పంటలు పుష్కలంగా పండినా బియ్యం ధరలు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి. నెల రోజుల క్రితం సాంబమసూరి (బీపీటీ) బియ్యం ధర క్వింటాకు రూ.3800 ఉండగా ప్రస్తుతం అమాంతం రూ.4200లకు పెరిగింది.
మిర్యాలగూడ, న్యూస్‌లైన్ : పంటలు పుష్కలంగా పండినా బియ్యం ధరలు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి. నెల రోజుల క్రితం సాంబమసూరి (బీపీటీ) బియ్యం ధర క్వింటాకు రూ.3800 ఉండగా ప్రస్తుతం అమాంతం రూ.4200లకు పెరిగింది. సామాన్యులు సన్నబియ్యం కొనుగోలు చేయలేని పరిస్థితులు వచ్చాయి. కృత్రిమ కొరత సృష్టించి పాత బియ్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇటీవల కురిసిన తుపాన్ వల్ల ఆంధ్రా ప్రాంతంలో పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ఈ సాకుతో బియ్యం ధరలు పెంచి మిల్లర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఖరీఫ్‌లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని స్టాక్ పెడుతున్న మిల్లర్లు పాత బియ్యాన్ని మాత్రమే విక్రయిస్తున్నారు.
భారీగా నిల్వ..
ప్రస్తుతం ఖరీఫ్‌లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు భారీగా నిల్వ చేసుకుంటున్నారు. కోత మిషన్‌తో కోస్తున్న వరి పంట కావడం వల్ల మిల్లులో స్టీమ్ చేసి ఆరబెట్టి నిల్వ చేసుకుంటున్నారు. కానీ బియ్యం పట్టడం లేదు. దాంతో కేవలం గత ఏడాది నిల్వ చేసి బీపీటీ ధాన్యాన్ని బియ్యంగా మార్చి విక్రయిస్తున్నారు. కొత్త బియ్యం మార్కెట్‌లోకి వస్తే పాత బియ్యం ధరలు పూర్తిగా తగ్గిపోతాయనే ఆలోచనలో ఉన్న మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి కొత్త ధాన్యాన్ని కేవలం స్టాక్ పెడుతున్నట్టు సమాచారం. ప్రస్తుత ఖరీఫ్‌లో జ్లిలా వ్యాప్తంగా 1.43 లక్షల హెక్టార్లలో రైతులు వరి పంటలు సాగు చేశారు. సాగులో సుమారు 90 శాతం సన్నధాన్యాన్ని (బీపీటీ) పండించారు. మిల్లర్లు ప్రస్తుతం ధాన్యాన్ని క్వింటాకు రూ.1800 చెల్లించి కొనుగోలు చేసి స్టాక్ పెడుతున్నారు.
ఫిబ్రవరిలోనే కొత్త బియ్యం..
ఖరీఫ్ సీజన్ ముగిసింది. ధాన్యం రైతుల చేతికి రావడంతోపాటు మార్కెట్‌లకు వచ్చింది. మిల్ల ర్లు ఇప్పటికే భారీగా సాంబమసూరి ధాన్యం కొనుగోలు చేశారు. ఫిబ్రవరి వరకు కొత్త బి య్యాన్ని మార్కెట్‌లోకి తీసుకురాకుండా జాగ్రత్త వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.