చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వధువు సహా మరొకరు మృతిచెందారు.
తిరుపతి: చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వధువు సహా మరొకరు మృతిచెందారు. ఈ ఘటన శనివారం ఉదయం ఐరాల మండలం బొబ్బాయివారిపల్లె వద్ద చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న లారీ ఆటోను ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందగా, మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.