళలను ఈ సర్వేలో లెక్క తేల్చనున్నారు. ట్రాఫిక్ సర్వేను వేగవంతంగా చేసేందుకు అవసరమైన బృందాలను సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ట్రాఫిక్ సర్వేని ప్రారంభించి వచ్చే వారం నుంచి 10 రోజుల్లో మొత్తం సర్వేని పూర్తి చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ ప్రజలు రవాణా అవసరాలు ఎలా తీర్చుకుంటున్నారో తెలుసుకునే హౌస్ హోల్డ్ సర్వే నగరంలోని అన్ని వార్డుల నుంచి సేకరించారు. ఇంకా 300 నుంచి 400 మంది ఇంటి యజమానుల నుంచి మాత్రమే తీసుకోవాల్సి ఉంది. ఆ సర్వే పూర్తయిన వెంటనే డేటాను కంప్యూటరీకరిస్తారు. -
సూపర్ ఫాస్ట్
మెట్రోరైలు వేగంగా కదులుతున్న ఫైలు డీపీఆర్ రూపకల్పనలో అవాంతరాలపై శ్రీధరన్ అధ్యయనం నగరంలో విస్తృత పర్యటన రైల్వేస్టేషన్ నుంచి అలంకార్ వరకు సింగిల్ ట్రాక్ స్వల్ప మార్పులతో మార్చి నాటికి డిజైన్ మెట్రోరైలు ప్రతిపాదన పరుగులు పెడుతోంది. నగరంలో మెట్రో కారిడార్ నిర్మాణానికి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా డిజైన్ రూపొందించడంలో ఏపీ మెట్రో ప్రాజెక్టుల సలహాదారు శ్రీధరన్ కసరత్తు మొదలుపెట్టారు. గురువారం నగరంలో పర్యటించిన ఆయన మెట్రో ప్రాజెక్టు వెళ్లే ప్రాంతాలను నిశితంగా గమనించారు. ఏలూరురోడ్డు, బందరు రోడ్డుపై ప్రతిపాదించిన మెట్రో రైల్వే కారిడార్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ బ్యూరో : నగరంలో మెట్రో కారిడార్ పనులు వేగవంతమయ్యూరుు. పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్లను కేంద్రాలుగా చేసుకుని మెట్రో సర్వీస్ తుళ్లూరుకు విస్తరించేలా ముందస్తు ప్రణాళికతో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట (డీపీఆర్) తయూరీకి ఏపీ మెట్రో ప్రాజెక్టుల సలహాదారు శ్రీధరన్ కీలక సూచనలు చేశారు. గురువారం ఉదయం ఆయన నగరంలో పర్యటించారు. బస్టాండ్, రైల్వేస్టేషన్ల నుంచి రోజూ నగరానికి వచ్చి వెళ్లేవారు 2.50 లక్షల మంది ఉంటారని, వారిలో కనీసం 20శాతం మంది మెట్రో సర్వీసును ఉపయోగించుకున్నా దాని లక్ష్యం నెరవేరుతుందని అభిప్రాయపడ్డారు. మెట్రోరైలు ప్రధాన స్టేషన్ నిర్మించే పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌ను పరిశీలించారు. బస్టాండ్ ప్రాంతం నుంచి గుంటూరు జిల్లాలోని తాడేపల్లికి, కృష్ణానదికి మెట్రో రైల్వేలైను వేసేలా వారధి నిర్మాణానికి తొలిదశలోనే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. వంతెన నిర్మాణం పూర్తరుుతే భవిష్యత్‌లో రాజధాని తుళ్లూరుకు మెట్రో ప్రాజెక్టును విస్తరించే వీలుంటుందని చెప్పారు. బస్టాండ్ సమీపంలో ఉన్న త్రిశక్తి పీఠం వద్ద మెట్రో రైల్వేలైన్ ఎలైన్మెంట్ కొద్దిపాటి మార్పు చేయాలని సూచించారు. అక్కడి నుంచి కనకదుర్గమ్మ వారధికి మెట్రోరైల్‌ను అనుసంధానం చేసేలా డిజైన్ తయారు చేయాలని ఆదేశించారు. బస్టాండ్ ప్రాంతం నుంచి ఏపీ స్టేట్ ఫైర్ సర్వీసెస్ స్టేషన్‌ను, పోలీస్ కంట్రోల్ రూమ్‌లను పరిశీలించిన ఆయన మెట్రో రైల్వే లైన్ ఎలైన్‌మెంట్‌లో మార్పు చేయాలని నిర్ణయించారు. పోలీస్ కంట్రోల్ రూమ్ ప్రాంతంలో ఏలూరు, బందరు రోడ్లు ఒకేచోట కలుస్తున్నందున ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. అక్కడి వరకు ఒకే లైనుగా వచ్చే మెట్రో సర్వీసును కొద్ది దూరం పొడిగించి బందరు, ఏలూరు రోడ్లకు వేరుపడేలా మార్పు చేశారు. కీలక మార్పులివే.. ఏలూరు రోడ్డుకు వెళ్లే మెట్రోరైలు మార్గాన్ని తుమ్మలపల్లి కళాక్షేత్రం వైపు నుంచి రైల్వేస్టేషన్ మీదుగా మళ్లింపు, రైల్వే పార్శిల్ కౌంటర్ వద్ద ఒకటి, రైల్వే స్టేషన్ వద్ద మరోటి మెట్రో స్టేషన్లను నిర్మించాలని తొలుత భావించారు. వీటి మధ్య కేవలం 400 మీటర్ల దూరం మాత్రమే ఉండటంతో ఒకచోట స్టేషన్ నిర్మిస్తే చాలని నిర్ణయించారు. రైల్వేస్టేషన్ నుంచి గాంధీనగర్ అలంకార్ హోటల్ వరకు రోడ్డు ఇరుకుగా, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నందున ఆ ప్రాంతంలో మెట్రో రైల్వే లైను రెండు ట్రాక్‌లు కాకుండా ఒకటి నిర్మించేలా డిజైన్ రూపొందించాలని నిశ్చయించారు. లెనిన్ సెంటర్ మీదుగా ఏలూరు రోడ్డుకు వెళ్లే ప్రాంతంలో సౌత్ ఇండియన్ షాపింగ్‌మాల్ వద్ద ప్రైవేటు భవనం రెండు మీటర్ల మేర అడ్డు వస్తోందని, దాన్ని తప్పించి మెట్రో లైన్ ఎలైన్మెంట్ రూపొందించాలని శ్రీధరన్ భావించారు. మాచవరం సెంటర్లో మెట్రో స్టేషన్‌కు సమీపంలోని భవనం అడ్డు వచ్చే అవకాశం ఉన్నందున దానికి ఇబ్బంది లేకుండా డిజైన్ రూపొందించాలని ఆదేశించారు. గుణదల రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ), రామవరప్పాడు వద్ద ఇన్నర్ రింగ్‌రోడ్డు ఆర్వోబీ మెట్రో లైను తగిలే అవకాశం ఉన్నందున రైల్వే, ఆర్అండ్బీ అధికారులతో కలిసి డిజైన్‌లో మార్పులు చేసుకోవాలని నిర్ణయించారు. పలు అంశాలపై సంతృప్తి రామవరప్పాడు రింగురోడ్డు వద్ద మెట్రో స్టేషన్ నిర్మించేందుకు అవసరమైన స్థలం ఉందని శ్రీధరన్ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం బెంజిసర్కిల్ నుంచి కానూరు వరకు ప్రయాణించిన శ్రీధరన్ బృందం అటువైపు మెట్రోలైను నిర్మాణానికి అవసరమైన జాగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. బెంజిసర్కిల్‌లో ప్రతిపాదించిన ప్లైఓవర్ నిర్మాణం పూర్తయినా.. దాని పైనుంచి మెట్రోరైలు వెళ్లేలా డిజైన్ రూపొందిస్తున్నందున ఎటువంటి ఇబ్బంది ఉండదని శ్రీధరన్ తన వెంట ఉన్న బృందానికి చెప్పారు. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 11.50 గంటల వరకు శ్రీధరన్ బృందం నగరంలో మెట్రో కారిడార్ నిర్మించే ప్రాంతంలో పర్యటించింది. ఢిల్లీ మెట్రోరైలు ప్రాజెక్టు ఎండీ ఎస్డీ శర్మ, విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టు డీపీఆర్ బాధ్యతలు చూస్తున్న అధికారి పాండురంగారావు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. -
మెట్రో శ్రీధరన్ వెయిటింగ్
సాదాసీదాగా చిన్నకారులో వచ్చిన వైనం గెస్ట్‌హౌస్‌లో గది కోసం నిరీక్షణ విజయవాడ బ్యూరో : రాష్ట్రంలోని మెట్రో రైలు ప్రాజెక్టుల సలహాదారు, డీఎంఆర్సీ మాజీ ఎండీ శ్రీధరన్ బుధవారం సాయంత్రం స్టేట్ గెస్ట్ హౌస్‌లో గది కోసం నిరీక్షించాల్సివచ్చింది. బుధవారం రాత్రి 7.30 గంటలకు శ్రీధరన్, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ ఎస్.డి.శర్మ స్టేట్ గెస్ట్ హౌస్‌కు వచ్చారు. వారి కోసం ముందే రెండు వీఐపీ గదులు బుక్ చేశారు. అయితే వారు వచ్చే సమయానికి ఆ గదులకు తాళం వేసి ఉంది. గెస్ట్‌హౌస్ ఉద్యోగి ఒకరు తాళం వేసుకుని బయటకు వెళ్లినట్లు సమాధానం రావడంతో కొద్దిసేపు వారిద్దరూ ఆ గది బయటే నుంచున్నారు. ఈలోపు మరో ఉద్యోగి వచ్చి వేరే గదిలో కొంతసేపు వేచి ఉంటే బుక్ చేసిన వీఐపీ గదుల తాళాలు తెప్పిస్తానని చెప్పడంతో శ్రీధరన్ అందులో కొద్దిసేపు కూర్చున్నారు. ఈలోపు బుక్ చేసిన గదుల తాళాలు రావడంతో అందులోకి వెళ్లారు. రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. సీఆర్డీఏ ఉన్నతాధికారులంతా సింగపూర్ పర్యటనలో ఉండడంతో మిగిలిన అధికారులు ఆయన పర్యటనకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రొటోకాల్ బాధ్యతలు చూసే రెవెన్యూ అధికారులు కూడా ఆయన్ను పట్టించుకోలేదు. దీంతో ఇక్కడ డెప్యుటేషన్‌పై పనిచేస్తున్న డీఎంఆర్సీ అధికారే హడావుడి పడాల్సివచ్చింది. మరోవైపు గెస్ట్హౌస్ట్కు కిందిస్థాయి అధికారులు ఇన్నోవా, ఇతర మోడల్ కార్లలో వస్తుంటే శ్రీధరన్, ఎస్.డి.శర్మ అద్దెకు తీసుకున్న ఇండికా విస్టా కారులో చాలా సాదాసీదాగా రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నేడు కారిడార్ల పరిశీలన బుధవారం రాత్రి డీపీఆర్ రూపకల్పన తీరును మ్యాప్‌ల ద్వారా సమీక్షించిన శ్రీధరన్ గురువారం ఉదయం ప్రతిపాదిత రెండు కారిడార్లను పరిశీలించనున్నారు. ఏలూరు, బందరు రోడ్డుల్లో మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేసే ప్రదేశాలను చూడనున్నారు. మధ్యాహ్నం తిరిగి ఢిల్లీ వెళతారు. -
ఏకకాలంలో విశాఖ, విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టులు
మెట్రో రైలు ప్రాజెక్టు ప్రభుత్వ సలహాదారు శ్రీధరన్ విశాఖపట్నం: విశాఖపట్నం, విజయవాడలలో మెట్రోరైలు ప్రాజెక్టులను ఏకకాలంలోనే చేపడతామని రాష్ట్ర ప్రభుత్వ మెట్రోరైలు ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్ తెలిపారు. ఈ రెండు నగరాల్లో మెట్రోరైలు నిర్వహణ ప్రభుత్వానికి భా రం కాకుండా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఇందుకోసం విశాఖపట్నం, విజయవాడలలో సర్వే చేసి డీటైల్డ్ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ను ఆరునెలల్లో ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. ప్రభుత్వ అనుమతి లభించిన తరువాత పనులు చేపట్టి మూడేళ్లలో పూర్తిచేయాలన్నది తమ ఉద్దేశమని ఆయన చెప్పారు. మెట్రోరైలు ప్రాజెక్టు అంశాన్ని పరిశీలించేందుకు శ్రీధరన్ బృందం మంగళవారం విశాఖపట్నంలో పర్యటించింది. వుడా కార్యాలయంలో జీవీఎంసీ, వుడా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించింది. అన ంతరం శ్రీధరన్ విలేకరులతో మాట్లాడుతూ విశాఖ, విజయవాడలలో ఒకేసారి ప్రాజెక్టు చేపడితే పెట్టుబడి వ్యయం కొంతవరకు తగ్గుతుందన్నారు. తిరుపతి కోసం ప్రత్యేక ప్రణాళిక ఉందన్నారు. అందుకే విశాఖ, విజయవాడ ప్రాజెక్టుల తరువాత తిరుపతి ప్రతిపాదనలు రూపొంది స్తామన్నారు. విశాఖలో నాలుగు కారిడార్లతో, విజయవాడలో రెండు కారిడార్లతో మెట్రోప్రాజెక్టును చేపట్టాలని యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. విశాఖ ప్రాజెక్టును 30కి.మీ.మేర నిర్మించాలన్నది ప్రాథమిక అంచనా అని శ్రీధరన్ తెలి పారు. త్వరలోనే డీఎంఆర్సి నిపుణులు విశాఖలో పర్యటించి నివేదిక ఇస్తారని వివరించారు. ప్రాజెక్టుకు అవసరమైన పెట్టుబడి, మెట్రోరైలు ఏర్పాటు, నిర్వహణ మొదలైన అన్ని అంశాలతో సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేస్తామన్నారు. విశాఖలో భూగర్భ మెట్రో నిర్మించాల్సి న అవసరం లేదన్నారు. విశాఖపట్నంలో మె ట్రో రైలు డిపో ఏర్పాటుకు 20 హెక్టార్ల స్థలం అవసరమవుతుందని శ్రీధరన్ తెలిపారు. విద్యు త్ సరఫరా కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో వుండాలన్నారు. వుడా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో డీఎంఆర్సి