సాక్షి, కర్నూలు: యేటా భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా విడిది సమస్య తలెత్తకుండా శాశ్వత చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. మహా శివరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో శనివారం ఆయన స్థానిక గంగా సదన్‌లో దేవస్థానం ఈవో చంద్రశేఖర్ ఆజాద్‌తో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శ్రీభ్రమరాంబా మల్లికార్జునుల బ్రహ్మోత్సవాలు సమష్టి కృషితోనే విజయవంతం అయ్యాయన్నారు. వారం రోజుల్లో సుమారు 15 లక్షల మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్వించుకున్నట్లు చెప్పారు. శివరాత్రి రోజున భక్తుల సంఖ్య 4 లక్షలకు చేరుకుందన్నారు. శివస్వాములకు శాశ్వత క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో సామాన్య భక్తులకు దర్శనం సులభతరమైందన్నారు. తాత్కాలిక విడిది ఏర్పా టు చేసినా చాలా మంది శివస్వాములు ఆరుబయట పడుకోవాల్సి వచ్చిన మాట వాస్తవమేనన్నారు. వచ్చే ఏడాది ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తామని.. శాశ్వతంగా డార్మెంటరీలను నిర్మిస్తామన్నారు.
అదేవిధంగా సాక్షిగణపతి నుంచి దేవస్థానం వరకు వాహనాల రద్దీ పెరగడంతో కాలినడక భక్తులు ఇక్కట్లకు లోనయ్యారన్నారు. ఈ దృష్ట్యా రోడ్డును విస్తరించి తిరుపతి తరహాలో రేకుల షెడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈవో ఆజాద్ మాట్లాడుతూ మాస్టర్‌ప్లాన్‌తో శ్రీశైలం రూపురేఖలు మారుస్తామన్నారు. 30 మంచినీటి ట్యాం కులను నిర్మించనుండటంతో తాగునీటి సమస్యకు పరిష్కా రం లభిస్తుందన్నారు. దేవస్థానం ప్రధాన రహదారిలోని 300 దుకాణాలను మరో ప్రాం తానికి తరలిస్తున్నామన్నారు.
ఔటర్ రింగ్ రోడ్డు బీటీ పనులు వచ్చే ఏడాది నాటికి పూర్తి చేస్తామన్నారు. ఉత్సవాల్లో 19 లక్షల లడ్డూ ప్రసాదాలను విక్రయించామని, ఎన్నడూ లేని వి ధంగా ఈ విడత నాణ్యతకు పెద్దపీట వేశామన్నారు. అనంతరం ఉత్సవాలను విజయవంతం చేసిన సిబ్బందిని కలెక్టర్, ఈవోలు సన్మానించారు. సమావేశంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఆల్తూరి ఆదినారాయణరెడ్డి, జెడ్పీ సీఈవో సూర్యప్రకాశ్, ఆలయ ఏఈఓ రాజశేఖర్, జిల్లా వైద్యాధికారి నరసింహులు, డిప్యూటీ రవాణా కమిషనర్ శివరామ్‌ప్రసాద్, సీపీఓ ఆనంద్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
విడిది సమస్య తలెత్తనివ్వం
Published Sat, Mar 1 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM
Advertisement