సాక్షి, పెద్దాపురం : నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు పాలన వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. 218వ రోజు పాదయాత్ర కొనసాగిస్తోన్న జననేత వైఎస్ జగన్‌ను కేబుల్ సంఘాల ఆపరేటర్స్ ప్రతినిధులు కలుసుకున్నారు. సీఎం చంద్రబాబు దుశ్చర్యలతో తమ కేబుల్ వ్యవస్థ పూర్తిగా నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. పోల్ ట్యాక్స్ విధానంతో తమకు చాలా నష్టం జరుగుతోందన్నారు.
బ్రాడ్ బ్రాండ్, కేబుల్ ఆపరేటర్స్‌ను టీడీపీ సర్కార్ దోచుకుంటోందని విమర్శించారు. కార్పొరేట్ అండర్ గ్రౌండ్ పేరుతో టీడీపీ పెత్తనం చేస్తోందని రాజన్న తనయుడు వైఎస్ జగన్‌కు కేబుల్ ఆపరేటర్స్ ప్రతినిధులు తమ గోడు వెల్లబోసుకున్నారు. అధికారంలోకి రాగానే ఫైబర్ గ్రిడ్ చట్టం తెస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారని కేబుల్ సంఘాల ఆపరేటర్స్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. పోల్ ట్యాక్స్‌ను సైతం వైఎస్ జగన్ తీసేస్తామని చెప్పారని వివరించారు. మరోవైపు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్ జగన్ తన పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment