దర్శి: ప్రకాశం జిల్లాలో చెక్డ్యాంలో పడి బాలుడు మృతిచెందాడు. దర్శి మండలం అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన చంద్రశేఖర్(10) అనే బాలుడు బహిర్భూమి నిమిత్తం గ్రామశివార్లలో ఉన్న చెక్‌డ్యాం వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు బాలుడు డ్యాంలో పడిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న గ్రామస్తులు బాలుడి మృతదేహాన్ని బయటికి తీశారు. బాలుడు మృతితో అతని కుటుంబంలో విషాదం నెలకొంది.
చెక్డ్యాంలో పడి బాలుడి మృతి
Published Sun, Dec 6 2015 5:42 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
Advertisement
Advertisement