ప్రశాంతంగా పంచాయతీ
Published Mon, Feb 24 2014 3:07 AM | Last Updated on Sat, Sep 2 2017 4:01 AM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరీక్షలు. ఏ పొరపాటు జరిగినా జిల్లా పరువు పోతుందని భావించి న అధికారులు పంచాయతీ సెక్రటరీ పరీక్షలను పక్కా ప్రణాళికతో విజయవంతంగా, ప్రశాంతంగా నిర్వహించా రు. పేపర్ల పంపిణీ సమయంలో కూడా ఎటువంటి గందరగోళమూ తలెత్తలేదు. జిల్లా వ్యాప్తంగా 117 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 30వేల 67 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా ఉదయం జరిగిన పేపర్-1 కు 22,403 మంది అభ్యర్థులు హాజరవ్వగా, 7664 మంది గైర్హాజరయ్యారు.74.51 శాతం మంది పరీక్ష రాశారు. అలాగే మధ్యాహ్నం జరిగిన పేపర్-2 పరీక్షకు 22,270 మంది మాత్రమే హాజరయ్యారు. 7979 మంది గైర్హాజరయ్యారు.74.07 శాతం మంది పరీక్ష రాశారు. డిగ్రీ అర్హతతో జరిగిన ఈ పరీక్షల పట్ల అభ్యర్థుల్లో ఆసక్తి ఎక్కువగానే కన్పించింది. ప్రత్యేకాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరపడంతో ఎటువంటి అవకతవకలూ జరగలేదు. దీంతో జిల్లా యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.
జాయింట్ కలెక్టర్ బి.రామారావు జేఎన్‌టీ యూ, ఆంధ్రాయూనివర్సిటీ క్యాంపస్, బీసెంట్ హైస్కూల్ కేంద్రాల్లో జరిగిన పరీక్షలను పరిశీలించారు. ఇదిలా ఉండగా గ్రామీణాభివృద్ధి అంశంలో జరిగి న పేపర్-2లో పలు అంశాలు క్లిష్టంగా ఉండడంతో తికమక పడ్డామని అభ్యర్థులు కొందరు అభిప్రాయ పడ్డారు.
నిరుద్యోగులపై ఆర్టీసీ భారం?
విజయనగరం అర్బన్: ‘అదునుచూసి కత్తికి పదును పెట్టాలి..’ అన్న చందంగా మారింది ఆర్టీసీ వ్యవహారం. పీకల లోతు నష్టాల్లో మునిగిన ఆర్టీసీ ఆదాయం కోసం ప్రయాణికుల డిమాండ్ చూసి ప్రత్యేక సర్వీసుల పేరుతో అప్పడప్పుడు అదనపు చార్జీలు వసూలు చేస్తోంది. జిల్లాలో ఆదివారం నిర్వహించిన పంచాయతీ కార్యదర్శు ల పోస్టుల పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు పెంచిన అదనపు చార్జీలు ఆర్థిక భారాన్ని మోపాయి. పరీక్షా కేంద్రాలున్న జిల్లా, మండల కేంద్రాల నుంచి అభ్యర్థుల ఆసరాను అదునుగా చేసుకుని ఆర్టీసీ ఏకంగా 40 శాతం అదనపు చార్జీలు పెంచింది. దీంతో రెగ్యులర్‌గా ఉండే చార్జీలు కాస్తా ప్రత్యేక బస్సుల ఏర్పాటుతో భారం పెరిగింది. ప్రత్యేకం పేరుతో వేసిన సర్వీసులపై రూ.15 ఉన్న టిక్కెట్‌ను రూ. 20కు రూ.30 ఉన్న చార్జీని రూ. 40కి పెంచుతూ వసూలు చేశారు. జిల్లాలోని 117 కేంద్రాలలో అభ్యర్థులు పరీక్షలు రాశారు. ప్రతి కేంద్రానికి అన్ని ప్రాంతాల నుంచి అభ్యర్థులను కేటాయించడంతో రవాణా రద్దీ అనివార్యమైంది.
ఎక్స్ ప్రెస్‌చార్జీలే..!: ఆర్టీసీ అధికారులు
ఆదివారం నిర్వహించిన బస్సు సర్వీసులపై ప్రత్యేకంగా చార్జీలను పెంచలేదని ఆర్టీసీ నెక్ రీజియన్ అధికారులు చెబుతున్నారు. సర్వీసుల ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం కాబట్టి అన్ని సర్వీసుల్లోనూ ఎక్స్‌ప్రెస్ చార్జీలను వసూలు చేశామని చెప్పారు.
Advertisement
Advertisement