డెరైక్టర్ ఎస్డి శర్మ, చీఫ్ కన్సల్టెంట్ బిబి శంకర్, మేనేజర్ వి. ఆర్మ్‌స్ట్రాంగ్, విజయవాడ మెట్రో డిప్యూ టీ ప్రాజెక్టు డెరైక్టర్ పి. రంగారావు, జీవీఎంసీ కమిషనర్ ఎం. జానకి, వుడా వైస్ ైచె ర్మన్ ఎం. వి శేషగిరిబాబు, జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ బి. జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం శ్రీధరన్ బృందం విశాఖపట్నంలోని తగరపువలస, హనుమంతువాక, మద్దిలపాలెం, ఎన్ఏడీ, కూర్మనపాలెంలలో పర్యటించి మెట్రోరైలు ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను పరిశీలించింది. శ్రీధరన్ బృందం బుధవారం కూడా విశాఖపట్నంలో పర్యటించి అధికారులతో సమీక్షిస్తుంది. -
విశాఖలో 30 కిలోమీటర్ల మేర మెట్రోరైలు
-
విశాఖలో 30 కిలోమీటర్ల మేర మెట్రోరైలు
తొలిదశలో విశాఖపట్నంలో 30 కిలోమీటర్ల మేర మెట్రోరైలు ఉంటుందని, దీన్ని మూడు నాలుగేళ్లలో పూర్తి చేస్తామని మెట్రో గురు శ్రీధరన్ చెప్పారు. విశాఖలో ఆయన మంగళవారం నాడు జీవీఎంసీ, వుడా, ట్రాఫిక్ పోలీసు అధికారులతో కలిసి సమీక్షించారు. ఢిల్లీ నుంచి తమ ఇంజనీర్ల బృందం వచ్చి ఈ ప్రాంతాన్ని సమగ్రంగా పరిశీలిస్తుందని, ఆరు నెలల్లో సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన చెప్పారు. మెట్రో రైలు అనేది సాధారణంగా ఫ్లై ఓవర్ల మీదే ఉంటుందని, అది సాధ్యం కానప్పుడు మాత్రమే భూగర్భంలో వేయడానికి ప్రయత్నిస్తామని శ్రీధరన్ తెలిపారు. ఈవాళ, రేపు సాంకేతిక, ఆర్థిక అంశాలను పరిశీలిస్తామని ఆయన వివరించారు. -
గుంటూరుకు మెట్రో అక్కర్లేదా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెట్రో రైలు వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. తొలి దశలో అసలు గుంటూరు మెట్రోరైలు అవసరం లేదని, విజయవాడ నగరంలో మాత్రమే 25-26 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ఏర్పాటు చేస్తే చాలని రాష్ట్ర ప్రభుత్వ మెట్రో రైలు ప్రాజెక్టుల ముఖ్య సలహాదారు ఇ.శ్రీధరన్ పేర్కొన్నారు. విజయవాడలో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి కానూరు ఇంజనీరింగ్ కాలేజీ వరకూ 13 కిలోమీటర్ల మేర మొదటి కారిడార్, బస్టాండ్ నుంచి రైల్వేస్టేషన్ మీదుగా ఏలూరు రోడ్డు నుంచి రామవరప్పాడు, ఐదో నంబరు జాతీయ రహదారికి లింకు కలుపుతూ 12, 13 కిలోమీటర్ల మేర రెండో కారిడార్ నిర్మాణానికి అవకాశం ఉందని ఆయన తెలిపారు. మెట్రోరైలు అనేది కేవలం ఒక నగర పరిధిలోనే ఉండాలి తప్ప ఇంటర్ సిటీ కాదని శ్రీధరన్ చెప్పారు. ప్రపంచంలో ఏ మెట్రో రైలు ప్రాజెక్టు లాభదాయకం కాదని ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గుంటూరు- విజయవాడ ప్రాంతంలో రాజధాని ఏర్పాటుచేస్తామని, ఈ రెండు నగరాలను కలిపేలా మెట్రోరైలు కూడా వస్తుంది కాబట్టి రాజధానికి వచ్చిన సమస్య ఏమీ లేదని మొదట్లో చెప్పారు. కానీ ఇప్పుడు 'మెట్రో గురు' శ్రీధరన్ చెప్పిన విషయంతో సర్కారీ పెద్దలు చెప్పినదంతా ఉత్తదేనని తేలిపోయింది. మెట్రోరైలుకు కిలోమీటరకు రూ. 240 కోట్లు ఖర్చవుతుందని, విజయవాడలో మొత్తం మెట్రో నిర్మాణానికి 7,500 కోట్ల నుంచి రూ. 8,000 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని కూడా శ్రీధరన్ చెప్పారు. హైదరాబాద్‌లో చేపడుతున్నట్లుగా కాకుండా.. ఇక్కడ కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మెట్రో రైలు నిర్మాణం చేపట్టే అవకాశం కనిపిస్తోంది. -
మెట్రో రైలుమార్గంపై ప్రభుత్వానికి ప్రాథమిక
మెట్రో రైలుమార్గంపై ప్రభుత్వానికి ప్రాథమిక ప్రతిపాదనలు పంపిన తుడా అధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు అక్టోబర్‌లో తిరుపతిలో పర్యటించనున్న శ్రీధరన్! మెట్రో రైలు ప్రాజెక్టుపై తుడా(తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ) కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ మౌఖిక ఆదేశాల మేరకు రైలుమార్గంపై ప్రాథమిక నివేదికను తుడా అధికారులు సర్కారుకు పంపారు. తిరుపతిలో మెట్రో రైలు ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు అక్టోబర్ రెండో వారంలో ఆ ప్రాజెక్టు సలహాదారు, డీఎమ్మార్సీ(ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్) మాజీ మేనేజింగ్ డెరైక్టర్ శ్రీధరన్ తిరుపతిలో పర్యటించనున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాజధాని ఏర్పాటుపై ప్రజల్లో అసంతృప్తిని చల్లార్చేందుకు ఈనెల 4న అసెంబ్లీలో సీఎం చంద్రబాబు జిల్లాపై హామీల వర్షం కురిపిం చారు. అందులో తిరుపతిలో మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటు ఒకటి. విశాఖపట్నం, వీజీటీఎం(విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి)లకు మెట్రో రైలును మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆగస్టు 30న ఉత్తర్వులు జారీచేసిన విషయం విధితమే. తిరుపతికి మెట్రో రైలు ప్రాజెక్టు మంజూరుచేస్తూ ఎలాంటి ఉత్తర్వులు జారీచేయకపోవడం గమనార్హం. మెట్రో రైలు ప్రాజెక్టులకు సహకరించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు డీఎమ్మార్సీ మాజీ ఎండీ శ్రీధరన్ అంగీకరించారు. రాష్ట్రంలో మెట్రో రైలు ప్రాజెక్టు సలహాదారుగా శ్రీధరన్ బాధ్యతలు స్వీకరించారు. వీజీటీఎం పరిధిలో మెట్రో రైలు ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు శనివారం అక్కడ పర్యటించి తన నివేదికను ప్రభుత్వానికి పంపిన విష యం విధితమే. తిరుపతికి మెట్రో రైలును మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడకున్నా.. సీఎం చంద్రబాబు శాసనసభలో చేసిన ప్రకటన మేరకు తుడా అధికారులు ఆ ప్రాజెక్టుకు అవసరమైన ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. రేణిగుంట విమానాశ్రయం, తిరుచానూరు, ఆర్టీసీ బస్టాండ్, పద్మావతి మహిళా యూనివర్సిటీ, శ్రీనివాస మంగాపురం, ఎస్వీ యూనివర్సిటీ, ఎస్వీ జూ, అలిపిరి, కపిలతీర్థం, రేణిగుంట విమానాశ్రయం మధ్యన తొలుత మెట్రో రైలు మార్గాన్ని ఏర్పాటుచేయాలని తుడా అధికారులు ప్రతిపాదించారు. సుమారు 60 కిమీల మేర మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాల్సి వస్తుందని తుడా అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఈ నివేదిక అమలుకు సా ధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మెట్రో రైలు ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్ అక్టోబర్ రెండో వారంలో పర్యటించనున్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు తిరుపతిలో ఆర్థికంగా గిట్టుబాటు అవుతుందా లేదా అన్నది ప్రధానం గా పరిశీలించనున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రోజూ సగటున 65 వేల మంది భక్తులు తిరుపతికి వస్తున్నారు. ఇందులో 30 వేల మంది తిరుచానూరులోని అలివేలు మంగమ్మ అమ్మవారిని.. శ్రీని వాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. తుడా ప్రతిపాదించిన మార్గాల్లో ప్రయాణికుల రాకపోకలు కూడా అధికంగా ఉంటాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని ఆర్థికంగా గిట్టుబాటైతేనే మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టేలా శ్రీధరన్ ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఇదే అంశంపై తుడా వీసీ వెంకటేశ్వరరెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా.. మెట్రో రైలు మార్గాన్ని ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక పంపామని చెప్పారు. తిరుపతిలో మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు.. ఫీజుబులిటీ ఉందా లేదా అన్నది తేల్చేందుకు సలహాదారు శ్రీధరన్ త్వరలోనే పర్యటించనున్నారని తెలిపారు. శ్రీధరన్ ఇచ్చే నివేదికను బట్టే మెట్రో రైలు ప్రాజెక్టు భవిత ఆధారపడి ఉంటుందని స్పష్టీకరించారు. -
సిటీకే ‘మెట్రో’ పరిమితం
ఎట్టకేలకు స్పష్టత తొలి విడత 26 కిలోమీటర్లు బందరు, ఏలూరు రోడ్ల ఎంపిక విస్తృతంగా పర్యటించిన శ్రీధరన్ కమిటీ విజయవాడ సెంట్రల్ : ప్రతిష్టాత్మక మెట్రోరైల్ ప్రాజెక్టుపై స్పష్టత వచ్చింది. మెట్రో ప్రాజెక్ట్ ముఖ్య సలహాదారు శ్రీధరన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ శనివారం విజయవాడలో విస్తృతంగా పర్యటించింది. తొలి విడతగా నగరంలో 26 కిలో మీటర్ల మేర మెట్రోరైల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. బందరురోడ్డులోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్, అక్కడ నుంచి రైల్వేస్టేషన్ మీదుగా ఏలూరు రోడ్డును అనుసంధానం చేస్తూ రామవరప్పాడు రింగ్ వరకు రైల్ లైన్ ఏర్పాటుచేయాలని ప్రాథమికంగా భావిస్తున్నారు. జన సమ్మర్థం ఆధారంగా ఈ రెండు రోడ్లను శ్రీధరన్ బృందం ఎంపిక చేసింది. బెజవాడకు మీడియం రైలు చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్ నగరాల్లో ఏర్పాటు చేసిన తరహాలో మీడియం మెట్రోను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 45వేల నుంచి 50 వేల మంది ప్రయాణించేందుకు వీలుగా ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. రూ.7,500 కోట్ల నుంచి రూ.8 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్)ను ప్రభుత్వం ఆమోదించి, నిధులు విడుదల చేస్తే మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తీరనున్న ప్రయాణికుల కష్టాలు మెట్రో రైలు అందుబాటులోకి వస్తే విజయవాడలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రయాణ కష్టాలు తీరే అవకాశం ఉంది. నగర జనాభా ఇప్పటికే 12లక్షలకు చేరింది. రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే స్థాయిలో ట్రాఫిక్ సమస్య కూడా ఉత్పన్నమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో 250 సిటీ బస్సులు, 13 వేలకు పైగా ఆటోలు నడుస్తున్నాయి. అయినప్పటికీ ప్రజలకు ప్రయాణ కష్టాలు తప్పడంలేదు. మెట్రోరైలు ప్రాజెక్టు పూర్తయితే తక్కువ ఖర్చుతో సమయం వృథా కాకుండా గమ్యస్థానాన్ని చేరుకొనే అవకాశం ఉంటుంది. బస్సులో గంటసేపు వెళ్లే దూరాన్ని మెట్రో రైలులో కేవలం 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. రైలు అందుబాటులోకి వచ్చిన తర్వాత బస్సులు, ఆటోల సంఖ్య తగ్గిస్తే నగరంలో కాలుష్యాన్ని కొంత మేర అరికట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. -
సీఎస్ ఔత్సాహికులకు సరైన సమయమిదే..
గెస్ట్ కాలమ్ కంపెనీ సెక్రటరీ.. వ్యాపార, వాణిజ్య రంగాల్లో దేశం శరవేగంగా పురోగతి సాధిస్తున్న నేపథ్యంలో చక్కటి కెరీర్‌కు అవకాశం కల్పించే కోర్సు. ప్రభుత్వ తాజా నిబంధనలు కూడా కెరీర్ పరంగా కంపెనీ సెక్రటరీలకు ఎన్నో అవకాశాలు కల్పించే విధంగా ఉన్నాయి. ఔత్సాహిక విద్యార్థులు దీన్ని అందిపుచ్చుకోవాలి. కంపెనీ సెక్రటరీ కోర్సు అంటే కామర్స్, మేనేజ్మెంట్ సంబంధితమని, ఆ నేపథ్యం ఉన్న వారికే అనుకూలమనే భావన సరికాదు. నిరంతర అధ్యయన దృక్పథం, పరిశీలనాత్మక దృష్టితో వ్యవహరిస్తే.. అన్ని అకడమిక్ నేపథ్యాల విద్యార్థులు సీఎస్ కోర్సులో రాణించగలరు అంటున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) ఆల్ ఇండియా కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆర్. శ్రీధరన్‌తో ఇంటర్వ్యూ.. ప్రొఫెషనల్స్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యం ఐసీఎస్ఐ ప్రెసిడెంట్‌గా తొలి ప్రాధాన్యం ఇచ్చే అంశం.. ఉద్యోగం లేదా ప్రాక్టీస్‌లో ఉన్నవారిని మరింత నిబద్ధతగా వ్యవహరించేలా చేయడమే. ఇక సీఎస్ విద్యార్థుల విషయానికొస్తే అకడమిక్ సామర్థ్యాలను మరింత పెంచడం మా లక్ష్యం. ఈ క్రమంలో కంపెనీస్ లా- 2013లో కంపెనీ సెక్రటరీ విధుల పరంగా పేర్కొన్న అన్ని నిబంధనలను కచ్చితంగా అమలయ్యేలా చేస్తాం. కంపెనీ సెక్రటరీ.. పెరుగుతున్న ప్రాధాన్యం కంపెనీ సెక్రటరీ ప్రొఫెషన్‌కు ప్రాధాన్యం దినదిన ప్రవర్థమానం అవుతోంది. రూ. 5 కోట్ల పెయిడ్-అప్ క్యాపిటల్ ఉన్న ప్రతి సంస్థ కంపెనీ సెక్రటరీని నియమించుకోవాలనే నిబంధన కారణంగా క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీలకు డిమాండ్ పెరుగుతోంది. ఆయా సంస్థల్లో పూర్తిస్థాయిలో కంపెనీ సెక్రటరీ ఉద్యోగంతోపాటు, ప్రాక్టీసింగ్ కంపెనీ సెక్రటరీగా స్వయం ఉపాధికి కూడా ఎంతో అవకాశం ఉంది. కానీ ఏటా సర్టిఫికెట్లు అందుకుంటున్నవారి సంఖ్యతో పోల్చితే సీఎస్‌కు డిమాండ్ - సప్లయ్ మధ్య ఎంతో వ్యత్యాసం నెలకొంది. ఔత్సాహిక విద్యార్థులు ప్రొఫెషన్లో ప్రవేశించి చక్కటి కెరీర్ అందుకోవడానికి ఇదే సరైన సమయం. సంస్థల్లోనూ కీలక పాత్ర పోషించే సీఎస్‌లు మూడు దశల సీఎస్ కోర్సు పూర్తి చేసుకున్న క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీలకు ఆయా సంస్థల కార్యకలాపాల్లోనూ ముఖ్య హోదాలు లభిస్తున్నాయి. ఈ క్రమంలో ఎంతో కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. సదరు సంస్థ ప్రభుత్వ నిబంధనల ప్రకారం సెక్రటేరియల్ ప్రమాణాలు పాటించేలా చూడటం, ఆ మేరకు అవసరమైతే ఉన్నతాధికారులకు తగిన సిఫార్సులు చేయడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కంపెనీ లా - 2013 ప్రకారం మొత్తం తొమ్మిది కీలక విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత కంపెనీ సెక్రటరీలదే. ఇలా.. ఒక సంస్థలో సీఈఓ, ఎండీ తర్వాత ఆ స్థాయీ ప్రాధాన్యం సీఎస్‌లకు లభిస్తుంది. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ హోదాకు చేరుకోవచ్చు. అదేవిధంగా సెక్రటేరియల్ ఆడిట్, లేబర్ ఆడిట్, లీగల్ ఆడిట్ తదితర విభాగల్లోనూ సీఎస్‌లకు అవకాశాలు లభిస్తాయి. ఇదే సమయంలో రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఎక్కువగా ఉండే ఉద్యోగం కంపెనీ సెక్రటరీ. ఒకవైపు సంస్థలోని ఉన్నతాధికారులకు, మరోవైపు స్టేక్ హోల్టర్లు, నియంత్రణ సంస్థలకు మధ్య వారధిగా కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. సెమినార్లు, వర్క్‌షాప్‌లతో అవగాహన వృత్తి పరంగా ఎంతో కీలకమైన కంపెనీ సెక్రటరీ కోర్సుపై విద్యార్థులకు ఆశించిన రీతిలో అవగాహన లేదనే మాట వాస్తవం. కోర్సుకు నమోదు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతున్న ప్పటికీ ఆ సంఖ్య వాస్తవ అవసరాలకు సరితూగట్లేదు. ఈ క్రమంలో విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు సెమినార్లు నిర్వహించాలని నిర్ణయించాం. ఈ ఏడాది దేశవ్యాప్తంగా దాదాపు 400 సెమినార్లు నిర్వహించాలని నిర్దేశించుకున్నాం. అదేవిధంగా ఇప్పటికే కోర్సు పూర్తి చేసి అసోసియేట్, ఫెలో మెంబర్స్‌గా దాదాపు 35 వేల మందికిపైగా క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీలు ఉన్నారు. వీరికి కూడా తాజా పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్‌లు నిర్వహించ నున్నాం. సీఏ, సీఎస్, సీఎంఏ మూడు.. వేర్వేరు ప్రాధాన్యత కలిగిన కోర్సులు చాలా మంది సీఏ, సీఎస్, సీఎంఏ కోర్సుల మధ్య పోలికలు, తేడాలు బేరీజు వేయాలని చూస్తున్నారు. కానీ ఇది సరికాదు. రెండు కోర్సులు వేర్వేరు ప్రాధాన్యతలు కలిగున్నాయి. కంపెనీ సెక్రటరీ కోర్సు పూర్తిగా సెక్రటేరియల్ ప్రాక్టీసెస్, కంపెనీ లా ఆధారంగా ఉంటుంది. చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు ఆర్థికపరమైన అంశాలు (అకౌంటింగ్, ఆడిటింగ్) ఎక్కువగా ఉండే కోర్సు. ఉద్యోగ విధుల విషయంలోనూ రెండింటికీ వేర్వేరు ప్రాధాన్యాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రతి సంస్థకు కంపెనీ సెక్రటరీ, చార్టర్డ్ అకౌంటెంట్ ఇద్దరూ అవసరం. అదే విధంగా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్సుకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఉత్పత్తి రంగ సంస్థల్లో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ ఉత్తీర్ణులకు చక్కటి అవకాశాలున్నాయి. మొత్తంమీద ఒక సంస్థను సమర్థంగా, ప్రగతి పథంలో పయనించేలా చేయడంలో సీఏ, సీఎస్, సీఎంఏ ఉత్తీర్ణులు ముగ్గురూ ముఖ్యమే. ఆ అభిప్రాయం అపోహ మాత్రమే కంపెనీ సెక్రటరీ కోర్సు.. కేవలం కామర్స్, లా, మేనేజ్మెంట్ అకడమిక్ నేపథ్యాలు ఉన్న విద్యార్థులకే అనుకూలం అనే అభిప్రాయం అపోహ మాత్రమే. తులనాత్మక పరిశీలన, విశ్లేషణ నైపుణ్యం ఉంటే అకడమిక్ నేపథ్యంతో సంబంధం లేకుండా ఎలాంటి విద్యార్థులైనా సులువుగా రాణించగల కోర్సు కంపెనీ సెక్రటరీ. కోర్సులో చేరాక నిర్దేశిత సిలబస్‌ను క్షుణ్నంగా అధ్యయనం చేయడంతోపాటు దానికి సంబంధించిన తాజా మార్పులపై అవగాహన పొందుతూ ముందుకు సాగాలి. సరైన సమయం.. మూడు దశలు (ఫౌండేషన్, ఎగ్జిక్యూటివ్, ప్రొఫెషనల్)గా ఉండే కంపెనీ సెక్రటరీ కోర్సులో చేరడానికి సరైన సమయం అనేది విద్యార్థుల వ్యక్తిగత లక్ష్యాలు, అభిరుచులపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సుతో ఫౌండేషన్ కోర్సులో; బ్యాచిలర్స్ డిగ్రీ అర్హతతో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లో పేరు నమోదు చేసుకోవచ్చు. ఏ దశలో చేరినా పూర్తి స్థాయిలో సమయం కేటాయించేట్లు ప్రణాళిక రూపొందించుకోవాలి. సీఎస్ కోర్సు ఔత్సాహికులకు సలహా.. సీఎస్ కోర్సు ఔత్సాహికులు, క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ కెరీర్లో గుర్తుంచుకోవాల్సిన రెండు ప్రధాన అంశాలు కఠోర శ్రమ, ఓర్పు. ఈ రెండూ ఉంటే విజయాలు వాటంతటే వరిస్తాయి. అదే విధంగా నిత్య నూతన ఆలోచన దృక్పథం కూడా ఈ రంగంలో విజయానికి ఎంతో కీలక సాధనం. దీంతోపాటు పరిస్థితులకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకునే లక్షణాన్ని సొంతం చేసుకోవాలి.