
హత్యచేసి తలతీసుకెళ్లారు
జి.మాడుగుల: విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం వంజరి పంచాయతీ పినకిల్తారి గ్రామానికి చెందిన వంజరి పోతురాజు (45) ఆదివారం రాత్రి దారుణహత్యకు గురయ్యాడు. అతడిని హత్య చేసినవాళ్లు తలను నరికి తీసుకెళ్లారు. జి.మాడుగుల-నర్సీపట్నం రోడ్డులో పినకిల్తారి,పెదకిల్తారి జంక్షన్ కర్రిమామిడి వద్ద ఈ మొండేన్ని సోమవారం ఉదయం కనుగొన్నారు.
పోతురాజుకు ఇంకా పెళ్లి కాలేదు. మద్యం తాగే అలవాటు ఉంది. అన్నయ్య కొడుకు వంజరి నాయుడుతో కలసి జీవిస్తున్నాడు. రోజూ గ్రామంలో ఎవరో ఒకరి ఇంటి వద్ద నిద్రపోతుంటాడని తెలుస్తోంది.