వాకింగ్కు వెళ్లిన వ్యాపారి కిడ్నాప్ | Businessman kidnapped in Tenali | Sakshi
Sakshi News home page

వాకింగ్కు వెళ్లిన వ్యాపారి కిడ్నాప్

Published Thu, Aug 21 2014 1:47 PM | Last Updated on Sat, Sep 2 2017 12:14 PM

Businessman kidnapped in Tenali

గుంటూరు: తెనాలి పట్టణంలో కిడ్నాప్ అయిన మువ్వ సాయిబాబును బిజినెస్ పార్టనర్లే కిడ్నాప్ చేశారని ఆయన కుటుంబ సభ్యులు గురువారం ఆరోపించారు. ఈ మేరకు తెనాలి వన్టౌన్లో సాయిబాబు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆయన కిడ్నాప్కు రైస్ మిల్లులో గొడవలే కారణమని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలీసుల కథనం ప్రకారం... ఈ రోజు ఉదయం సాయిబాబు వాకింగ్ కోసం బయటకు వెళ్లారు. ఆయన ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆయన కిడ్నాప్ అయ్యారని కుటుంబ సభ్యులు అనుమానించారు. ఆ క్రమంలో సాయిబాబ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement