ప్రచార కమిటీలు చురుకైన పాత్ర పోషిస్తాయి | Campaign committees play an active role | Sakshi
Sakshi News home page

ప్రచార కమిటీలు చురుకైన పాత్ర పోషిస్తాయి

Published Fri, Oct 6 2017 1:42 PM | Last Updated on Wed, Jul 25 2018 4:50 PM

Campaign committees play an active role - Sakshi

విజయవాడ:   రాష్ట్రంలో ప్రజావ్యతిరేక, మోసపూరిత పాలనను ఎండగడుతూ చంద్రబాబునాయుడు సర్కారుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టే పోరాటంలో పార్టీ ప్రచార కమిటీలు చురుకైన పాత్రను పోషిస్తాయని కమిటీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జొన్నలగడ్డ  శ్రీనివాసరెడ్డి తెలిపారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో పార్టీ రాష్ట్ర అ«ధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించబోయే పాదయాత్రకు ప్రచార కమిటీ ఏవిధమైన తోడ్పాటు అందించాలి?, ప్రజల్లోకి ఎలా చొచ్చుకుపోవాలనే అంశాలపైరాష్ట్ర కార్యవర్గం, జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులతో సమావేశం ఏర్పాటుచేశామన్నారు.

 వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టే పాదయాత్రకు సంబంధించి ప్రచార కమిటీలకు పలు బాధ్యతలు అప్పగించామన్నారు. పార్టీ చేపడుతున్న నవరత్నాల కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళతామని తెలిపారు. రాష్ట్ర ప్రచారకమిటీ కార్యదర్శి పెన్నమత్స రామురాజు, కంది సంజీవరెడ్డి, ఏలూరు శేషగిరిరావు, టి.బలరామ్‌మోహ న్, జిల్లాల  ప్రచార కమిటీ అ«ధ్యక్షులు పోతిరెడ్డి సుబ్బారెడ్డి(విజయవాడ)సుధీర్‌బాబు(పశ్చిమగోదావరి), మొహంతి కృష్ణమోహన్‌ (విజయనగరం), బర్కత్‌ అలీ (గ్రేటర్‌ విశాఖనగరం), విజయవాడ నగర ప్రధాన కార్యదర్శులు  సొంగా చందన్, తాడి శివ, ఈశ్వర్‌రెడ్డి, నగర కార్యదర్శి మద్దిరాల పోలరెడ్డి, సహాయ కార్యదర్శి తోకల చంద్రశేఖర్,  బీఎన్‌వీ రామకృష్ణ  పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement