విశాఖలో 30 కిలోమీటర్ల మేర మెట్రోరైలు | vizag to have 30 kilometers of metro rail in first phase, says sreedharan | Sakshi
Sakshi News home page

విశాఖలో 30 కిలోమీటర్ల మేర మెట్రోరైలు

Published Tue, Nov 4 2014 1:31 PM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM

విశాఖలో 30 కిలోమీటర్ల మేర మెట్రోరైలు - Sakshi

విశాఖలో 30 కిలోమీటర్ల మేర మెట్రోరైలు

తొలిదశలో విశాఖపట్నంలో 30 కిలోమీటర్ల మేర మెట్రోరైలు ఉంటుందని, దీన్ని మూడు నాలుగేళ్లలో పూర్తి చేస్తామని మెట్రో గురు శ్రీధరన్ చెప్పారు. విశాఖలో ఆయన మంగళవారం నాడు జీవీఎంసీ, వుడా, ట్రాఫిక్ పోలీసు అధికారులతో కలిసి సమీక్షించారు. ఢిల్లీ నుంచి తమ ఇంజనీర్ల బృందం వచ్చి ఈ ప్రాంతాన్ని సమగ్రంగా పరిశీలిస్తుందని, ఆరు నెలల్లో సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన చెప్పారు.

మెట్రో రైలు అనేది సాధారణంగా ఫ్లై ఓవర్ల మీదే ఉంటుందని, అది సాధ్యం కానప్పుడు మాత్రమే భూగర్భంలో వేయడానికి ప్రయత్నిస్తామని శ్రీధరన్ తెలిపారు. ఈవాళ, రేపు సాంకేతిక, ఆర్థిక అంశాలను పరిశీలిస్తామని ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement