కొనాలంటే చుక్కల్లో... | Burden of formers | Sakshi
Sakshi News home page

కొనాలంటే చుక్కల్లో...

Published Sat, Dec 20 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 6:26 PM

Burden of formers

కడప అగ్రికల్చర్: మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా రైతన్నలపై ప్రభుత్వాలు భారం మోపుతున్నాయి. కంపెనీలకు మేలు చేస్తూ రైతును నడ్డివిరిచేలా చర్యలు ఉంటున్నాయి. ఇప్పటికే కష్టాల సుడిగుండంలో ఇరుక్కుని బాధపడుతున్న రైతన్నను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు చేష్టలుడిగి చూస్తున్నాయి. ఆదుకోని వాతావరణ పరిస్థితులతో కష్టాల సాగును నెట్టుకొస్తున్నా... చివరికి వారికి మిగిలేది అప్పులే. మద్దతు ధరలు లేక ఒక పక్క దళారుల దోపిడీతో మరోపక్క ఏటా నష్టాలను మూడగట్టుకుంటున్నారు.
 
 ఇప్పటికే పూర్తిగా ఖరీఫ్ పంటలు కోల్పోయి అల్లాడుతుంటే రబీసాగు మరింత భారమైంది. తాజాగా ఎరువుల ధరలను పెంచుకునేందుకు వీలు కల్పించడంతో ఆయా కంపెనీలు ధరలను ఇష్టారాజ్యంగా పెంచుకుని రైతుల నడ్డి విరుస్తున్నాయి. పంటల సాగు తాజాగా ఆయా కంపెనీలు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పది శాతం భారం కోట్లకు చేరింది. ఇప్పటికే 50 కిలోల డీఏపీ బస్తా ధర రూ.1192 కాగా, ఇప్పుడు పెరిగిన ధరతో రూ.1249కి చేరింది. కాంప్లెక్స్ ఎరువులు రూ.36 నుంచి 75కు చేరుకుంది. అన్ని ఎరువులు సరాసరి కలిపి రూ.50 నుంచి 60 కి పెంచారు. ఈ ఏడాది ఖరీఫ్ రబీ సీజన్లకుగాను డీఏపీ 30 వేల మెట్రిక్ టన్నులు, కాంపెక్స్ ఎరువులు 70 వేల మెట్రిక్ టన్నులు తెప్పించారు. ఖరీఫ్, రబీ సీజన్లకుగాను డీఏపీ ఎరువులకు రూ 3.74 కోట్లు ఖర్చుపెట్టగా, కాంప్లెక్స్ ఎరువుపై రూ.8.33 కోట్లు చెల్లిస్తున్నారు. ఈ భారం మొత్తం జిల్లా రైతులపై రూ.12.07 కోట్లు పడుతోంది. ఈ ధరల పెంపుతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
 
  కంపెనీలు ఎరువుల ధరలు, క్రిమి సంహారక మందుల ధరలు పెంచుతున్నా తాము పండించిన పంట దిగుబడులకు మాత్రం ప్రభుత్వం మద్దతు ధరలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట పెట్టుబడులు మాత్రం ఏటా పెరుగుతున్నాయని చెబుతున్నారు. ప్రభుత్వాలు విత్తన, ఎరువుల ధరల నియంత్ర ణలో విఫలమవడంతోనే ఏటా సాగు భారం పెరుగుతోందని రైతు సంఘాలు దుయ్యబడుతున్నాయి.
 
 వరి పంట తీసుకుంటే.....
 ఖరీఫ్‌లో ఎకరానికి వరి సరాసరి దిగుబడి 3 పుట్లు (24 బస్తాలు) వచ్చింది. మార్కెట్‌లో ఆయా రకాలను బట్టి పుట్టి ధర రూ. 8700 నుంచి రూ. 8900 పలుకుతున్నాయి.  వచ్చిన దిగుబడికి రూ.26100 నుంచి రూ.26700లు వస్తుంది.  నాణ్యత ఉంటే పై ధరతో వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. అదే కొంత తాలుచెత్త వంటివి కనిపిస్తే ధర అమాంతంగా తగ్గించి కొనుగోలు చేస్తూ దోచుకుంటున్నారు. పంట పెట్టుబడికి మార్కెట్ ధరలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటోంది. దీంతో రైతుకు మిగిలేది అల్లీకి అల్లీ....సున్నకు సున్నగా ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement