అధికారులకు బాబు ఆదేశం
వాటి స్థానంలో కొత్తవారికి అవకాశమివ్వండి
60 ఏళ్లను ప్రామాణికంగా తీసుకోండి
హైదరాబాద్: వృద్ధాప్య, వితంతు, వికలాంగ తదితర పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హులను గుర్తించి, వారికి పింఛను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం అధికారులను ఆదేశించారు. రూ.1,000, రూ.1,500లకు పెంచిన పింఛన్లను అక్టోబర్ 2వ తేదీ నుంచి అమలు చేసే అంశంపై శుక్రవారం సీఎం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ, మున్సిపల్ వార్డు స్థాయిల్లో జరుగుతున్న పింఛనుదారుల తనిఖీల సందర్భంగా అనర్హులను తొలగించి గ్రామ, వార్డు స్థాయి జాబితాను ప్రకటించాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఆదేశించారు.
కొత్త పింఛను కోసం దరఖాస్తు చేసుకునే వారితో మరొక జాబితా తయారుచేసి.. వీరికి రద్దయ్యే పింఛనుదారుల స్థానంలో ప్రాధాన్యత క్రమంలో అవకాశం కల్పించాలని సూచించారు. పేదరికం, వయస్సు ప్రాతిపదికన పింఛనుదారుల అర్హతను నిర్ధారించాలని, కొత్త వారి ఎంపికను చేపట్టాలని ఆదేశించారు. 60 ఏళ్ల వయస్సు కచ్చిత ప్రామాణిక అంశంగా ఉండాలన్నారు. తనిఖీల అనంతరం ఇంటికి ఒక్కరికే పింఛను అన్నది స్పష్టంగా ఉండాలని పేర్కొన్నారు. ఎటువంటి ఆధారం లేని 80 ఏళ్లు దాటినవారి కుటుంబంలో ఇద్దరికి పింఛను మంజూరు చేసేందుకు అనుమతిచ్చారు.
అనర్హుల పింఛన్లు రద్దు చేయండి
Published Sat, Sep 20 2014 1:53 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement