సాక్షి, కర్నూలు : రాష్ట్ర ప్రభుత్వం నిద్రాహారాలు మాని కోవిడ్-19 నియంత్రణకు పనిచేస్తుందని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఇలాంటి సమయాల్లో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సలహాలు ఇవ్వకుండా ప్రభుత్వాన్ని విమర్శించడం తగదని అన్నారు. ఎంతో అనుభవమున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వేరే రాష్ట్రంలో కూర్చొని ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్-19 టెస్టింగ్ చేయడం లేదని విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు కరోనా టెస్టింగ్‌లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని తెలిపిన విషయం చంద్రబాబుకు తెలియదా అని బుగ్గన ప్రశ్నించారు. (చిలుక నిర్ణయం: యాజమాని షాక్!)
విపత్కర పరిస్థితుల్లో కూడా ఏ ఆటంకం లేకుండా ప్రభుత్వ పథకాలు కొనసాగిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, కరోనా పరీక్షల్లో ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. కరోనా పేషెంట్లకు అన్ని రకాల చికిత్సలు జరుగుతున్నాయని, ప్రజా సంక్షేమానికి ప్రతి నెలకు రూ.300 కోట్లు అదనపు ఖర్చులు అవుతున్నాయని తెలిపారు. ప్రజలు కూడా నిబంధనలు పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని, ప్లాస్టిక్ కవర్లు నిషేధించి, పేపర్ బ్యాగులను ఉపయోగించాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కోరారు. (ఎస్‌బీఐ గుడ్ న్యూస్, వారికి ప్రత్యేక పథకం)
Comments
Please login to add a commentAdd a comment