రాజమండ్రి: రాజమండ్రి నగరం మోరంపూడి జంక్షన్ వద్ద ఓ బస్సు జనంలోకి దూసుకెళ్లిన సంఘటన ఆదివారం జరిగింది.
మోరంపూడి జంక్షన్లో కారును ఢీకొట్టి.. జనాలపైకి వెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అది ఓ ప్రైవేట్ కాలేజీ బస్సుగా గుర్తించారు. బస్సుకు బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ బస్సు కారు, బైక్లను ఢీకొట్టింది. ఇంకా ప్రమాదానికి సంబంధించి వివరాలు తెలియరావాల్సి ఉంది.
జనంపైకి దూసుకెళ్లిన బస్సు..
Published Sun, Feb 1 2015 1:33 PM | Last Updated on Sat, Sep 2 2017 8:38 PM
Advertisement
Advertisement